Archive for the ‘ప్రతి కెలుకుడు’ Category


శ్రావ్యగారు, నిజంగానే నేను చేసినది తప్పు అని ఒప్పుకుంటున్నాను. ఇందులో శ్లేష …శ్లేష ఏమి లేదు లెండి. హద్దులు దాటిన కోపంలో , విచక్షణ కోల్పోయి నేను మిమ్మలని అనకూడని మాటలు అన్నాను. ఈ విషయంలో మిమ్మలని క్షమాపణ అడుగుతున్నాను. కోపం నా బలహీనత. దానిని అదుపులో పెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి వరకు సఫలం కాలేదు. కానీ ఇందులో మీ తప్పు ఏమి లేదా? నేను మిమ్మలని అకారణంగానే ఆ మాటలు అన్నానా?

తి.తి.దే వారి ఆలోచనలో నాకు ద్వంద ప్రవృత్తి కనిపించింది. ఆ విషయమే నేను చెప్పాను. కానీ మీరు నా వాదనలో తప్పు ఏమిటో చెప్పకుండా మతాన్ని గాని దేముడిని గాని పట్టించుకోని నాకు ఆ విషయం పట్టించుకోనక్కరలేదు అన్నారు. అది ఉచిత సలహా కాదా??? నేను ఏమి చెయ్యాలో చెయ్యకూడదో మీరు నాకు చెప్పల్సిన అవసరం వుందా??? ఇది మీ తప్పు కాదా?

దానికి ప్రతి గా నా తత్వం ఏమిటో మీకు చెప్పాను. మనుషులని జాతి, మతాలకి అతీతంగా ( ప్రజాతి లేదా స్త్రీ పురుష లింగానికి అతీతంగా కూడా..) సమానంగా చూడడం నా లక్షణం అని, నాకు మంచి అనిపించింది మెచ్చుకోవడం.. చెడుని ఎత్తి చూపడం ..ఇది నా తత్వం. మరి మీకు ఇందులో ప్రత్యేకంగా నేను ఇచ్చిన ఉచిత సలహా ఏమిటీ??? ఇది మీ అవగాహనలో జరిగిన పొరపాటు కాదా ???

నా వాదనని తప్పు అని మీరు చెప్పలేక… ఆ నిజాన్ని ఒప్పుకోను లేక.. చేసిన పని ఏమిటీ ? మృధు స్వభావులైన హిందువులని కాదు విమర్శించడం .. దమ్ముంటే మత మౌఢ్యంలో మీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన ముస్లిముల బురఖా విధానంని పాత బస్తీకి వెళ్లి విమర్శించండి అని ఉచిత సలహ ఇచ్చారు. వారు నాకు గట్టిగా బుధ్ధి చెబుతారు అని మీ ఉద్దేశ్యం. ఇది వెటకారమా లేక పొరపాటా అని, వెటకారం అయితే మన మధ్య అంత పరిచయం కాని చనువుగాని లేదు, నాకు ఇది నచ్చలేదు అని నేను చెబితే మీరు ఇచ్చిన సమాధానం ఏమిటీ ??? పరిచయం అయితే లేదు, కానీ ఇది వెటకారమే అని అనడం.. నేనెదొ మీకు ఉచిత సలహా ఇచ్చానని పొరబడి… ఇది ఎంత అసంబధ్ధంగా వుంది ??? మీ తప్పు లేదా ఇందులో ???

