శ్రావ్యగారు , కెబ్లాసలు నాది తప్పే !!!

Posted: జూన్ 11, 2010 in కెలుకుడు, ప్రతి కెలుకుడు

శ్రావ్యగారు, నిజంగానే నేను చేసినది తప్పు అని ఒప్పుకుంటున్నాను. ఇందులో శ్లేష …శ్లేష ఏమి లేదు లెండి. హద్దులు దాటిన కోపంలో , విచక్షణ కోల్పోయి నేను మిమ్మలని అనకూడని మాటలు అన్నాను. ఈ విషయంలో మిమ్మలని క్షమాపణ అడుగుతున్నాను. కోపం నా బలహీనత. దానిని అదుపులో పెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి వరకు సఫలం కాలేదు. కానీ ఇందులో మీ తప్పు ఏమి లేదా? నేను మిమ్మలని అకారణంగానే ఆ మాటలు అన్నానా?

తి.తి.దే వారి ఆలోచనలో నాకు ద్వంద ప్రవృత్తి కనిపించింది. ఆ విషయమే నేను చెప్పాను. కానీ మీరు నా వాదనలో తప్పు ఏమిటో చెప్పకుండా మతాన్ని గాని దేముడిని గాని పట్టించుకోని నాకు ఆ విషయం పట్టించుకోనక్కరలేదు అన్నారు. అది ఉచిత సలహా కాదా??? నేను ఏమి చెయ్యాలో చెయ్యకూడదో మీరు నాకు చెప్పల్సిన అవసరం వుందా??? ఇది మీ తప్పు కాదా?

దానికి ప్రతి గా నా తత్వం ఏమిటో మీకు చెప్పాను. మనుషులని జాతి, మతాలకి అతీతంగా ( ప్రజాతి లేదా స్త్రీ పురుష లింగానికి అతీతంగా కూడా..) సమానంగా చూడడం నా లక్షణం అని, నాకు మంచి అనిపించింది మెచ్చుకోవడం.. చెడుని ఎత్తి చూపడం ..ఇది నా తత్వం. మరి మీకు ఇందులో ప్రత్యేకంగా నేను ఇచ్చిన ఉచిత సలహా ఏమిటీ??? ఇది మీ అవగాహనలో జరిగిన పొరపాటు కాదా ???

నా వాదనని తప్పు అని మీరు చెప్పలేక… ఆ నిజాన్ని ఒప్పుకోను లేక.. చేసిన పని ఏమిటీ ? మృధు స్వభావులైన హిందువులని కాదు విమర్శించడం .. దమ్ముంటే మత మౌఢ్యంలో మీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన ముస్లిముల బురఖా విధానంని పాత బస్తీకి వెళ్లి విమర్శించండి అని ఉచిత సలహ ఇచ్చారు. వారు నాకు గట్టిగా బుధ్ధి చెబుతారు అని మీ ఉద్దేశ్యం. ఇది వెటకారమా లేక పొరపాటా అని, వెటకారం అయితే మన మధ్య అంత పరిచయం కాని చనువుగాని లేదు, నాకు ఇది నచ్చలేదు అని నేను చెబితే మీరు ఇచ్చిన సమాధానం ఏమిటీ ??? పరిచయం అయితే లేదు, కానీ ఇది వెటకారమే అని అనడం.. నేనెదొ మీకు ఉచిత సలహా ఇచ్చానని పొరబడి… ఇది ఎంత అసంబధ్ధంగా వుంది ??? మీ తప్పు లేదా ఇందులో ???

