తప్పుగా అనుకోకండీ ప్లీజ్!

Posted: ఏప్రిల్ 8, 2010 in రాజకీయం, వ్యంగ్యం

టాపిక్ అలాంటిదండి,అందుకే ముందుగా క్షమాపణలు అడిగేస్తున్నా!ఈ రోజు ఉదయం అర్జెంట్ పని మీద బైక్ మీద బయటికి వెళ్లాల్సిన పని పడింది.కొద్ది దూరం వెళ్లిన తరువాత బండిలో చూస్తే తైలం తక్కువనిపించింది.సరెలెమ్మని పెట్రోల్ బంకు కి వెళ్తే తాళ్లు దారాలు కట్టి ఎంట్రన్సు దగ్గర అడ్డం పెట్టారు.అయినా లోపలికి వెళ్లేవాళ్లు వెళుతున్నారు కదాని నేను కూడా వెళ్లా!తీరా చూస్తె త్రివర్ణ జెండా(జాతీయ జెండా కాదులెండి ఒక పార్టీ జెండా) పట్టుకుని కొంతమంది బంకు ఓనరు తో ‘బందు కరో బందు కరో’అని అరుస్తున్నారు.ఏమిటబ్బ విషయం అని అడిగితే నిన్న దంతేవాడ జిల్లాలో నక్సల్స్ దాడి కి వ్యతిరేకం గా చత్తీస్‌ఘడ్ ప్రతిపక్షం వాళ్లు కర్రలు గట్రా పట్టుకుని చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారంటా.అదే చెప్మా ఏంటి రోడ్లు కూడా ఇంత ప్రశాంతంగా వున్నాయని అప్పటివరకు అనుకుంటున్నా.బస్సులు తదితర రవాణా సదుపాయాలు కూడా ప్రభావితం అయ్యాయి.ఇంతలో ఒక పెద్దాయన బాటిల్ పట్టుకుని పెట్రోలు కోసం వచ్చాడు.ఎంత అవసరమో మరి అంతలా బతిమాలాడాడు.ఒక పోలిసు జోక్యం పుణ్యమా అని బంకు వాడు పెట్రోలు పోసాడు.ఆ పోలిసు జోక్యం చేసుకోకపోతె వాళ్లు మటుకు ఉపేక్షించేటట్టు అస్సలు లేరు,వారి సొమ్మేమి పోతుందొ మరి!

అసలు ఈ బందులు గట్రా కేవలం వారి బల ప్రదర్శన కోసమే తప్ప ప్రజల సమస్యలు వారికేమి పడతాయి?ఓ రెండు నెలల కిందట ఇక్కడి అధికార పార్టి కేంద్ర ప్రభుత్వం కి వ్యతిరేకంగా ధరల పెంపు  పైన తీవ్రమయిన బందు చేసింది.అసలే పవర్ లో వున్న పార్టి!ఇక పోలిసులు కూడా బందు పూర్తిగా సఫలం కావడానికి తమ వంతు కృషి చేసారు.అసలు ప్రజల అత్యావసరాలు కి ఏ మాత్రం లోటు రానివ్వం,ప్రజల వాహనాల రాక పోకలని అడ్డుకోము అన్నా వీళ్లు సొంత వాహనాలు లేని వారి పరిస్థితి పట్టించుకోరేమి?ఒక మందు మాకు కొందామన్నా,వెళ్లి రావడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వుండదు.ఆ రొజయితే ATMలు కూడా బందు చేసారు.పెట్రోలు బంకులు చెప్పక్కరలేదు.అసలు ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్లని ఎన్నుకున్న పాపానికి ఈ ప్రజలిని ఇలా ఎందుకు హింసించారో అర్దం కాదు.

అక్కడికి ధరలు వీళ్లే పెంచినట్టు.బహుశా కేంద్రం తమ ప్రత్యర్ది పార్టి వారిని గెలిపించినందుకు శిక్ష కాబోసు!ఇక మీదట బుద్దొచ్చి కేంద్ర రాష్ట్రాలలో ఎవరొ ఒకరినే గెలిపించాలి.ఈ రోజు విషయానికి వస్తే అసలు నక్సల్స్ మీద తమ అసంతృప్తి వెలిబుచ్చడానికి వీళ్లకి మామూలు ప్రజానికమే దొరికారా?వెళ్లి ఆ దండకారణ్యంలోనె నక్సల్స్ దగ్గరికి వెళ్లి తమ అసంతృప్తి తెలియబరచవచ్చు కదా.మామూలు జనం పోలిసు బలగాలని చంపిందా ఏమిటి?అసలు పాకిస్తాను లో క్రిందిటేడాది పోలిసు కేంపు మీద తీవ్రవాదులు దాడి చేస్తె మన దేశ మీడియా ఎద్దేవా చేసింది కదా?మరి మన దేశ పోలిసులుకి మాత్రం తమని తామే కాపాడుకోలెని దీన అవస్థలో వున్నారు కదా,ఇంక మామూలు ప్రజలని ఏమి కాపాడుతారని అడగరేమి?ఒహో అందరు సానుబూతి తెలపడం లో బిజిగా వున్నట్టు వున్నారు?ఇప్పుడూ ఇలాంటివి అడిగితే తప్పుగా అనుకుంటారేమో?అలా అన్నానని మీరు తప్పుగా అనుకోవద్దండీ!

వ్యాఖ్యలు
  1. sowmya అంటున్నారు:

    మీరు చెప్పింది నిజమేనండీ, ఆ మధ్య తెలంగాణా విషయంలో కూడా (అ)భాగ్యనగరంలో రోజులతరబడి జరిగిన బందులో చాలామంది సామాన్య ప్రజలు నలిగిపోయారు. రోజుకూలీల పరిస్థితి కడు విచారకరం. ఈ బందు తో బొంది తో స్వర్గానికి పంపిస్తున్నారు సాధారణ ప్రజలని.

    నేనుతప్పుగా రాసాననుకుంటే కృష్ణ గారితో పాటూ నన్ను కూడా క్షమించేయండి 🙂

  2. శ్రీవాసుకి అంటున్నారు:

    ఆకాశంలోంచి ఆకాశవాణి పలుకుతోంది…..

    ఇప్పటికే మీ ఇద్దరిని క్షమించటం జరిగింది.

  3. saamaanyudu అంటున్నారు:

    క్షమాపణలు దేనికండీ. సామాన్యుల వెతలు గురించి బాగా రాసారు. ప్రతి అంశాన్ని తమ ప్రాపకానికి వాడుకునే రాజకీయ పార్టీలు ఉన్నంతవరకు మన పరిస్థితి ఇలానే ఏడుస్తుంది.

  4. krishna అంటున్నారు:

    సౌమ్య, శ్రీవాసుకి,సామాన్యుడు గారు……..
    స్పందించిన మీ అందరికి థాంక్సండి!!

  5. Jayavani అంటున్నారు:

    ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఈ సామాన్య జనాలు చేసిన తప్పేంటో అన్నిటికి వీళ్ళే ఇబ్బందులు పడతారు. బాగా రాసారు రచయితగారు ఈ సమస్య గురించి 🙂

Leave a reply to Jayavani స్పందనను రద్దుచేయి