నాకు కెలకడం అలవాటు లేదు అండి. అసలు కెలకడం కి మీరు మీ కెబ్లాసలు ఇచ్చుకునే నిర్వచనం నాకు తెలియదు. మతం పై నా వ్యక్తిగత అభిప్రాయాలు, నేను పుట్టి పెరిగిన సామాజిక పరిస్థితులు , నేను కలిసిన మహానుభావుల ప్రభావం , నేను చదివిన పుస్తకాలు , నా ఆలోచనా దృక్పధం వలన ఏర్పడినవి. మీరు గాని , మతాన్ని అనుసరించే వారు గాని , వారి మతాన్ని , వారి దేముడిని గొప్పగా చెప్పుకుంటు , రాసిన టపాలు చాలానే చదివాను..ఉదాహరణకి మా మిత్రులు శ్రీ వాసుకి గారు ఒక దేవాలయం గురించి రాసిన టపా ( అక్కడ దేవ విగ్రహం మనం ఎంత ఎత్తులో వుంటే అంతే ఎత్తులో కనిపిస్తుంది అని, చాలా మహిమ గల వారు అని ) చదివాను. కానీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం.. దానిని నేను గౌరవిస్తాను. ఎలాంటి విమర్శ చెయ్యలేదు. సరే ఆయన నా మిత్రులు కనుక నేను అలా చేసాను అనుకుంటున్నారు కదా! నాతో మత విషయంలో భరద్వాజ చర్చిస్తున్నప్పుడు.. హిందు మత నిర్దేశాలు అయిన వేదాలు అందరికి అందుబాటులో లేకపోవడం గాని , వాటిని చదివి అందరు అర్ధం చేసుకోలెనంత క్లిష్టత ( అవి చదవాలంటే అర్ధం చేసుకునే అర్హత కావాలని అతడే చెప్పాడు ) ని, వాటిని చదివినా కుల వ్యవస్థ అనే జాడ్యం ( దీనికి వేదాలు కారణం అని నేను అనలేదు…) ఏర్పడుతుంటే ఉపేక్షించిన ఆ వర్గాలకి ఆ వేదాలు చదవడం వలన కలిగిన విజ్ఞతని ప్రశ్నిస్తే… అకారణంగా నన్ను కులగజ్జి అని ( ఇప్పటికి మీ అందరికి నాది కులగజ్జి అని నిరూపించలేరు అని, నాకు అలాంటి లక్షణాలు లేవని చెబుతున్నాను ) దూషించిన అతడు నాకు మిత్రుడు కాదు కదా !!! ఆయన వేదాలలో ఈశ్వరోపనిషత్తు పై తన వాఖ్యానం రాస్తే… నేనెమీ అకారణ విమర్శ చెయ్యలేదు. అతడి ప్రయత్నం మెచ్చుకుంటూ , గూఢార్ధాలు తీసె పనిలో మనం వాటిని రాసిన వారి అసలు అర్ధాలు మార్చెయ్యడం లేదు కదా అన్నాను. అతడు కూడా అసలు ఉద్దేశ్యాలుని ఇప్పుడు నిరూపించడం కష్టం అని అన్నాడు. నేను అక్కడ కూడా కువిమర్శ చెయ్యలేదు. సింపుల్గా చెప్పాలంటే నాకు ఎవరిని అకారణంగా ఒక మాట అనడం అలవాటు లేదు.

అప్పుడు మలక్ ని తిట్టినా.. ఇప్పుడు మిమ్మలని ఒక మాట { ఒక మాటా? చాలానే అవాకులు చెవాకులు అన్నానులెండి:-( } అన్నా నన్ను అకారణంగా కుల గజ్జి అన్నందుకు… అకారణంగానే వెటకారం ఆడినందుకు.. కోపం వచ్చి విచక్షణ కోల్పోయి.. అలా అన్నాను. అంతే గాని, మీ వ్యక్తిగత అభిప్రాయాలని… నా వ్యక్తిగత అభిప్రాయాలకి వ్యతిరేకం అని పని కట్టుకుని ఒక్క మాట కూడా అనలేదు. అంటే కెలకలేదు.. నేను మీ విషయం లో తప్పు చేసినా అది మీరు నా పట్ల తప్పుగా వెటకారం ఆడినందుకు ప్రతీకార ధోరణిలో అన్నదే ! కానీ నాకు కెలుకుడు కి ప్రతి కెలుకుడు రాదు అని అనిపిస్తుంది. నాకు కోపం వచ్చినట్టు మలక్కి కోపం రావాలని చేసిన నా ప్రయత్నం కొంత వరకు సఫలం అయ్యింది.. { అతడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా … 🙂 } కానీ మీరు నేను అన్నదానికి కోపం తెచ్చుకున్నది తక్కువ.. బాధ పడింది ఎక్కువ అనిపించింది. అందుకు నా క్షమాపణలు. అప్పుడు కూడా నేను చేస్తుంది తప్పు అని అన్నాను.. నా తప్పు ఒప్పుకునే లక్షణం నాకు వుంది. మీరు సింగపూరులో కదా వుండేది. if some body says that they are upset with your words.. won’t you say ” i am sorry” ? won’t you admit your mistake ? మరి మీరు అన్నది నాకు నచ్చలేదని చెప్పినా పొరబాటు అని ఒప్పుకునే సంస్కారం మీకు లేదా ??? బహుశా మీరు నా కన్నా ఎక్కువ చదువుకున్నారు, నా కన్న మంచి సామాజిక పరిస్థితులలో పెరిగారు.. మరి ఏమిటిది ??? అప్పుడు మీరు పొరబాటున అన్నారంటే ఈ గొడవ లేక పోదును కదా !

కెబ్లాసలు…. మీకు ఈ ప్రశ్నలు….

