ఏది సత్యం???

Posted: మే 24, 2010 in అఙ్నానం
ట్యాగులు:

మనిషి మంచి మార్గం లో నడవడానికి ప్రోత్సహించేది మతం.నాకు కొన్ని అనుమానాలు వున్నాయి ఈ విషయం లో.ప్రతి మతం లో అందరూ చెప్పేది మంచి మాత్రమే వుంది అని.మరి ప్రతి మతం లో చెడ్డవారు కూడా వున్నారు.మరి ఒక మతం మంచిదా కాదా అన్నది ఎలా తెలుసుకోవడం? నాకు మత విషయాల పైన నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది. నా మతాన్ని తెలుసుకునే పని లో నాకు కలిగిన అనుమానాలకి సరైన సమాధానాలు ఇవ్వగలిగే గురువులు ఎవరూ దొరకలేదు.దొరికిన వారు ఎవరు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు.సరే ఈ మతం కాదు, మరొక మతం లో నీకు సమాధానాలు దొర్కుతాయి అన్నారు కొందరు. ఆ మతం కూడా తెలుసుకుందామని ప్రయత్నించాను. అలాగే మరొక మతం… ఇంకొక మతం….. నా సమాధానాలకి సరైన సమాధానాలు ఎవరూ ఇవ్వలేదు.మీకు గాని , మీకు తెలిసిన వారు గాని నాకు నా ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలిగితే చాలా చాలా, చెప్పలేనంత సంతొషిస్తాను.ఎందుకంటే ఒక మంచి మతంని తెలుసుకునే ప్రయత్నంలో ప్రతి మతంలో నాకు చెడు కనిపించింది.ఇక మతం అన్న విషయం మీద నమ్మకం పోయినప్పుడు ఇక మిగిలింది నాస్తికవాదం! ఇక్కడ అంతా బాగుంది కాని, దేముడు విషయం??? నాకు కనిపించనంత మాత్రానా, అతడు లేడా?అతడి తత్వం గురించి మతస్థులు కూడా ఊహాగానాలే చేస్తారు, నాస్తిక వాదులు కూడా ఊహాగానాలే చేస్తారు.వున్నాడొ లేడొ తెలియాలి అంటె సృష్టి రహస్యం తెలియాలి లేదా ఆయనే వచ్చి చెప్పాలి.కాబట్టి నాస్తిక వాదం కూడా పూర్తిగా నన్ను సతృప్తి పరచలేదు.ఇక్కడ చర్చ మతం పై నాకున్న అనుమానాలకి పరిమితం చేద్దాము.

1)ప్రతి మతం తమ మతాన్ని ఆచరించే (లేదా ఆచరిస్తున్నామనుకునే ) వారిలో చెడ్డవారిని తృణీకరిస్తూ, వారు అసలు మతాన్ని సరిగా అర్ధం చేసుకొలేదు అంటుంది.మరి మతాన్ని బాగా అర్ధం చేసుకుని దానిలో మంచిని ప్రపంచానికి చాటి చెప్పిన వారిని తమ మతం గొప్పతనంగా చాటుకుంటుంది.మరి మతాన్ని బాగా అర్ధం చేసుకోవడం గాని, సరిగా అర్ధం చేసుకోలేక పోవడం గాని మనిషి గొప్పా లేక తప్పా? మతం గొప్పా లేక తప్పా? చెడు పనులు చేసె మతస్థులు బుద్ధిహీనులయ్యి తమ తమ మతగ్రంధాలలో (లేదా ధర్మ గ్రంధ సంపుటిలో) వున్న మంచి తెలుసుకోలేక పోయారు కాబట్టి అలా తప్పుగా ప్రవర్తించారు అంటూంది. మరి మతం గర్వపడేలా ఆచరించిన వారు తమ సుబుధ్ధి వలన మత / ధర్మం లో వున్న మంచిని గ్రహించారు అన్న మాట!అంటె మనిషి లోని సుబుధ్ధిని తమ గొప్పగా చాటుకునే మతాలు, దుర్బుద్ధి ని త్యజించడం వలన తమ అవకాశ వాదాన్ని చాటుకుంటున్నాయి.మంచైనా చెడు అయినా అది మనిషిలోనె వుంది అన్న మాట! మంచి జరిగితే మతాన్ని పొగడకూడదు, చెడు జరిగితే మతాన్ని తెగడకూడదు. దీనికి సమాధానం?

2)ప్రజాస్వామ్యం, కమ్యూనిజం, రాజరికం, నియంతృత్వం ఇలా పాలనా పద్ధతులు చాలా వున్నాయి.వాటిలో ఏది మంచిది? ఎక్కువ మంది దేనిని పాటిస్తే అదా? కాదు కదా!ఎక్కువ మంది ఒకప్పుడు భూమి బల్లపరుపుగా వుంది అనుకున్నారు.అంత మాత్రానా భూమి బల్లపరుపు అయిపోతుందా?భూమి చుట్టు సూర్య చంద్రులు తిరుగుతున్నారని అనుకున్నారు!అదే నిజమయిపోయిందా?మనిషి తన తప్పులని వదిలి ముందుకు పోతున్నాడు! కాలం తో పాటు తనతో ఇప్పుడు ప్రస్తుతం వున్నదాంట్లో తప్పులు తరచి చూసుకుని, లాభదాయకం కాని వాటిని వదిలివేస్తాడు, రేపు గాని, మరు నాడు గాని.నేడు అందరూ ప్రజా స్వామ్యాన్ని పాటించినా అందులో తప్పులు లేవని కాదు.వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.అందులో మంచి కన్నా చెడు ఎక్కువ అని గాని, సాదారణ జనం సరిగా ఆచరించలేనంత సక్లిష్టంగా గా గాని వుంటె దానిని వదిలి కొత్త పద్దతి మొదలు పెడతాడు.రాజరికం మాని ప్రజాస్వామ్యం ఆచరించినట్టు.నేడు ప్రజాస్వామ్యం లో ఎన్నికలులో ఒక పాతిక శాతం మంది ఓట్లు పడిన వారు ప్రభుత్వ నేతలు అయ్యిపోతుంటే అది ప్రజాస్వామ్యపు తప్పా?ప్రజల తప్పా?ఇందులో తప్పులు వున్నాయి అంటే రాజ్య ద్రోహిని అయ్యిపోతానా?అలాగే ఏ మతం అయినా మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది అనుకుంటే కొత్త మతం గాని మతానికి ప్రత్యమ్నాయం గాని పుట్టుకు వస్తే మానవాళికి మంచిదే కదా!

