కోపం అదుపులో పెట్టుకోవడానికి చిట్కాలు…

Posted: జూన్ 25, 2010 in అఙ్నానం, పిచ్చాపాటి

నేను మీకు చెబుతానని మీరు ఇది చదవడం మొదలు పెట్టారు అంటే… మీకు బొత్తిగా బ్లాగ్లోకపు జ్ఞానం లేనట్టే! ఆ చిట్కాలు అవసరం నాకు వున్నంతగా బహుశా ఇంకెవరికి వుండదేమో! అంత కోపం నాకు. ఆ కోపం వలన ఎదుటి వారికి ఇబ్బంది వుండవచ్చు గాక! కానీ ఎక్కువ నష్టపోయెది నేనె! అసలు బ్లాగింగ్ చేసెది ఎందుకు ? కాలక్షేపానికి కొంతమంది, తమ రచనా పాటవాన్ని ప్రదర్శించడానికి కొంతమంది , సినిమాలకి రాయడంకి ప్రాక్టీసు చేసెవారు కొంతమంది , తమ భావజాలాన్ని నలుగురికి చెప్పడానికి కొంతమంది , పై కారణాలు ఏవీ కాకపోయినా కేవలం పాపులారిటీ కోసం కొంతమంది. పాపులారిటీ కోసం రాసె వారి పై నాకేదొ ద్వేషం వుంది అనుకునేరు. వారు పాపులర్ అయ్యిపోతున్నందుకు , నేను పాపులర్ కానందుకు కలిగిన అసూయ నాకైతే లేదు. అది కూడా ఒక కళే ! ఎవరి కారణాలు వారికి వుండవచ్చు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించనంతవరకు తప్పు లేదు. మరి నేనెందుకు బ్లాగు రాస్తున్నా ?

నేనొక అజ్ఞానిని . నా అజ్ఞానం అందరితో పంచుకోలేను. జ్ఞానం అంటే మాక్కావాలి, మాక్కావాలి అని అందరు ఎగబడతారు గాని, అజ్ఞానం ఎవరికి కావాలి బోడి ? అందుకని అజ్ఞానం పంచుకోలేకపోతున్నాను. కానీ నా అజ్ఞానం బయట పెట్టుకోగలను కదా. అప్పుడు ఎవరి దగ్గరన్నా కొంచెం జ్ఞానం వుంటే అది నాకు ఇస్తారని ఆశ ! అలాగే నేనొక అనుమానపు పక్షిని. ఆ అనుమానాలు తీర్చుకోవడానికి , అజ్ఞానం బయట పెట్టుకోవడానికి మరొ పక్షి రూపం ” పిల్లకాకి ” అవతారం ఎత్తాను అన్నమాట ! కానీ నా ఈ అవతారంలో ఒక పెద్ద ఇబ్బంది నా కోపం. నా అనుమానాలు, అభిప్రాయాలు ప్రకటించేటఫ్ఫుడు.. ఎవరన్నా ఒక మాట నన్ను అంటే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. నాకు కోపం వస్తుందా అని ఆశ్చర్యపోయె అమాయకులు కూడా వున్నారండొయి. నమ్మరా… ఇది  చూడండి.

ఇలాగె చాలా మంది నన్ను చూసి శాంతమూర్తి అనుకుంటారు. అదేమి వింతొ 🙂 కోపం మానవ స్వభావం. దానికి ఎవరు అతీతులు కాదు. ఎంత సాధు పుంగవులు అయినా కోపాన్ని అదుపులో పెట్టుకోగలరు మాత్రమే కానీ పూర్తిగా త్యజించలేరు. ఎంతొ కొంత పరిమాణంలో అది అందరిలోను వుంటుంది. మనం ఎంతగా అదుపులో పెట్టుకుందామనుకున్నా , మన మనసు పొరలులో తొక్కివేయబడ్డ కోపం హద్దులు తెంపుకుని బయటకి ఎప్పుడో అప్పుడు వస్తుంది.దానిని నియంత్రించుకునే అదుపు మనకి వుండాలి. ఎక్కువగా శాంతంగా వుండే వారు , అంటే కోపం తెచ్చుకోవలసిన పరిస్థితులలో కూడా శాంతం ప్రదర్శించేవారు, తమ ఆరొగ్యాలని తామే పాడు చేసుకుంటారు. ఏదొ ఒక రూపంలో ఆ కోపాన్ని బయట పెట్టాలి. ఒక పాజిటివ్ ఎనర్జీగా దానిని ఉపయొగించగలిగితే చాలా మంచిది. బహుశా వయసుతో కూడా ఆ నియంత్రణ వస్తుంది కామోసు. ప్రయత్నం తో ఎవరైనా సాధించవచ్చు అనుకుంటాను.