నాకు కెలకడం అలవాటు లేదు అండి. అసలు కెలకడం కి మీరు మీ కెబ్లాసలు ఇచ్చుకునే నిర్వచనం నాకు తెలియదు. మతం పై నా వ్యక్తిగత అభిప్రాయాలు, నేను పుట్టి పెరిగిన సామాజిక పరిస్థితులు , నేను కలిసిన మహానుభావుల ప్రభావం , నేను చదివిన పుస్తకాలు , నా ఆలోచనా దృక్పధం వలన ఏర్పడినవి. మీరు గాని , మతాన్ని అనుసరించే వారు గాని , వారి మతాన్ని , వారి దేముడిని గొప్పగా చెప్పుకుంటు , రాసిన టపాలు చాలానే చదివాను..ఉదాహరణకి మా మిత్రులు శ్రీ వాసుకి గారు ఒక దేవాలయం గురించి రాసిన టపా ( అక్కడ దేవ విగ్రహం మనం ఎంత ఎత్తులో వుంటే అంతే ఎత్తులో కనిపిస్తుంది అని, చాలా మహిమ గల వారు అని ) చదివాను. కానీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం.. దానిని నేను గౌరవిస్తాను. ఎలాంటి విమర్శ చెయ్యలేదు. సరే ఆయన నా మిత్రులు కనుక నేను అలా చేసాను అనుకుంటున్నారు కదా! నాతో మత విషయంలో భరద్వాజ చర్చిస్తున్నప్పుడు.. హిందు మత నిర్దేశాలు అయిన వేదాలు అందరికి అందుబాటులో లేకపోవడం గాని , వాటిని చదివి అందరు అర్ధం చేసుకోలెనంత క్లిష్టత ( అవి చదవాలంటే అర్ధం చేసుకునే అర్హత కావాలని అతడే చెప్పాడు ) ని, వాటిని చదివినా కుల వ్యవస్థ అనే జాడ్యం ( దీనికి వేదాలు కారణం అని నేను అనలేదు…) ఏర్పడుతుంటే ఉపేక్షించిన ఆ వర్గాలకి ఆ వేదాలు చదవడం వలన కలిగిన విజ్ఞతని ప్రశ్నిస్తే… అకారణంగా నన్ను కులగజ్జి అని ( ఇప్పటికి మీ అందరికి నాది కులగజ్జి అని నిరూపించలేరు అని, నాకు అలాంటి లక్షణాలు లేవని చెబుతున్నాను ) దూషించిన అతడు నాకు మిత్రుడు కాదు కదా !!! ఆయన వేదాలలో ఈశ్వరోపనిషత్తు పై తన వాఖ్యానం రాస్తే… నేనెమీ అకారణ విమర్శ చెయ్యలేదు. అతడి ప్రయత్నం మెచ్చుకుంటూ , గూఢార్ధాలు తీసె పనిలో మనం వాటిని రాసిన వారి అసలు అర్ధాలు మార్చెయ్యడం లేదు కదా అన్నాను. అతడు కూడా అసలు ఉద్దేశ్యాలుని ఇప్పుడు నిరూపించడం కష్టం అని అన్నాడు. నేను అక్కడ కూడా కువిమర్శ చెయ్యలేదు. సింపుల్గా చెప్పాలంటే నాకు ఎవరిని అకారణంగా ఒక మాట అనడం అలవాటు లేదు.

అప్పుడు మలక్ ని తిట్టినా.. ఇప్పుడు మిమ్మలని ఒక మాట { ఒక మాటా? చాలానే అవాకులు చెవాకులు అన్నానులెండి:-( } అన్నా నన్ను అకారణంగా కుల గజ్జి అన్నందుకు… అకారణంగానే వెటకారం ఆడినందుకు.. కోపం వచ్చి విచక్షణ కోల్పోయి.. అలా అన్నాను. అంతే గాని, మీ వ్యక్తిగత అభిప్రాయాలని… నా వ్యక్తిగత అభిప్రాయాలకి వ్యతిరేకం అని పని కట్టుకుని ఒక్క మాట కూడా అనలేదు. అంటే కెలకలేదు.. నేను మీ విషయం లో తప్పు చేసినా అది మీరు నా పట్ల తప్పుగా వెటకారం ఆడినందుకు ప్రతీకార ధోరణిలో అన్నదే ! కానీ నాకు కెలుకుడు కి ప్రతి కెలుకుడు రాదు అని అనిపిస్తుంది. నాకు కోపం వచ్చినట్టు మలక్కి కోపం రావాలని చేసిన నా ప్రయత్నం కొంత వరకు సఫలం అయ్యింది.. { అతడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా … 🙂 } కానీ మీరు నేను అన్నదానికి కోపం తెచ్చుకున్నది తక్కువ.. బాధ పడింది ఎక్కువ అనిపించింది. అందుకు నా క్షమాపణలు. అప్పుడు కూడా నేను చేస్తుంది తప్పు అని అన్నాను.. నా తప్పు ఒప్పుకునే లక్షణం నాకు వుంది. మీరు సింగపూరులో కదా వుండేది. if some body says that they are upset with your words.. won’t you say ” i am sorry” ? won’t you admit your mistake ? మరి మీరు అన్నది నాకు నచ్చలేదని చెప్పినా పొరబాటు అని ఒప్పుకునే సంస్కారం మీకు లేదా ??? బహుశా మీరు నా కన్నా ఎక్కువ చదువుకున్నారు, నా కన్న మంచి సామాజిక పరిస్థితులలో పెరిగారు.. మరి ఏమిటిది ??? అప్పుడు మీరు పొరబాటున అన్నారంటే ఈ గొడవ లేక పోదును కదా !