3) ఒకప్పుడు ఒక సమాజం లో ఒక మతం మాత్రమే వుండేది, అది మనుషులని కలిపి వుంచేది.కాని కాలం గడిచే కొద్ది వేరు వేరు సమాజాలలో వున్న ఒక మతం లో నచ్చని విషయాల వలన మరొక కొత్త మతం(కొత్త మతాలు) పుట్టుకు వచ్చాయి.నేడు ప్రపంచమంతా ఒక కుగ్రామం అయ్యిపోయినప్పుడు అన్ని మతాలు అన్ని సమాజాలలో వున్నయి.మతాలలో మళ్లీ చిన్న వర్గాలు వున్నా, పక్క మతం విషయం వచ్చేటప్పటికి ఆ చిన్న చిన్న వర్గాలు అన్ని కలిసి పోతాయి.అంటే మతం ఒకప్పుడు మనుషులని కలిపేదిగా వుంటే నేడు ఒక పెద్ద వర్గానికి వ్యతిరేకంగా మరొక పెద్ద వర్గంగా విడిపోవడానికి పనికి వస్తుంది అన్న మాట!సరే మా గుంపు పక్క గుంపు పై దాడికి దిగదు అంటే, మరి పక్క వర్గం మీ మీద దాడి చేసినప్పుడు? దాడి, ప్రతి దాడి ఒకే పరిమాణం గల తప్పులు కాకపోయినా తప్పులే! రెండింటా హింస తప్పదు.మరి ఏమి కర్తవ్యం? అసలు దాడి ఎందుకు జరుగుతుంది?ఒక వర్గం/మతం కి చెందిన వారి గా చెప్పుకుని మరొక మతంకి చెందిన వారిని తమ స్వార్ధ ప్రయొజనాల కోసం లక్ష్యం చేసుకుని దాడి చేస్తె, అది వ్యక్తిగత విషయం కాక తమ వర్గం పై మరొక వర్గ దాడిగా మనిషి అనుకోవడం వలన! అంటె మనిషిలో ఐకమత్యం, విడిపోవడానికి పనికి వస్తుంది అన్న మాట!ఇలా మతం పేరు చెప్పుకుని కలిసి వుందామనుకుని కొట్టుకునే కంటే విడిపోయి సుఖంగా వుండవచ్చు కదా!

4) ఒక అబ్బాయి చెడు తిరుగుళ్లు తిరిగి చెడిపోయి, ఇంటికి, వాడకి, ఊరుకి, సమాజానికి ఒక పీడలా తయారు అయితే, అతడిని సరిగా పెంచని తల్లి తండ్రులని ఆడిపోసుకోవడం తప్పు కాదు కదా!క్రమ శిక్షణ లేకుండా అలా పెంచారేమిటి అని ఎవరన్నా అడిగితే సమంజసమే! మరి ఒక్కో సమాజం లో ఒక్కో మతం వుండేది కనుక ఆ సమాజం లో అవినీతి, నిజాయితీ లేమి, దురాచారాలు వుంటే దానికి మతంని బాధ్యత వహించమని అడగడం ఎంత వరకు అసమంజసం? ప్రతి సమాజం మత గ్రంధాలని వల్లె వేయడం విధ్యగా భావించే కాలంలో ఆ విధ్య మనుషులని మంచిగా మార్చలేకపోతె, దురాచారాలని పాటించేటట్టు చేస్తె, వాటిని నిరోదించాలన్న స్పృహ కలిపించలేక పోతె, అటువంటి విధ్య ఎంత వరకు ప్రయోజనకరం?నేడు అభివృధ్ధి చెందిన దేశాలలొ నేటి విధ్యా వ్యవస్థ కొంచెం ముందుగా అమలులోకి రావడం వలన ఆ సమాజపు దురాచారాలు తొందరగా తొలగిపోయాయి. ప్రజలలో తర్క బధ్ధంగా ఆలోచించడం మొదలయ్యింది నేటి విధ్యా వ్యవస్థ మూలానె కదా!అన్ని సమాజాలలో నేటి విధ్యా వ్యవస్థ అమలు లోకి రాక మునుపు కూడా సంఘ సంస్కర్తలు వున్నా వారు రాశిలో తక్కువ!వారు సూచించే మార్పులని అంగీకరించే స్థాయిలో ఆ సమాజం కూడా లేక పోయెను.దురాచారాలుని పెంచినా పెంచక పోయినా వాటిని ఉపేక్షించడం కూడా తప్పే! కాబట్టి ఆయా మత గ్రంధాలలో నేటి విధ్యా భోదన కన్నా గొప్పగా ఏమి లేక పోయిందా?

5) ఐన్‌స్టీను మహాశయుడు అణు విస్పోటన సిధ్ధాంతం ప్రతిపాదించింది, మానవాళి మంచి కోసమే!కాని దాని వలన అణుబంబులు కూడా తయారు చేసి మొత్తం మానవాళినే మట్టు పెట్టవచ్చు.ప్రతి విషయానికి మంచి చెడు అని రెండు పార్శ్వాలు వుంటాయి.ఇప్పుడు ప్రభుత్వాలు, అత్యంత భద్రత మధ్య అణు సంబంధిత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నది, అవి తీవ్రవాదుల చేతిలో పడి దారుణాలకి దారి తీయకూడదనే!ప్రపంచ చరిత్రలో అణుదాడి జరిగింది ఒక్కసారే!అది ఎంత వినాశనానికి దారి తీస్తుందో అందరికి తెలిసింది.కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం గట్టి భద్రత తీసుకుంటుంది ఈ విషయంలో!కాని ప్రభుత్వమే విచక్షణ లేకుండా అణు బాంబులని ఉపయొగిస్తే! అసలు ప్రభుత్వం అంటూ ఒక నియంత్రణ లేకుండా అణు ధార్మిక పదార్ధాలు దొరికితే? మతం కూడా మంచి ఉద్దేశ్యం తోనె ప్రారంభం అయ్యినా, నేటి పరిస్థితిలో మత నియంత్రణ చెయ్యావలిసిన వారే దానిని స్వార్ధ ప్రయోజనాలకి వాడితే, అందరికి చేరువలో వున్న కారణంగా అప్పుడు జరిగే నష్టం అణు బాంబు చేసె నష్టం కి దరిదాపులలోనె వుంటుంది. అణు బాంబు దాడిలో అణు ధార్మికత వుంటే, మత దాడిలో విరిగిన మనసులు, విద్వేషాలు వుంటాయి.నియంత్రణ లేని మతం లో కూడా ప్రమాదం తక్కువేమి కాదు.ఎవరికి నచ్చినట్టు వారు మతాన్ని స్వార్ధ ప్రయోజనాలకి వాడుకుని, అమాయక ప్రజలని పావుకుగా వాడుకుంటారు.

6) అసలు నేడు ఆచరణలో వున్నవన్ని మతాలేనా? అసలు మతం నిర్వచనం ఏమిటి? గుఱ్ఱాలన్ని నాలుగు కాళ్లతో ఒక తోకతో, అతివేగంగా పరిగెట్టగలిగి వుంటాయి అని నిర్వచించామనుకోండి!ఒక గుఱ్ఱం మూడు కాళ్లతో అసలు పరిగెట్టలేకుండా తోక కూడా లేకుండా వుంది అనుకోండి.అది గుఱ్ఱం కాకుండా పోతుందా??అది ఒక ప్రత్యేకత కలిగిన గుఱ్ఱం.(ఇది నిర్వచనం లో బలహీనతని తెలపడానికి ఇచ్చిన ఉదాహరణ.మరే దురుద్దేశం లేదు!) అలాగే ఎవరొ నిర్వచించిన లక్షణాలు లేనంత మాత్రాన కొన్ని మతాలు కాకుండా పోవు. మిగిలిన మతాలతో వున్న ఇబ్బందులు ఆ మతం లో వుండబోవు అనుకోకూడదు.మహా అయితే మరొ రూపం లో వుండవచ్చు.కాబట్టి అది మతానికి ప్రత్యమ్నాయ వ్యవస్థ అవ్వబోదు. మతాల వలన జరిగే చెడుని నియత్రించలేనప్పుడు, మత ప్రత్యమ్నాయ వ్యవస్థ గాని, మత నిర్మూలన గాని అవసరం.