నేను కూడా శాంతం నటించి , కోపాన్ని తొక్కి పెడదామని ప్రయత్నించేవాడినే ! కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కోపం హద్దులు దాటి చెరుపు చేస్తుంది. ఇంట్లో పెళ్లాం తిడితే  స్కూలుకి వచ్చి పిల్లలని చితక్కొట్టేవారు, ఆఫీసులో సబార్డినేట్స్‌ని చీల్చి చెండాడేవారు నా కోవలోకే వస్తారు. ఇంటావిడ మా అయనకి అసలు కోపం అంటే తెలీదు అనుకున్నట్టె నా దగ్గరి వారు నా గురించి శాంతమూర్తిని అనుకుంటారు. కానీ నా అభిప్రాయాలు అనుమానాలు ఇంకా నా అజ్ఞానం బయట పెట్టుకునే దగ్గర ఎవరన్నా నన్ను ఏమి అన్నా అన్నారు అనుకోండి, అక్కడ కోపం వచ్చి నేను అదుపు తప్పితే నాకే నష్టం. ఉదాహరణకి మీ వాదనలో బలం వుంది , కానీ ఎదుటివారు సభ్యతగా వాదించలేక మిమ్మలని దివాలాకోరు అన్నా , వెటకారం చేసినా అది మిమ్మలని కోపం తెప్పించి వాదన పక్క దారి పట్టించడానికే! అప్పుడు మీరు వారు అనుకున్నట్టు అదుపు తప్పే కోపానికి గురి అయితే వాళ్ల లక్ష్యం నెరవేరుతుంది. మీ వాదన మరుగున పడుతుంది. కాబట్టి అప్పుడు కోపం వచ్చిన ఊరుకోవడం ఉత్తమం. ఆలోచించుకుని సమాధానం చెప్పడమొ , వ్యూహత్మక మౌనం పాటించడమో చెయ్యాలి.

ఇక మీదట బ్లాగ్లోకం లో నా కోపం అదుపులో పెట్టుకోవడానికి క్రింద సూచనలు పాటించాలి అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఏమన్నా మీకు తోచితే నాకు చెప్పరూ ప్లీజు…

1) నా బ్లాగులో అందరికి భావ వ్యక్తీకరణ అవకాశం ఇద్దామనుకున్నా దానిని కొద్దిమంది దుర్వినియోగపరిచే అవకాశం వుంది కనుక కామెంటు మోడరేషన్ పెడదాము అని అనుకుంటున్నాను.
2) నా బ్లాగులో గాని, వేరె బ్లాగులలో కానీ చర్చ రచ్చ అయ్యే సంధర్భంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తాను.
3) వేరె బ్లాగులలొ బ్లాగు ఓనరు తో తప్ప పక్క వాఖ్యాతలతో వాదం పెట్టుకోను ( వారే వాదానకి లాగినా.. ఎందుకంటే నా బ్లాగులో మీ పెంట ఏమిటి అని బ్లాగు ఓనరు అనుకోకూడదు కదా! )
4) రోజుకి కేవలం ఒక బ్లాగులో ఒకటి రెండు కామెంట్లు మాత్రమే పెడతాను. ( అవి ఎంత పెద్దవి అయినా సరె ! ) ఎందుకంటె ఎవరన్నా అవాకులు చెవాకులు వాగినా మరుసటి రోజుకి ఆ కోపం చల్లారి పోతుంది అని ఆశ !
5) రోజుకి కేవలం ఒక గంట మాత్రమే బ్లాగింగుకి వెచ్చిస్తాను.
హమ్మయ్యా! మరి ఇక బ్లాగులలొ సునామీలు , కామెంట్ల వర్షాలు [ ఎవరొ ఎక్కడొ అన్నారు , ఇంత వరకు ఒకరిని గోకితే కామెంట్ల వర్షం పడేది అంటా, ఇప్పుడు నన్ను గోకితే ఆ వర్షాలు పడుతునాయి అంటా 🙂 ] పడవని ఎవరన్నా బాధపడితే సారీ 🙂
ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. sowmya అంటున్నారు:

  ఈ మధ్యనే అనుకున్నాను మీరు ఏమయిపోయారా, చానాళ్లయింది చూసి అని. మైల్ పెడదామా అని అనుకునేంతలో మీ పోస్ట్ వచ్చింది.