కెబ్లాసలు…. మీకు ఈ ప్రశ్నలు….

1 ) ఎవరొ.. సభ్యతగా చర్చించలేక కుల ప్రసక్తి తెచ్చి దృష్టి మరలుస్తారు అని.. విషయ ప్రధానమైన సభ్యత కూడిన చర్చ ఆయన చెయ్యలేరు అని విమర్శిస్తున్నారు కదా… మరి హిందూ మతం లో వేదాలు కొద్ది మందికే అందుబాటులో వుండడం గురించి… ఆ వేదాలు చదివిన వారు కూడా కుల వ్యవస్థని నిరోధించని విషయంలో ఆ వేదాల ఉపయోగత గురించి ప్రశ్నిస్తూ.. వాటిని చదివే అర్హత కలవారు పుట్టుకతో ఎలా నిర్ణయింప బడతారు అని అంటూ బ్రాహ్మ… ( ఇంకా మాట కూడా పూర్తి చెయ్యలేదు.. అంటే నా వాదన పూర్తి చెయ్యలేదు అని..శ్లేష..) అనగానే .. ఆహ కుల గజ్జి బయట పెట్టుకున్నారు.. తేనె పూసిన కత్తి… పిల్ల కాకి రూపం లో వున్న రాబందు.. అంటూ మీ ( అవును .. అతడు కెబ్లాస అట కదా…) మలక్ అకారణంగా నన్ను దూషిస్తే.. అది సభ్యతా??? చర్చ పక్క దారి పట్టించడం కాదా??? అతడి తప్పు కాదా??? అతడిని మీరు నీది తప్పు అని అనలేరా?? మీ మతాన్ని దూషించే వారిలోనె మీకు మత విషయం అయ్యి తప్పులు కనబడతాయా ? ఈ విషయంలో ఆయన తప్పుని మీరు ఎవరైనా ఎత్తి చూపారా? కేవలం మతం కి అటువైపు వున్న వారి తప్పులే మీకు కనబడతాయా ? ఇది ద్వంద ప్రవృత్తి కాదా?

2 ) మీ మతాన్ని అకారణంగా ఎవరొ ఏదొ అంటే.. వారిని ఎక్కడ పడితే అక్కడ అపహాస్యం చేస్తారు కదా… మళ్లీ… మీ పట్ల తప్పు చెసిన వారికి ప్రతిదాడి చేసె హక్కు మీకు వుంది అంటారు కదా..వారి తప్పుకి వారి జన్మతః జాతి ఒక సాకుగా చూపి అట్రాసిటీ కేసు వేస్తాను అంటే… అది తప్పు అంటారు కదా… మరి స్త్రీ అని ఒక సాకు చూపి… చేసిన తప్పుని కప్పి పుచ్చే వారు, సానుభూతి కి ప్రయత్నించేవారిది తప్పు కాదా ??? దానిని మీరు విమర్శించరా ???