ఒక మతం లో గాని, ఒక వర్గం లో గాని పుట్టినంత మాత్రాన, ఆయా మతాలే గొప్ప అని చిన్నప్పటి నుండే పిల్లలకి నూరిపోయడం, ఆ చిన్న పిల్లల పట్ల వారి అమాయకత్వం పట్ల అమానుషత్వమే!మంచేదొ చెడెదో తెలియని వయసులో జరిగే ఈ మత మెంటల్ కండీషనింగ్ వారిని వారి జీవితం ఎంచుకోనివ్వక పోవడమే!

చెడు మతంలో కాక మనిషిలోనె వున్నా, ఆ చెడు అనే అగ్నికి ఆజ్యమయ్యి ఒక ఆటం బాంబులా మానవాళి మనుగడకే ప్రశ్నార్దకమయ్యే పరిస్థితిలో, మతంని వదిలివెయ్యడం అవసరం కాదా?

p.s.ఈ విషయం లో ఆరొగ్యకరమైన చర్చ (రచ్చ కాదండి, చర్చ )అవసరమే!

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. Indrasena Reddy అంటున్నారు:

  Baagundandi mee vaadhana.charcha kosam meeru vraasina ee vishayaalu abhinandaneeyam..

  Arogyakaramayina charchalu eppudu baaguntaayi mariyu itarulaki upayogakarangaa untaayi.

  ee ‘ke blaa saa’ evaro kaani vaalla pere konchem asamhyngaa undi.Atuvanti vaallaki doorangaa undatam mana arogyaaniki entaina manchidi.abrakadabra gaaru cheppinatlu KG gaallaki MT(Mata Taamara) gaalllaki dooranga undatam uttamam.Endukante manamu vaalla sthaayiki diga jaarutaamu mariyu vaalla kampu manakaku antukuntundi.

  My 2 cents 2 this discussion.

  I think if we believe God,it gives some peace of mind for us.We can put all our problems on God and sleep well.Thts’s why God Concept is everywhere on this earth.I believe that as long as human race exists,this God concept exists even thogh some people belive it or not.we just have to live with them.

  I believe these religion concepts,poojas,Yaghanms in hindu religion,Some other rituals in Islam,Christianity,Bouddham(I don’t know much about them and I think they also have something like this) were purely designed by lazy people.They are/were free loaders and wanted to live on other’s hard earned money by self boosting them as great people.

  This is purely my personal opinion and any one can oppose it.

  Best Regards,
  IndraSena

 2. Malakpet Rowdy అంటున్నారు:

  నేనేమి మతవిషయాలలో అనుభవజ్ఞుడినికాను. నాకు అర్ధమయింది చెప్తున్నా:

  1)ప్రతి మతం తమ మతాన్ని ఆచరించే (లేదా ఆచరిస్తున్నామనుకునే ) వారిలో చెడ్డవారిని తృణీకరిస్తూ, వారు అసలు మతాన్ని సరిగా అర్ధం చేసుకొలేదు అంటుంది.మరి మతాన్ని బాగా అర్ధం చేసుకుని దానిలో

  మంచిని ప్రపంచానికి చాటి చెప్పిన వారిని తమ మతం గొప్పతనంగా చాటుకుంటుంది
  ________________________________________________________________________

  చాటుకునేది మతం కాదు. మతం ఒక ప్రాణమున్న/లేని వస్తువు కాదు. అదొక దార్శనీయక సూత్రాల సమూహం. “అవి అన్నీ పాటించి” ఎవరైనా గొప్పవారు అయితే అది మనిషికీ మతానికీ కూడా సఫలీకృత కార్యం. “అవి అన్నీ పాటించిన” మనిషి దుర్మార్గుడయితే అది మతంలోనే ఉన్న తప్పు. “సగం పాటించి, సగం పాటించక” గొప్పవాడయినా, వెధవయినా, ఆ ఫలాన్ని మతానికి ముడిపెట్టలేం. సగం సగం పాటించినవాడిని చూపించి అదిగో మా మతంవల్లే గొప్పవాడయ్యాడు అని డబ్బాలు కొట్టుకునేది మనుషులు మాత్రమే.

  _____________________________________________________________________

  అంటె మనిషి లోని సుబుధ్ధిని తమ గొప్పగా చాటుకునే మతాలు, దుర్బుద్ధి ని త్యజించడం వలన తమ అవకాశ వాదాన్ని చాటుకుంటున్నాయి
  _____________________________________________________________________

  సుబుద్ధిని పెంచి దుర్బుధ్దిని త్యజించడానికి సహాయపడేది మతం. దానిని అమలు పరచాల్సింది మనిషే.
  మతాలు గొప్పలు చెప్పుకోవు. అవి సూత్రాలు మాత్రమే. ఆ మతాన్ని పాటించేవారు తామెందుకు పాటిస్తున్నారో చెప్తారు.

  ________________________________________

  ఇందులో తప్పులు వున్నాయి అంటే రాజ్య ద్రోహిని అయ్యిపోతానా?
  ________________________________________

  తప్పులు ఉన్నాయి అని చెప్పినందుకు కాదు. ఎక్కడ లోపాలున్నాయో చెప్పనందుకు. వేదాల్లో గానీ, బైబిల్ లో గానీ, ఖురాన్ లో గానీ చెప్పబడినవాటిని ఉంటంకించి – “ఇది ఇందుకు తప్పు. దీనిని సరిచెయ్యాలి” అని వివరిస్తే ఎవరైనా కాదంటారా? వచ్చిన ఇబ్బందంతా మనుషులు చేసిన తప్పులు మతానికి అంటగట్తడంతో.

  _____________________________________________________________________

  అలాగే ఏ మతం అయినా మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది అనుకుంటే కొత్త మతం గాని మతానికి ప్రత్యమ్నాయం గాని పుట్టుకు వస్తే మానవాళికి మంచిదే కదా!
  __________________________________________________________________________________________________

  చేడూ చేస్తుందనే అనుకోనక్కరలేదు. చెడు చెయ్యకపోయినా ప్రత్యాన్మయం సృష్టించచ్చు నాస్తికవాదంలా. వివిధ మతాలు పుట్టుకొచ్చింది అలాగే కదా. హిందూ పధ్ధతులు నచ్చని బుధ్ధుడు వేరే విధానాన్ని స్థాపించాడు. హిందూ పధ్ధతులలో ముస్లిం ఆక్రమణదారులనుండి తమని తాము రక్షించుకునే మార్గాలు నచ్చక గురు నానక్ సిక్కు మతాన్ని స్థాపించాడు. యూదు పధ్ధతులు నచ్చని వారు క్రైస్తవం, అది నచ్చని వారు ఇస్లాము స్థాపించారు. నాస్తికత్వం నచ్చని చలం ఆస్తికుడిగా మారిపోయాడు.ఈ మద్య సైంటాలజీ అనే కొత్త మతం కూడా పుట్టుకొచ్చింది కదా. కొత్త మతాలు ఎప్పుడు పుడుతూనే ఉంటాయి.

  _____________________________________________________________________

  ఒక వర్గం/మతం కి చెందిన వారి గా చెప్పుకుని మరొక మతంకి చెందిన వారిని తమ స్వార్ధ ప్రయొజనాల కోసం లక్ష్యం చేసుకుని దాడి చేస్తె, అది వ్యక్తిగత విషయం కాక తమ వర్గం పై మరొక వర్గ దాడిగా మనిషి అనుకోవడం వలన!
  _____________________________________________________________________

  మొన్న కూలిన విమానం వెనక తప్పు పైలట్ ది, లేక ప్రభుత్వానిది. అంతే గానీ విమాన శాస్త్రానిది కాదు కదా. ఇదీ అంతే. మనిషి తప్పుగా అనుకుంటే ఆ బాధ్యత మతానిది కాదు. Neither of the world wars took place in the name of the religion.