  మీరు చెప్పిన వాటిల్లో మొదటి మూడు పాయింట్లు తప్పకుండా పాటించవలసినవే. 4-6 పాయింట్లలో పెద్ద పస లేదు.
  కానీ అన్నిటికన్నా ముఖ్యమయినది “ఇలాంటి టపాలు రాయడం పూర్తిగా మానేయడం”. ఏ విషయాన్నైనా సాగదీయకూడదనేది నా అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ వదిలేసి మీ దారిన మీరు రాసుకుంటూ పొండి. మీరు ఇన్నాళ్ళు చాలా చక్కగా మంచి మంచి విషయాల గురించి రాసారు. మంచి డిస్కషన్లు జరిగాయి. కాబట్టి అదే పద్ధతిలో సాగిపొండి ఇకపై కూడా. మిగతా అనవసర విషయాలు వదిలేయండి.

  • krishna అంటున్నారు:

   అయ్యో , ఈ టపాలో నేను ఎవరిని ఏమి అనలేదు కదండీ! కేవలం కొన్ని సూచనలు కోసం రాసిన టపా ఇది.
   ఇకపోతే ఈ మధ్య కొంచెం బిజీగా వున్నాను లెండి. బహుశా మళ్లీ రేపటి నుండి, వారం రోజుల వరకు కనిపించను.

   • sowmya అంటున్నారు:

    మీరేమైనా అన్నారని కాదండీ… జనరల్ గా చెప్పాను. ఇంక ఈ కోపాలు, ఆవేశాలు, తగవులు పక్కనబెట్టి మంచి టపాలు రాయండి అని. అంటే ఇది మంచి టపా కాదని కాదు, కాని అవసరం లేనిదేమో అనిపించింది అంతే.
    నామాటలు నొప్పించి ఉంటే sorry 🙂

   • krishna అంటున్నారు:

    అలాంటిది ఏమి లేదు లెండి. కొన్ని పుస్తకాలు చదువుతున్నాను , సరదావి కావు సీరియస్ విషయాల మీదే ! కానీ వాటిని చర్చిద్దామన్నా మళ్లీ ఎవరన్నా నొచ్చుకుంటారని ఆలోచిస్తున్నాను.మంచి టపాలు అంటే సీరియస్సు విషయాలే కదా!ఏ అంశం తీసుకున్నా రెండు వర్గాలు వుంటాయి. ఎవరిని నొప్పించకుండా బాలెన్స్ గా రాయడం రావాలి ఇంకా ! అన్నట్టు కొ.కు. గారి పుస్తకాలు ఏమన్నా సూచిస్తారా ?

 2. sowmya అంటున్నారు:

  ఎవరికోసమూ ఏమీ చెయ్యకండి,మీకోసం మీరు చెయ్యండి ఏమైనా…ఎప్పుడూ ఇరుపక్షాలు, వాదనలు అనేవి ఉంటూనే ఉంటాయి. అందరికీ నచ్చే విధంగా రాయాలని ఎప్పుడూ అనుకోకండి, అది ఎవరూ ఎప్పుడూ చెయ్యలేరు. మీకు నచ్చిన విధంగానే రాయండి, కానీ వచ్చే విమర్శనలను ఎలా డీల్ చెయ్యాలో తెలుసుకుంటే చాలు అంతే. ఎవరో మెచ్చుకుంటారనో, నొచ్చుకుంటారనో ఏ పనీ చెయ్యొద్దు. మీకు ఏది ఇష్టమో అదే చెయ్యండి.

  ఇలా చెప్తున్ననని ఏమీ అనుకోండి. మీ శ్రేయోభిలాషిగా కొన్ని సలహాలు (ఉచితమే కదా) విసిరేస్తున్నా అంతే 😛

  కొ.కు గారిది “చదువు” అనే నవల ఉంటుంది. వీలైతే ముందు అది చదవండి. “కొ.కు సాహిత్యం” అని 6 సంపుటిలుంటాయి. వాటిల్లో ఆయన రాసిన చిన్న కథలుంటాయి. అలాగే “కొ.కు వ్యాసాలు” అని కొన్ని సంపుటిలున్నాయి. ఏవి దొరికినా చదవండి.