3) భారత దేశం లో దశాబ్దాలు వుండి.. అమెరికా లోను వుండి.. నాణానికి రెండు వైపులు చూసిన కారణంగా కొందరి వాదనకి విశ్వసనీయత ( ఇది సరి అయిన పదం కాదు అనుకుంటా.. అదేదొ గుర్తుకు రావడం లేదు…) వచ్చినట్టు అయితే… మతం లో వుండి.. మతం బయట కూడా వుండి నాణానికి రెండు వైపులా చూసిన నా వాదన మీకు మతం పై అకారణ ద్వేషం అని ఎందుకు అనిపిస్తుంది… నేను మతం తప్పు అంటే అన్ని మతాలని కలిపే అన్నాను. ఇంకా చెప్పలంటే.. కొంత మంది అజ్ఞాతలు ముసుగు చాటున చేసె అసహ్యమైన వాదనలు హిందూ మతం మిగిలిన మతాల కంటే మెరుగు అన్న నా పూర్వ భిప్రాయం మారిపోవడం తప్పు కాదేమొ??? ముస్లిముల బురఖా పద్ధతి పైన.. కుటుంబ నియంత్రణ పై విముఖత పైనా…పర మత ( కాఫిర్లని) దేషం స్త్రీ కి విడాకుల విషయంలో వున్న వివక్షని విమర్శించి వున్నాను. అలాగే క్రైస్తవం లో సైన్సు వ్యతిరేకత.. మానవ జన్మ పాప భూయిష్టం .. మీ మతం తప్పు.. పాపం నుండి బయట పడాలి అంటే మా మతానికి వచ్చెయ్యండి అనడం తప్పు అని నా ముందటి టపాలో చెప్పి వున్నాను. వీటి కంటె తక్కువ తప్పులు వున్న కారణంగా హిందూ మతం గొప్పది అయ్యిపోదు. మరి నా అభిప్రాయాలని వెటకారం.. అసత్య ఆరోపణలతోని… నొక్కి పెడదామని మీ ప్రయత్నం సరి అయినదేనా ??? నేను నాకు తప్పు అనిపించినది ( కనీసం నా బ్లాగులో అయినా …) చెప్పుకునే హక్కులని.. మీ కెలుకుడు తో ఆపాలని చూడడం కరెక్టేనా ???

ఇది మీకు భయపడో … బాధ పడొ చెబుతున్నది కాదు. నా తప్పులు ఒప్పుకుంటూ మీ తప్పులు చూపడం… అసభ్యతకి పోకుండా.. అబధ్ధపు ఆరోపణలు చెయ్యకుండా మీకు చర్చించగలిగే ధైర్యం చూపగలరా ? కనీసం నా తప్పుని నేను ఒప్పుకున్నట్టు.. మీ తప్పుని ఒప్పుకునేటంత ధైర్యం మీకు వుందా ?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. శ్రీవాసుకి అంటున్నారు:

  అయ్యోరామా మధ్యలో నా పేరు వ్రాసారేంటి. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండీ కిత్నమూతి గారు (సరదాగా). ఏదో హాయిగా ప్రశాంతంగా బుర్ర తొలిచి తోచినప్పుడు నాలుగు ముక్కలు వ్రాసుకొని రెండు కామెంట్లు వస్తే బ్రహ్మానంద పడే అల్పసంతోషిని. ఈరోజే ఓ మూడు జోకులు వ్రాసా వీలుంటే చదవండి.

  • krishna అంటున్నారు:

   అయినా మరి అంత భయపడి పోతారెందుకు అండి? మీకు కరాటే వచ్చు కదా! హహ్హహ్హ…( సరదాగానే.. నేను కూడా ఇలా అన్నాను. మన మధ్యన ఆ మాత్రం స్నేహం వుంది కదండి.. )

 2. శ్రీవాసుకి అంటున్నారు:

  కృష్ణగారు

  మన మధ్య స్నేహానికి ఏనాడు ఢోకా లేదు. నాకు అసలే స్నేహితులెక్కువ. నాకు భయమేమి లేదు. ఆ కామెంట్ సరదాగా వ్రాసాను. నాకు ఇష్టమైనది, నాకు నచ్చిన దాని గురించి వ్రాస్తాను కాని నేను నమ్మిన ఏ విషయం మీద అవతలవారిని నమ్మమని మాత్రం బలవంతం పెట్టను. కొన్ని విషయాలలో మీ దారి మీది నా దారి నాది కాని మనిద్దరిని కలిపి ఉంచేది మాత్రం స్నేహం. స్నేహం శాశ్వతమైనది మనం లేకున్నా మన గురించి చెప్పేది స్నేహమే అని నా నమ్మకం.