  ____________________________________________________________________

  4) ఒక అబ్బాయి చెడు తిరుగుళ్లు తిరిగి చెడిపోయి, ఇంటికి, వాడకి, ఊరుకి, సమాజానికి ఒక పీడలా తయారు అయితే, అతడిని సరిగా పెంచని తల్లి తండ్రులని ఆడిపోసుకోవడం తప్పు కాదు కదా!క్రమ శిక్షణ లేకుండా అలా పెంచారేమిటి అని ఎవరన్నా అడిగితే సమంజసమే!

  _____________________________________________________________________

  అక్కడ తప్పు తల్లిదండ్రులది. అంటే మత పెద్దలది. ఇక్కడ “క్రమశిక్షణ” అనేది మతం. పిల్లవాడు చేదిపోతే తల్లిదంద్ర్లని నిందించడం కొంతవరకూ సమంజసమే గానీ “క్రమశిక్షణ” అనే కాన్సెప్టుని నిందించం కదా. ఈ పిల్లవాడు క్రమశిక్షణని పాటించలేదు కాబట్టి అసలు క్రమశిక్షణే అవసరంలేదు అంటామా? మతం పేరుతో చెడు జరిగితే దానికి బాధ్యులు ఆ మత వ్యవహారాలు చూసుకునే మత పెద్దలు.

  _____________________________________________________________________

  కాని ప్రభుత్వమే విచక్షణ లేకుండా అణు బాంబులని ఉపయొగిస్తే! అసలు ప్రభుత్వం అంటూ ఒక నియంత్రణ లేకుండా అణు ధార్మిక పదార్ధాలు దొరికితే? మతం కూడా మంచి ఉద్దేశ్యం తోనె ప్రారంభం అయ్యినా, నేటి పరిస్థితిలో మత నియంత్రణ చెయ్యావలిసిన వారే దానిని స్వార్ధ ప్రయోజనాలకి వాడితే,

  _____________________________________________________________________

  ఇక్కడ మతం అంటే అణుధార్మికతా సిధ్ధాతం. ప్రభుత్వం అంటే మత పెద్ద. ప్రభుత్వం ఆ సిధ్ధాంతాన్ని దుర్వినియోగం చేస్తే అది ఆ సిధ్ధాంతం తప్పుకాదు. ఏటం బాం చేసినా, విద్యుతోత్పాదన చేసిన అణుధార్మికత అనేది సత్యం.

  ___________________________________________________________________

  ఒక గుఱ్ఱం మూడు కాళ్లతో అసలు పరిగెట్టలేకుండా తోక కూడా లేకుండా వుంది అనుకోండి.అది గుఱ్ఱం కాకుండా పోతుందా??అది ఒక ప్రత్యేకత కలిగిన గుఱ్ఱం.
  ____________________________________________________________________

  చెడు మతంలో కాక మనిషిలోనె వున్నా, ఆ చెడు అనే అగ్నికి ఆజ్యమయ్యి ఒక ఆటం బాంబులా మానవాళి మనుగడకే ప్రశ్నార్దకమయ్యే పరిస్థితిలో, మతంని వదిలివెయ్యడం అవసరం కాదా?
  ___________________________________________________________________
  ఇక్కడ వదలాల్సింది చెడుని. ఆ చెడు మనిషిలో ఉంది. మతాన్ని నిర్మూలించినంత మాత్రాన ఆ చెడు పోతుందనేమీ లేదు. కానీ మానవ జాతిని నిర్మూలిస్తే అసలు చెడు అనేదే ఉండదు. అలా అని నిర్మూలించేద్దామా?

  నాలుగు కాళ్ళు ఉండీ తీరాలీ అంటే, మూడు కాళ్ళది గుఱ్ఱం కానే కాదు. కానీ జంతు శాస్త్రం ప్రకారం గుఱ్ఱం నిర్వచనం జీనస్, స్పీషీస్ లో ఉంటుంది. అందుకే మూడు కాళ్ళున్నా దానిని గుఱ్ఱమే అంటాం. అది గుఱ్ఱమా కాదా అని డిసైడ్ చేసేది జంతుశాస్త్ర నిర్వచనం. మన నాలుగు కాళ్ళ నిర్వచనం కాదు.

  గుఱ్ఱానికి ఇచ్చినట్టే మతానికి కూడా మనం తప్పుడు నిర్వచనం ఇస్తే తప్పు మనదే.

  • krishna అంటున్నారు:

   >> “అవి అన్నీ పాటించిన” మనిషి దుర్మార్గుడయితే అది మతంలోనే ఉన్న తప్పు>>
   చర్చ దీని కోసం కాదు.

   >>వారు అసలు మతాన్ని సరిగా అర్ధం చేసుకొలేదు అంటుంది.మరి మతాన్ని బాగా అర్ధం చేసుకుని దానిలో

   మంచిని ప్రపంచానికి చాటి చెప్పిన వారిని తమ మతం గొప్పతనంగా చాటుకుంటుంది>>
   సగం సగం అర్ధం చేసుకోవడం గురించి కాదు మాట్లాడుతుంది.మత సంబంధ విషయాలనే విద్య అనుకునే స్థాయిలో సమాజం వున్నప్పుడు, అందరూ పూర్తిగా “అవి అన్నీ చదివిన”వారే!
   కానీ వాటిని సరిగా ఆచరించడం, ఆచరించకపొవడం మనిషి బాధ్యత అయినప్పుడు, ఫలితానికి చెందిన ప్రశంస లేక నిరసన మనిషికే చెందాలి.సమాజం చెడ్డవారిని తమ మతస్థులు కాదని ఎలా తృణీకరిస్తుందో,మతాన్ని గొప్పగా ఆచరించే వారి విషయంలో కూడా ఆ గొప్పతనం సదరు వ్యక్తికే ఇవ్వాలి.కాని ప్రస్తుత పరిస్థితి అలా లేదు.ఫలానా మతం లో గొప్పవారిగా విజ్ఞులు చలామణీ అవుతున్నారు.కానీ అలా అన్నప్పుడు ఊర్కునే సదరు మతస్థులు /సమాజం మతంలో చెడ్డవారి విషయంలో మరొలా ప్రవర్తించడం ద్వంద ప్రవృత్తి.

   >>తప్పులు ఉన్నాయి అని చెప్పినందుకు కాదు. ఎక్కడ లోపాలున్నాయో చెప్పనందుకు>>

   ఒక వ్యవస్థ లో ఇది తప్పు , ఇది ఇలా వుంది కాబట్టి తప్పు అనడం ద్రోహమో ద్వేషమో అని అనుకోవడం ఆ తప్పులని ఎత్తి చూపడం ఓర్చుకోలేని తనం.

   >>అది వ్యక్తిగత విషయం కాక తమ వర్గం పై మరొక వర్గ దాడిగా మనిషి అనుకోవడం వలన!>>మొన్న కూలిన విమానం వెనక తప్పు పైలట్ ది, లేక ప్రభుత్వానిది>>
   కానీ ఈ పైలట్లు అందరూ ఇంతే అనుకోవడం, విమానాలు అన్నీ ఇంతే అనుకోవడం.ఉదాహరణకి, లారీ డ్రైవర్లు అందరూ, భాధ్యతా రాహిత్యంగా లారీలు నడుపుతారు అని పాపులర్ అభిప్రాయం!తప్పు కదా!కొందరు చేసిన వ్యక్తిగత తప్పిదాలు వలన ఒక సమూహం కి చెడ్డ పేరు రావడం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాదారణ జనానికి అలవాటు.ఇలా ఒక సమూహం మరొక సమూహం పై అభాండాలు వెయ్యడం, వ్యతిరేక ప్రభావంని చూపుతుంది.