  • krishna అంటున్నారు:

   @ sowmya

   >> కానీ వచ్చే విమర్శనలను ఎలా డీల్ చెయ్యాలో తెలుసుకుంటే చాలు అంతే. >>

   వాదన తోనొ , విమర్శ తోనొ నాకు ఇబ్బంది లేదు లెండి. ఇంతకు ముందు ఎంత మందితో వాదనలు రాలేదు, ఎంత మంది నన్ను విమర్శించలేదు. కానీ ఎదుటివారి ఉద్దేశ్యం అసలు చర్చ కాకుండా , మనసులో ఏదొ పెట్టుకుని మనలని ఒకటి అంటె ఊరుకోవడం చేత కావడం లేదు. దీని పై ఏదన్నా సలహా ఇవ్వ్వండి , ఉచితం కాకపోయినా పరవాలేదు.. నూట పదహారు పైసలు బహుమతి కూడా ప్రకటిస్తున్నానహొ.. 🙂

 3. nagarjuna అంటున్నారు:

  అంతగా కావాలనుకుంటే బాసు ఓ పని చెయి….నువు నవ్వుతుండగా ఉన్న ఒకఫొటొ, ఒక అద్దం పక్కపక్కన ఉంచి వాటిని నీ కంప్యూటర్ దగ్గర పెట్టుకో. బ్లాదు రాస్తున్నప్పుడు, వ్యాఖ్యలు రాస్తున్నప్పుడు ప్రతి అయిదు మినుషాలకోసారి వాటిని చూడు. బస్తీమే సవాల్ కోపమొస్తే నన్నడుగు… 🙂

 4. శ్రీవాసుకి అంటున్నారు:

  అసలెప్పుడూ కోపమే రాకూడదనుకొంటే మీ ఫోటోతోపాటు మలక్ పేట రౌడిగారి ఫోటో కూడా పెట్టుకోండి. అప్పుడు మీరు కోపాన్ని జయించినట్లే. ఆలోచించండి. ha ha ha…

  • krishna అంటున్నారు:

   బాగుంది సలహా ! కోపం రాకుండా కాదు లెండి వుండాల్సింది , అదుపులో పెట్టుకోవడం సమస్య ! దానికి ఇదే సమాధానం అయితే ఆ ఫొటొ ఏదొ మీరె సంపాదించి పెట్టండి.పుణ్యం వుంటాది 🙂

   • శ్రీవాసుకి అంటున్నారు:

    అభిమానంగా మీరు ఒక ఇ-మెయిల్ కొడితే రెక్కలు కట్టుకొచ్చి మరీ ప్రేమగా మీ చేతిలో ఆయన తన ఫోటో పెట్టరా ఏమిటి.

   • krishna అంటున్నారు:

    అంటే ఉత్తి సలహాలు మాత్రమే మీరు ఇస్తారు అన్న మాట 😦
    ఆ మాత్రం సహాయం కూడా మన స్నేహం కోసం చెయ్యలేరా మీరు.. ఉహ్మ్…

 5. ranjani అంటున్నారు:

  @ krishna ,
  ఎలక్ట్రానిక్సు సమస్యలకి పరిష్కారం సూచించడానికి ఆన్లైను ఫోరంలు ఉన్నాయని మీకు తెలిసే ఉండాలి …
  తెలుగులో ఒక ఫొరం : మహీగ్రాఫిక్సు ; ఇంగ్లీషులో అయితే బోలెడు ( techenclave , techarena , … )

 6. Jayavani అంటున్నారు:

  My free of cost suggestions asre
  Just concentrate on your good work,
  don’t think about others, just be yourself.
  If someone says a different opinion to yours, then just accept it, don’t try to argue and make them to accept your point.
  They have all the rights to say what they think about a particular issue. So, just respect their opinion and keep quite.
  Similarly when you are posting comments on others blogs be political and try not hurt anyone directly with your opinions
  Don’t take anythign personal, if someone does personal comments, ignore it. It shows their character and will not spoil yours at all
  And finally don’t prolong the matters, just leave them there and try to occupy (divert) yourself with something else. I agree with Sowmya on this regard.

  That’s all from my side 🙂

  Hope that helps 🙂

  • krishna అంటున్నారు:

   హ్మ్… థాంక్స్. కొంచెం కష్టమే అయినా నెమ్మది నెమ్మదిగా ప్రయత్నిస్తాను.
   ఒక సలహా! మీరు తెలుగులో వాఖ్యలు రాస్తే బాగుంటుంది ఏమొ ప్రయత్నించి చూడండి.

 7. sana అంటున్నారు:

  chala chandalam ga rasaru,other persions kee motivated ga ledhu

  • krishna అంటున్నారు:

   సన గారు,
   బహుషా టపా లొ ఇది నా కోపం తగ్గించుకోడానికి నేను రాసుకున్నానని రాసినట్టు గుర్తు. మిమ్మలని నిరాశ పరిస్తే క్షమాపణలు

 8. nani అంటున్నారు:

  hi, friend i like your post

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s