  • krishna అంటున్నారు:

   శ్రీ వాసుకి గారు,
   మీ హామీ సంతోషకరం.. మీరు మరిన్ని సరదా పోస్టులు రాయాలని కోరుకుంటున్నాను. ఇక వ్యక్తిగత అభిప్రాయాల విషయానికి వస్తే.. ఎవరు ఎవరిని మా అభిప్రాయాలే కరెక్టు .. మీరు మారిపోండి అనరు కదా..మనకి ఎదుటివారి అభిప్రాయాలు నచ్చకపోతె చదవడం మానెయ్యాలి. కానీ సమస్య వెటకారాలు తో అసత్య ఆరోపణలు తో ఎదుటివారి గొంతు నొక్కెద్దామని ప్రయత్నించడమే…

 3. అబ్రకదబ్ర అంటున్నారు:

  మీకూ మీకూ గొడవలుంటే ప్రైవేటుగా తేల్చుకోవచ్చుగా. పది మందిలో పంచాయితీ ఎందుకూ? ఈ క్షమాపణలేంటి, పన్లోపనిగా పొరపాట్లు ఎత్తిచూపటమేంటి .. అసలేంటిదంతా! రొంబ కన్‌ఫ్యూషన్‌గా ఉండాదబ్బా. హంతా హయోమయం.

  • krishna అంటున్నారు:

   అవునండి.. మీరు అన్నది నిజమే. కానీ మోడరేషన్ అస్త్రాలు.. మన గుర్తింపు నకలు చేసె వాఖ్యాతలు… కొంత మంది అజ్ఞాత ముసుగులో చేసె భయంకరమైన అబధ్ధపు , రెచ్చగొట్టె ఆరోపణలు. వారి బ్లాగు కి వెళ్లి ఇది రాద్దామనుకునా ఇంత ప్రశాంతంగా నేను అనుకున్నది చెప్పలేను. ఆర్ధిక తాహతునొ.. విధ్యార్హతనో వెటకారం చేస్తు , మనం చెప్పలనుకున్నది చెప్పనివ్వరు. అసలే కోపం నా బలహీనత… అనవసర ప్రసక్తులని పట్టించుకోకుండా వుండడం ఇంకా నేర్చుకొవాలి.

 4. daanayya అంటున్నారు:

  క్షమాపణలెప్పుడూ unconditional గా చెప్పాలి. “నన్ను తిట్టి ఉండకపోతే నిన్ను తిట్టేవాణ్ణి కాదు కదా! ” అన్నట్టు ఉండకూడదు.

 5. krishna అంటున్నారు:

  కరెక్టే… నా క్షమాపణ శ్రావ్యగారికి. అది బేషరతుగానె…
  పొరపాటులని ఎత్తి చూపింది… కెబ్లాస కి. వారి ద్వంధ ప్రవృత్తి ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.

 6. NoName అంటున్నారు:

  Your arguement was meaningless. Criticise, but with commonsense.

 7. Jayavani అంటున్నారు:

  these kind of contraversies are really degrading your fame. Though I am your well wisher, I am not convinced with the way you are attacking the problem, you are just being foolish and digging your own hole. You are helping them to get succeed. There is no need to convince somebody with your opinions. We are all brought up that way that we don’t accept our faults that easily, how much explanation you give, people are not going to accept their mistakes. i have failed many times doing that, and planning to stop doing that again but always failed. I hope you r much intelligent and well balanced thinking person than me and never expected you to react this way. Don’t publish it, I wanted to give my opinion abt this and this is the only place where I can give my collective thoughts. It is somehow our badluck that we both have that in common that we accept our mistakes and expect the same from others. But I have not seen a single person in my life with that quality, even though it is quite clear that its their mistake, no one ever in my life accepted it. So, my dear friend, my sincere suggestion is just think several times in several directions when you are taking any step. Ok, don’t rush. i was so happy seeing you getting popular with your good writing and narration skills and now I am sorry to see that you are loosing your polularity and you even know that and so only your explanations both the times. you could have just kept quite and that would have increased your popularity even further. Of course I know you are not a saint, but try to do that, you may suceed one day. Did u see that srivasuki’s comment “” He says that he won’t force somebody to agree with his opinions, that means he even thinks that you are being pushy and trying to force your opinions on others. i even think the same. you are not giving any respect to other’s opinions. when someones gives their opinion, don’t argue with them, just leave it there. and stop saying that you have seen and understood the religion and all, it is an ocean you are too young and your knowledge about is very minute. No religion ever said to hate others, all those people saying big lectures out there, no one has that balance that one gets thru religion. This blogging is just a medium to share and convey your opinions, certainly not a right place to resolve your doubts about such a great topic. I hope that helps, cheer up now and take a break and come back with some nice, pleasant and happy topic, okey? bye for now.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s