   >>మతం పేరుతో చెడు జరిగితే దానికి బాధ్యులు ఆ మత వ్యవహారాలు చూసుకునే మత పెద్దలు>>

   మత విషయాలలో, ఎటు తేల్చుకొలేని సంక్లిష్ట కాలంలో సాదారణ జనం మత పెద్దల వైపు చూడడం సహజం.మరి సరైన నియంత్రణ లేనపుడూ (చెడ్డ మత పెద్దలు) మనకి మనం నిర్ణయాలు తీసుకొవడం మంచిది. మత గ్రంధాలు అన్ని చదివిన మత పెద్దలు తప్పు చెయ్యొచ్చు కాబట్టి, ఇలా మతం పేరు చెప్పుకుని సమూహం కట్టకుండా ఎవరి జీవితం వారు చూసుకుంటే మంచిది.

   • Malakpet Rowdy అంటున్నారు:

    గొప్పవారిగా విజ్ఞులు చలామణీ అవుతున్నారు.కానీ అలా అన్నప్పుడు ఊర్కునే సదరు మతస్థులు /సమాజం మతంలో చెడ్డవారి విషయంలో మరొలా ప్రవర్తించడం ద్వంద ప్రవృత్తి
    ________________________________________________________________

    ప్రవర్తించేది మతం కాదు, సమాజం. మతానికి ప్రవర్తన ఉండదు.

    ఒక వ్యవస్థ లో ఇది తప్పు , ఇది ఇలా వుంది కాబట్టి తప్పు అనడం
    ______________________________________________

    అక్కడ అన్నది వ్యవస్థ గురించి కాదు – మతం గురించి. అదికూడా ఏ ఉదాహరణా లేకుండా

    ఇలా మతం పేరు చెప్పుకుని సమూహం కట్టకుండా ఎవరి జీవితం వారు చూసుకుంటే మంచిది
    _______________________________________________________________

    So, ఇక్కడ ఇబ్బంది మత సమూహాలతో గానీ, మతానితో కాదుగా? సమూహాలకి దూరంగా ఉండి మతాన్ని వ్యక్తిగతంగా చూసుకుంటే ఇబ్బందేమీ లేనట్టేగా?

   • krishna అంటున్నారు:

    >>ప్రజాస్వామ్యం లో ఎన్నికలులో ఒక పాతిక శాతం మంది ఓట్లు పడిన వారు ప్రభుత్వ నేతలు అయ్యిపోతుంటే అది ప్రజాస్వామ్యపు తప్పా?ప్రజల తప్పా?ఇందులో తప్పులు వున్నాయి అంటే రాజ్య ద్రోహిని అయ్యిపోతానా?>>
    >>తప్పులు ఉన్నాయి అని చెప్పినందుకు కాదు. ఎక్కడ లోపాలున్నాయో చెప్పనందుకు>>
    >>ఒక వ్యవస్థ లో ఇది తప్పు , ఇది ఇలా వుంది కాబట్టి తప్పు అనడం
    ______________________________________________

    అక్కడ అన్నది వ్యవస్థ గురించి కాదు – మతం గురించి. అదికూడా ఏ ఉదాహరణా లేకుండా>>

    ఈ విషయం లో కలిగిన కన్‌ఫ్యూజన్ తొలగినట్టేనా?

    >>So, ఇక్కడ ఇబ్బంది మత సమూహాలతో గానీ, మతానితో కాదుగా? సమూహాలకి దూరంగా ఉండి మతాన్ని వ్యక్తిగతంగా చూసుకుంటే ఇబ్బందేమీ లేనట్టేగా?>>

    అవును. మతం పేరు తో సమూహం కట్టడం పైనే నా అభ్యంతరం. మతం కాకుండా మరొ విషయం మీద సమూహాలు లేవు అని నా ఉద్దేశ్యం కాదు.అవి మతం పేరు మీద కూడ గట్టగల సమూహాలు తో పోలిస్తె చిన్నవి.బహుశా అంత ప్రమాదకరం కాకపోవచ్చును అని నా ఉద్దేశ్యం.

  • krishna అంటున్నారు:

   >>అసలు ప్రభుత్వం అంటూ ఒక నియంత్రణ లేకుండా అణు ధార్మిక పదార్ధాలు దొరికితే?>>
   నియంత్రణ లేకపోవడం వలన కొన్ని మతాలని కొందరు స్వార్ధపరులు తమ స్వార్ధ ప్రయోజనంకి వాడుకుని, అమాయకులని పావులుగా చేసుకుంటున్నారు. అది అమాయకుల తప్పు, మతం పేరు మీద సమూహం కట్టడం.జీవిత కాలం మత గ్రంధాలని చదివినా సరైన మార్గం లో మతపెద్దలే నడుస్తారని చెప్పలేనపుడు, వాటిని చదివి అర్ధం చేసుకొలేని వారు, సరిగా ఆచరించలేని వారు ఫలానా మతం కి చెందిన వారమని చెప్పుకోవడం మానవాళికే నష్టం.వారు చేసె తప్పులు వలన పక్క మతంలో వున్న అమాయకులని రెచ్చగొట్టె స్వార్ధపరులు పెద్ద హెచ్చున విద్వేషాలని వ్యాపింప చేస్తారు. నిన్నటి కాలం లో మనుషులని కలిపే పని చేసిన మతం అన్న వ్యవస్థ సరిగా పాటించని వారు ఆ కాలం లోను వున్న అంత ప్రమాదకరం కాకపోయెను.కాని నేటిపరిస్థితివేరు.దాని వలన జరుగుతున్న/ జరగబోతున్న కీడు చాలా ఎక్కువ.సామాన్య(మతంలో మంచి అర్ధం చేసుకోలెని వారు)జనం మతం వదిలెయ్యడమె వారికి మతానికి సమాజానికి మేలు.

   • Malakpet Rowdy అంటున్నారు:

    నచ్చని వారు బలవంతంగా ఆచరించాక్లని ఏ మతమూ చెప్పదు. ఇష్టంలేని వారెవరైనా వదిలెయ్యచ్చు.

  • krishna అంటున్నారు:

   >> గుఱ్ఱానికి ఇచ్చినట్టే మతానికి కూడా మనం తప్పుడు నిర్వచనం ఇస్తే >>
   ఏకీభవిస్తాను.నేను కూడా అదే చెప్పినది.ఇలా అయితే దీనిని మతం అంటారు అని తప్పుగా నిర్వచించితే, ఆ నిర్వచనం కి సరిపోదు కాబట్టి కొన్ని మతాలు కాకుండా పోవు అనే నేను అన్నది.

   • Malakpet Rowdy అంటున్నారు:

    ఇలా అయితే దీనిని మతం అంటారు అని తప్పుగా నిర్వచించితే, ఆ నిర్వచనం కి సరిపోదు
    _____________________________________________________________

    నిర్వచనానికి సరిపోకపోతే అది మతం కానే కాదు. జీనస్ స్పీషీస్ లో చిన్న తేడా వచ్చినా అది గుఱ్ఱం అవ్వదు.