1 ) ఎవరొ.. సభ్యతగా చర్చించలేక కుల ప్రసక్తి తెచ్చి దృష్టి మరలుస్తారు అని.. విషయ ప్రధానమైన సభ్యత కూడిన చర్చ ఆయన చెయ్యలేరు అని విమర్శిస్తున్నారు కదా… మరి హిందూ మతం లో వేదాలు కొద్ది మందికే అందుబాటులో వుండడం గురించి… ఆ వేదాలు చదివిన వారు కూడా కుల వ్యవస్థని నిరోధించని విషయంలో ఆ వేదాల ఉపయోగత గురించి ప్రశ్నిస్తూ.. వాటిని చదివే అర్హత కలవారు పుట్టుకతో ఎలా నిర్ణయింప బడతారు అని అంటూ బ్రాహ్మ… ( ఇంకా మాట కూడా పూర్తి చెయ్యలేదు.. అంటే నా వాదన పూర్తి చెయ్యలేదు అని..శ్లేష..) అనగానే .. ఆహ కుల గజ్జి బయట పెట్టుకున్నారు.. తేనె పూసిన కత్తి… పిల్ల కాకి రూపం లో వున్న రాబందు.. అంటూ మీ ( అవును .. అతడు కెబ్లాస అట కదా…) మలక్ అకారణంగా నన్ను దూషిస్తే.. అది సభ్యతా??? చర్చ పక్క దారి పట్టించడం కాదా??? అతడి తప్పు కాదా??? అతడిని మీరు నీది తప్పు అని అనలేరా?? మీ మతాన్ని దూషించే వారిలోనె మీకు మత విషయం అయ్యి తప్పులు కనబడతాయా ? ఈ విషయంలో ఆయన తప్పుని మీరు ఎవరైనా ఎత్తి చూపారా? కేవలం మతం కి అటువైపు వున్న వారి తప్పులే మీకు కనబడతాయా ? ఇది ద్వంద ప్రవృత్తి కాదా?

2 ) మీ మతాన్ని అకారణంగా ఎవరొ ఏదొ అంటే.. వారిని ఎక్కడ పడితే అక్కడ అపహాస్యం చేస్తారు కదా… మళ్లీ… మీ పట్ల తప్పు చెసిన వారికి ప్రతిదాడి చేసె హక్కు మీకు వుంది అంటారు కదా..వారి తప్పుకి వారి జన్మతః జాతి ఒక సాకుగా చూపి అట్రాసిటీ కేసు వేస్తాను అంటే… అది తప్పు అంటారు కదా… మరి స్త్రీ అని ఒక సాకు చూపి… చేసిన తప్పుని కప్పి పుచ్చే వారు, సానుభూతి కి ప్రయత్నించేవారిది తప్పు కాదా ??? దానిని మీరు విమర్శించరా ???

3) భారత దేశం లో దశాబ్దాలు వుండి.. అమెరికా లోను వుండి.. నాణానికి రెండు వైపులు చూసిన కారణంగా కొందరి వాదనకి విశ్వసనీయత ( ఇది సరి అయిన పదం కాదు అనుకుంటా.. అదేదొ గుర్తుకు రావడం లేదు…) వచ్చినట్టు అయితే… మతం లో వుండి.. మతం బయట కూడా వుండి నాణానికి రెండు వైపులా చూసిన నా వాదన మీకు మతం పై అకారణ ద్వేషం అని ఎందుకు అనిపిస్తుంది… నేను మతం తప్పు అంటే అన్ని మతాలని కలిపే అన్నాను. ఇంకా చెప్పలంటే.. కొంత మంది అజ్ఞాతలు ముసుగు చాటున చేసె అసహ్యమైన వాదనలు హిందూ మతం మిగిలిన మతాల కంటే మెరుగు అన్న నా పూర్వ భిప్రాయం మారిపోవడం తప్పు కాదేమొ??? ముస్లిముల బురఖా పద్ధతి పైన.. కుటుంబ నియంత్రణ పై విముఖత పైనా…పర మత ( కాఫిర్లని) దేషం స్త్రీ కి విడాకుల విషయంలో వున్న వివక్షని విమర్శించి వున్నాను. అలాగే క్రైస్తవం లో సైన్సు వ్యతిరేకత.. మానవ జన్మ పాప భూయిష్టం .. మీ మతం తప్పు.. పాపం నుండి బయట పడాలి అంటే మా మతానికి వచ్చెయ్యండి అనడం తప్పు అని నా ముందటి టపాలో చెప్పి వున్నాను. వీటి కంటె తక్కువ తప్పులు వున్న కారణంగా హిందూ మతం గొప్పది అయ్యిపోదు. మరి నా అభిప్రాయాలని వెటకారం.. అసత్య ఆరోపణలతోని… నొక్కి పెడదామని మీ ప్రయత్నం సరి అయినదేనా ??? నేను నాకు తప్పు అనిపించినది ( కనీసం నా బ్లాగులో అయినా …) చెప్పుకునే హక్కులని.. మీ కెలుకుడు తో ఆపాలని చూడడం కరెక్టేనా ???

ఇది మీకు భయపడో … బాధ పడొ చెబుతున్నది కాదు. నా తప్పులు ఒప్పుకుంటూ మీ తప్పులు చూపడం… అసభ్యతకి పోకుండా.. అబధ్ధపు ఆరోపణలు చెయ్యకుండా మీకు చర్చించగలిగే ధైర్యం చూపగలరా ? కనీసం నా తప్పుని నేను ఒప్పుకున్నట్టు.. మీ తప్పుని ఒప్పుకునేటంత ధైర్యం మీకు వుందా ?

ప్రకటనలు