   • krishna అంటున్నారు:

    జన్యు అమరికలో తేడాలు జరుగుతాయి అండి. వైరస్ విరుగుడూ మందుకి తట్టుకునేటట్టు గాని, భౌగోళిక పరిస్థితులలో మార్పులకి తట్టుకునేటట్టు జంతు జాలం గాని మార్పులు చేసుకుంటాయి అని నాకు అనిపిస్తుంది.నేను జన్యుశాస్త్ర నిపుణుడిని కాదు, నా అభిప్రాయం తప్పు కావచ్చు.
    నిర్వచనం విషయానికి వస్తే ఇప్పుడు సౌర మండలంలో వున్నవి ఎనిమిది గ్రహాలు మాత్రమే!ఎందుకంటె మారిన నిర్వచనం దృష్ట్యా ప్లూటొ గ్రహం కాదు. అలాగే మతం నిర్వచనం మారితే ఇంకొన్ని మతం అని అనిపించుకుంటాయి.
    నిర్వచనం కి ముందు కూడా ప్లూటొ వుంది. తరువాత వుంది.తప్పు నిర్వచనందా కాదా?

 3. Malakpet Rowdy అంటున్నారు:

  Yeah Indrasena Reddy,

  You are right. ఎందుకంటే పేరులోనే కులాన్ని చాటుకునే తమలాంటివారికి సరైన సమాధానమే వస్తుంది అట్నించి, అనవసరంగా కెలికితే.

 4. Indrasena Reddy అంటున్నారు:

  @Malakpet Rowdy Gaaru

  Adi naaku naa talli dandrulu pettina peru.Nannu nenu ‘Indrasena’ gaa cheppukuntaanu.ee WordPress lo ‘Peru’ ani undi, anduvalana naa peru mention chesaanu.nenu emi musugulu vesukoni raavadam ledu.naaku nachindi cheptaanu,mee abhipraayanni gowravistaanu.

  Best Regards,
  IndraSena

 5. Malakpet Rowdy అంటున్నారు:

  WordPress లో రెడ్డి అని పెట్టుకోకపోతే రిజెక్ట్ చెయ్యదు.

 6. Indrasena Reddy అంటున్నారు:

  @Malakpet Rowdy Gaaru

  Naaku asale mukku meeda kopam untundi.

  //WordPress లో రెడ్డి అని పెట్టుకోకపోతే రిజెక్ట్ చెయ్యదు//

  Asalu nenu cheppina daaniki meeru annadaaniki emanna sambandham unda?
  naa peru ekkkadaina raayalsi vaste nenu alaage raastaanu, endukante naa peru ade.mee laaga musugulo raanu.Piriki vaallu chese pani adi.

 7. Malakpet Rowdy అంటున్నారు:

  ఓహో ముక్కుమీద ఉంటుందా. సరే అదీ చూద్దాం. అవతలవాడికి కూడ ముక్కుమీద ఉంటే. నా ముసుగు అందరుఇకీ తెలుసు నా పేరు కూడ అందరికీ తెలుసు ఇక్కడ. నోతికొచ్చిన వాగుడు వాగి అవతలవాడు శాంతంగా ఉండాలంటే. కేబ్లాస పేరు అసహ్యంగా ఉందా? సరే మీ పేరేమన్నా వీనులవిందుగా ఉందా?

 8. Malakpet Rowdy అంటున్నారు:

  When you throw stones at the others, you gotta face them too!

 9. Indrasena Reddy అంటున్నారు:

  @Malakpet Rowdy Gaaru

  Eavaadi kampu vaadiki anandam.mee sangham peru baagundi anukunte,alaage kaaniyyandi.naakkuda telusule mee asalu peru.baaaboy,Krishna gaariki suddu lu cheppi,nenu meeto vaadanaku digatam naadi buddhi takkuva.Khachchitangaa cheppalante naaku mee anni telivitetaalu levu,mee anta vaadanaa patima kooda ledu.
  naaku enduku andi, nenu eppati laaga choostu oorukuntaanu.
  Best Regards,
  Indrasena

 10. Malakpet Rowdy అంటున్నారు:

  మొదలుపెట్టింది మీరే, నేను చెప్పింది సమాధానమే. మీరు మామీద రాయేశారు, నేను కూడా అదేపని చేసాను.

  అన్నట్టు చూస్తూ ఊరుకొమని నేనేమీ అనలేదు. మీ ఐడీ మీ ఇష్టం, మధ్యలో నేనెవరిని మీకు చెప్పడానికి. మాగురించి మాట్లాడినదానికి మాత్రమే సమాధానం చెపాను నేను. Now that it has ended I am fine with it. I have nothing against you personally.

 11. Sarath 'Kaalam' అంటున్నారు:

  @ Indrasena Reddy
  “ee ‘ke blaa saa’ evaro kaani vaalla pere konchem asamhyngaa undi”

  పోనీ గే బ్లా స పేరయినా నచ్చుతుందా? అది కాకపోతే తొ బ్లా స (తొక్కలో బ్లాగర్ల సంఘం) మరియు ప్ర కె బ్లా స పేర్లు నచ్చుతాయేమో చూడండి :))

 12. Malakpet Rowdy అంటున్నారు:

  శరత్తూ, అదే మరి – మాట్లాడనన్నాయన్ని మళ్ళీ కెలకడమెందుకూ? ఇప్పుడెవరో వచ్చి మళ్ళీ తిడతారు, మిమ్మల్నీ నన్నూ కాదు కెబ్లాసని :))

 13. Indrasena Reddy అంటున్నారు:

  @ క్రిష్న గారు

  నాలుగు మతాల వ్యక్తులతో నా వ్యక్తిగత అనుభవాలు ఇవి.

  హిందు మతము:
  ఇక్కడ నేను ఎంతమందితో అయిన దేముడు లేడు అని వాదించినా పెద్దగ వ్యతిరెకత రాలేదు.
  మిగతా విషయాలలొ నాకు పెద్దగ ఏమి వ్యతిరెకత లేదు.నాకు ఇక్కడ అసలు నచ్చని విషయం ఎమిటంటె కొంతమంది పుట్టుకతోనె గొప్పవాళ్ళము అనుకొవడము.కొంతమంది ప్రజలకి కులము పేరుతొ హాని చేయడము.

  క్రయిస్తవ మతము:
  వీళ్ళు నాతొ మూర్ఖంగా వాదించారు.నాకు దేముడ్ని చూపిస్తాను అని 2 గంటలు నాతొ ప్రార్ధన చేయించారు.కంఠ శొష తప్ప నాకు ఒరిగింది ఏమి లెదు.చివర్కి నేను పెద్ద ఏసు భక్తుడిని అవుతాను అని శపించి వదిలేసారు.

  ఇస్లాం మతం:
  నాకు ఒక్క వ్యక్తి మాత్రమె వాదించడానికి దొరికాడు.కాని నేను దేముడు లేడు అని మొదలు పెట్టగానె ఇక మాట్లడడానికి నిరాకరించాడు.

  భౌద్ద మతము:
  నాకు ఒక అమెరికన్ స్నేహితుడు ఉండేవాడు.నేను దేముడు లేడు అన్న పెద్దగా పట్టించుకొలెదు.ఏవొ కొన్ని జాతక కధలు చెప్పి వదిలేసాడు.

  నాకు అర్ధము అయ్యింది ఎమిటంటె ఉన్న మతాలలొకి కొంచెము లిబరల్ గా ఉండేది హిందు,బౌద్ద మతాలెనని .మన లాంటి వాళ్ళని కనీసం బతకనిస్తవి.మిగతా మతాల్లొ మనము కనీసము మన వాదన కూడ వినిపించలేమొ అని అనిపిస్తున్నవి.అన్ని మతాల కన్న మానవత్వము అన్నది చాల గొప్పది అని నా అభిప్రాయము.

  ఉత్తమమయిన అభినందనలతొ,
  ఇంద్రసేన

  • krishna అంటున్నారు:

   దేముడు వున్నాడా లెడా అన్న చర్చ ఎప్పటికి తెగదు ఇంద్రసేనగారు.అది తెగాలంటె సృష్టి రహస్యం చేధించబడాలి.ఇక మతాల విషయం కి వస్తే, హిందూ మతం లో మత ప్రవక్తలు లేక పోవడం, దీనిని ప్రశ్నించరాదు అని లేకపొవడం వలన, కొంత నయం. కాని అది నిజమేనా? నేటి విధ్య విధానం అమలు లో రావడానికి మునుపు మన సమాజ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుండేది. అప్పుడు కూడా అసమానతలని ప్రశ్నించిన అన్నమయ్య లాంటి వారు వున్న, వారి మాటలు విని మార్పుకి సిధ్ధం అయిన వారు లేరు. అలాంటి చదువు వలన ఏమి ప్రయోజనం? దురాచారాలు పెరిగిపోతె సమర్ధంగా అడ్డుకున్న వారు లేరు.వారి సమర్ధత ఫలితం బట్టి అంచనా వెయ్యడం తప్పు కాదు అనుకుంటాను.మా సంస్కృతి గొప్పది అనుకుంటున్న వారు, నిన్నటి సమాజంలో చెడుని చూడడం లేదు.గ్లాసు ఖాళీగా వుందని చెబితే దానికి కారణమైన వారు ఊరుకోరు కదా!
   ఇక భౌద్దానికి వస్తె, అది ఆచరణ యోగ్యం కాదు.కోరికలు దుఖానికి కారణం అయినా ప్రగతి కూడా కారణమే!ప్రతి మతం అసలు చెప్పినదానికి నేడు ప్రజలు అనుసరిస్తున్నదానికి చాలానె తేడనె వుంది.వున్నది వున్నట్టు పాటిస్తే, ఇంకా స్త్రీల పట్ల బలహీనుల పట్ల అలానె వివక్ష వుండేది.పూర్తిగా మతం త్యజిస్తే బహుశా ఇంకా మంచి మార్పు రావచ్చు.

 14. Indrasena Reddy అంటున్నారు:

  నిజమే క్రిష్న గారు,

  మనము ప్రతి రోజు వాడే వస్తువలలొ 90 శాతము ప్రాశ్చాత్యులు కనిపెట్టినవె.మన సమాజము ఈ మూడ నమ్మకాలని వదిలేసి కొంత రేషనల్ గా అలొచించినట్లయితె మనము కూడా అభివ్రుద్ది చెందేవాళ్ళము. ఈ పరాయి దేశములొ ఈ ఓంటరి బతుకులు తప్పేవి.

  ఉత్తమమయిన అభినందనలతొ,
  ఇంద్రసేన

  • krishna అంటున్నారు:

   అంత కంటె వింత ఏమిటి అంటె విమానాల కంటె ముందే మన వారు పుష్పక విమానాలు రూపొందించారని, వీడియొ చాటింగులు కంటె ముందే మాయా దర్పణులు, అశరీర వాణులు వుండేవని అనడం! మన వల్ల కానిది ఎదుటివాడు చేస్తె మెచ్చుకునే మనసు లేక పోయినా ఇలా తలా తోకా లేని వాదనలు చెయ్యడం …. హాస్యాస్పదం.

   • Malakpet Rowdy అంటున్నారు:

    మాయా దర్పణులు అశరీరవాణూల సంగతి నాకు తెలియదు గానీ, భరద్వాజ మహర్షి రచించిన వైమానిక శాస్త్రాన్ని కొంత చదివాను. The design he proposed conforms to many of the latest Aircraft designs.

    Here are some details

    http://www.bibliotecapleyades.net/vimanas/esp_vimanas_4.htm

   • karthik అంటున్నారు:

    the basic ingrediant of any innovation is an “IDEA” or a “THOUGHT”.. there were ideas/thoughts present in that direction so it was NOT impossible/illogical that they were built..
    you might have known abt Arthur Clarke, many innovations started after his writings.. what was unbelievable few decades ago becaeme a reality.. so if something has been documented then definitely some work/activities might have existed in that direction..
    Not a fair case to ridicule..

   • Wit Real అంటున్నారు:

    >> మన వల్ల కానిది ఎదుటివాడు చేస్తె మెచ్చుకునే మనసు లేక పోయినా
    >> ఇలా తలా తోకా లేని వాదనలు చెయ్యడం …. హాస్యాస్పదం.

    you might be familiar with the famous quote ‘cogito ergo sum’ (= I think. Therefore, I am). This is Descartes of 15/16 Century.

    Now if I say that, Hindu scholars have gone beyond Descartes imagination, some 1000/2000 years ago itself, then you call that …. హాస్యాస్పదం

    Then, if you ever get a chance to read Kenopanishad, then try to understand its first stanza .

    Your awareness of Descartes is a result of your learning.
    Your “తలా తోకా లేని వాదనలు చెయ్యడం …. హాస్యాస్పదం.” statement is a result of your arrogant ignorance.

    Learning is good. Ignorance is bliss.

    Peace.

   • bondalapati అంటున్నారు:

    Malak garu,
    We should give this design to HAL in bangalore and see if they’ll be able to make any better aircrafts. Of late there’ve been many failures in their projects..:-)

   • krishna అంటున్నారు:

    @ కార్తిక్,
    ఒక ఆవిష్కరణ కి సంబందించిన ఆలోచన ముఖ్యం. మిస్టర్ ఇండియా సినిమా లో మనిషి మాయం అవ్వడం గురించి చూపిస్తారు.(అంత కంటె ముందు కూడా అలా చూపిన సినిమాలు వున్నాయెమొ నాకు తెలియదు.)రేప్పొద్దున ఎవరైనా అలాంటి ఆవిష్కరణ చేస్తె ఆ క్రెడిట్ శేఖర్ కపూర్ ఇచ్చేస్తామా?

    @ మలక్ పెట్ రౌడీ నేను ఇక్కడ విమర్శించినది భరద్వాజ మహర్షిని కాదు. ఆయన వ్యక్తిగత లబ్ద ప్రతిష్ఠని తమ వర్గానికి ఆపాదించుకుని, నిఝంగా అలాంటి ఆవిష్కరణ చేసిన వారిని తక్కువ చేసి చూపె ప్రయత్నం చేసెవారిని. మనుషులు అందరు ఒకటె అని నేను నమ్ముతాను. మేము గొప్ప అని ఒక వర్గం లో గొప్పవారిని పేర్కొనే వారు, అదే వర్గానికి చెందిన నీచులని తమ వారు కాదు అన్నట్టు మాట్లాడడం ద్వంద ప్రవృత్తే! ఒక మనిషి గొప్పని, తప్పుని ఆ మనిషికి మాత్రమే పరిమితం చెయ్యాలి.ఇప్పటి వరకు అలా లేదు పరిస్థితి.పనులని వర్గ వ్యవస్థకి అంటగట్టి, ఒక వర్గం మరొక వర్గం పై వివక్ష చూపిస్తుంటె మన వర్గం వాడెలెమ్మని ఊరుకోవడం ఇలాంటి వారి వలనే జరిగింది.

    @ witreal
    what ever u quoted im not aware of. i admit my ignorance.if i sounded arrogant, it was not intentional. im ready to accept my fault and tender my apology.

   • Malakpet Rowdy అంటున్నారు:

    ఒక మనిషి గొప్పని, తప్పుని ఆ మనిషికి మాత్రమే పరిమితం చెయ్యాలి.ఇప్పటి వరకు అలా లేదు
    _________________________________________________________________

    I agree. But the change should come from the people. This has nothing to do with the religion

 15. Indrasena Reddy అంటున్నారు:

  naa comment kanapadatam ledu…

 16. Indrasena Reddy అంటున్నారు:

  naa chivari comment anna konchem publish cheyandi krishna gaaru..

 17. bondalapati అంటున్నారు:

  కృష్ణ గారు,
  ఓ రెండు రోజులు పట్టించుకొనక పోతే చాలా ఆసక్తికరమైన చర్చనే మిస్ అయ్యాను.
  ఈ పోస్ట్ చదవక ముందు నేను ఇదే టాపిక్ పై ఇంకొక పోస్ట్ రెడీచేశాను. ఈ పోస్ట్ లో ప్రశ్నలు బాగున్నాయి. ఎనీ వే నా పోస్ట్ కూడా వదులుతాను. చదవండి.
  ఇక పోతే మీ పోస్ట్ ఒక పాయింట్ గురించి నాకు చర్చించాలనిపిస్తోం

  “ప్రజలలో తర్క బధ్ధంగా ఆలోచించడం మొదలయ్యింది నేటి విధ్యా వ్యవస్థ మూలానె కదా!”
  కృష్ణ గారు,

  మనిషి స్వార్థ పరుడైనంత కాలం ఇలాంటి విద్యా వ్యవస్థ వలన కీడు ఎక్కువ జరుగుతుంది. అంతకు ముందు కత్తి ఉపయోగించేవాడు, ఇప్పుడు గన్ ఉపయోగించినట్లౌతుంది. అమెరికా లో “సబ్ ప్రైం సంక్షోభం” ఇలాంటి విద్యా వ్యవస్థ వలననే జరిగింది. పైగ చదువుకున్న స్వార్థపరుడి వలన చదువుకోని అమాయకుడికి ఎప్పుడూ అన్యాయమే.
  విద్య మనిషిని తక్కువ స్వార్థ పరుడి గా చెయ్యనంత వరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటయి.

  • karthik అంటున్నారు:

   an out of context point here:
   dont you think the need of teh hour is moral education than money earning education???

  • krishna అంటున్నారు:

   @ బొందలపాటి గారు, కార్తిక్
   నిన్నటి విధ్యా వ్యవస్థ కంటె నేటి విధ్యా వ్యవస్థ మనిషి రేషనల్ గా ఆలోచించేటట్టు చేస్తుంది అని నా ఉద్దేశ్యం.అంత మాత్రాన ఇది లోప రహితం అని కాదు. రేపు ఇంతకంటె మంచి విధ్యా వ్యవస్థ అమలులోకి వస్తుంది అని ఆశిద్దాము. ఈ విషయం లో ఆవేదన చెందడం కంటె నాకు సూచనలు ఇచ్చేంత జ్ఞానం లేదు.

 18. Sri అంటున్నారు:

  Malak,

  అశరీరవాణూల these are there in Nature. It is not big thing having these powers for sages. Sometime back I did not belive all these things, now I belive all these things after reading sages books like UG, Eckhart tolle and Ajja.

 19. Indrasena Reddy అంటున్నారు:

  Nenu Vinnanu..ee kadhalu asalu comedy kosam raasa vaaru.

  Mana ‘vedaallo’ anni unnaayi..Vaatine tellodu teesukolli anni kanipetaadu anadam.

  manamu raasinavi manaku ardham kaakapovadam vintala loki vinta..

  asalu ee David Hatcher Childress gaadi credibility enta?

  Manaki chaata kaakapoyina manaku sotkarsha, swakuchamardhanam baaga ekkva.evanna manollu vedaalni ardhma chesukoni kottagaa materialize chesinavi kaasta cheppandi.enduku anavsarnga aa paadu llinkla reference.avi achcham maarthanda gaari referencelu laaga unaayi..

  asalu maa taatalu netulu taagaaru,maa mootulu vaasana choodandi ane ee buddhulu bhaarateeyulaki eppudu potayo..???

 20. Wit Real అంటున్నారు:

  అరె, ఎంది భాయ్ ఈ లొల్లి? కొంచెం ట్రాఫిక్కు చేంజ్ సెయ్యరాదే?

  మీ గొడవకి మాకు బ్లాగ్-స్పాట్ తెరుసుకుంటంలేదిక్కడ! 😉

 21. కొత్తపాళీ అంటున్నారు:

  Interesting post.
  One request – when you type, please make sure there is a space after any punctuation mark (like period, comma, exclamation, etc.) before the next word. Makes it easy on the eye, especially in reading long posts.
  thanks

 22. కొత్తపాళీ అంటున్నారు:

  నాకూ మతాల గురించి పెద్దగా తెలియదు. మనకు తెలిసిన చరిత్రలో పుట్టిన మతాలు (బౌద్ధ, క్రిస్టియను, ఇస్లాము, సిక్కు, ఇత్యాది) అన్నిటికీ స్పష్టమైన సామాజిక రాజకీయ నేపథ్యాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను, నేను పరిమితంగా చదివి గ్రహించినంతలో. విల్ డ్యురాంట్ వంటి మహానుభావులు రాసిన చరిత్ర పుస్తకాలు ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ ఇవ్వొచ్చు.
  ఇప్పుడు మనం హిందూ మతం అని చెప్పుకుంటున్న దానికి మూలమైన సనాతన ధర్మాన్ని చూస్తే – మంచి చెడు అనే ప్రశ్న రాదు. అసలా ప్రశ్న అసంబద్ధం. సనాతన ధర్మం దృష్ట్యా మానవుడి లక్ష్యం ఒక్కటే – ముక్తి. అందులో మంచి చెడ్డల ప్రసక్తి లేదు.

 23. Malakpet Rowdy అంటున్నారు:

  David Hatcher Childress gaadi credibility enta?
  _____________________________________________

  I just gave the reference and I am not taking a strong position here. From whatever I read (byt he way a small correction – I read the translations), the designs were valid.

  Some guy tried to translate this into Geometry in the early 1900s and IISc questioned the translations. So it depends a lot on how its interpreted. Years after IISc questioned it, DRDO scientists (From ADA, Bangalore) said they were using a few concepts for the LCA design ( This was in the early 1990s). Later on Prof Krishnamurthy, from the Aeronautics Engg Dept in the IISc gave it credibility.

  So its not just Childress – there are many others who belive that the ancients knew about flying though they were not sure to what extent.

 24. Malakpet Rowdy అంటున్నారు:

  OOPS my previosu comment disappeared.

  Vaimanika Shastra’s credibility has been questioned multiple times, even IISc questioned it initially (rather they questioned the translations more than the text itself). But years later, a Professor from the same IISc supported the theory. Even in the early 90s some people from ADA – Bangalore ( DRDO) claimed that they used some of those concepts in the LCA design (could be the Metallurgical and Material Science stuff)

  So, its just now about Childress, there are many more who support the theory. But unless there is a final word on it, it remains unclear.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s