నా జవాబు

Posted: మే 19, 2010 in పిచ్చాపాటి

నా జవాబు కోసం చాలా ఎదురు చూసినట్టు వున్నారు నిన్న! ఒకరి పెళ్లి రిసెప్సన్ కి వెళ్లవలసి వచ్చింది. అందు వలన ఆలస్యం. చాలా పెద్ద జవాబు నిన్న రాత్రి టైపు చెసా!కాని లెఖిని చేతులెత్తింది ఆఖరి నిమిషంలో!పాపం నేను రాలెదనుకుని చాలా మంది, నిరాశ పడ్డారు అనుకుంటా!సరె నా జవాబు: మత ద్వేషి….. కుల గజ్జి…… ఎవరిదొ తెలుస్తుంది ఇది చదివాక. ఇంత పెద్ద గొడవ అయ్యాక ఇన్నాళ్లు నిశ్శబ్దంగా వున్నదెవరు? నేనె భయపడి వుంటె ఈ విషయం ఎందుకు ఎత్తుకుంటాను ? ఆ గొడవ ప్రభావం ఎవరి మీద కొట్టొచ్చినట్టు కనిపించింది? వ్యక్తిగత దాడులు ఎవరి చేసారు? ఎవరు నాలిక కరుచుకున్నారు? మతం గురించి, నాకు కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి.నేనెమి, నాకు నన్ను ఆస్తికుడినొ, నాస్తికుడీనొ అనుకోను.నాకు దేముడి పట్ల ఎటువంటి అభిప్రాయం లేదు. దేముడు మనిషిని సృష్టించాడొ, లేక మనిషే దేముడిని సృష్టించాడొ ఎవ్వరము నిర్ధారించలేము. అయితే మతాన్ని ఆచరించడం వలన మనిషికి లాభమెంత? నష్టమెంత అని నాకు అనిపించిన భావాలని ఒక వరస టపాల పరంపరలో ఇంతకు ముందు రాసాను. అందులో దేముడిని, మతాన్ని సమర్ధించె పాత్రలోను, సాతానుని మతాన్ని వ్యతిరేకించె పాత్ర లోను, ఒక చర్చ జరుగుతుంది.మతం లో చెడుని అంగీకరిస్తు, దేముడు చివరికి ” మనిషి లోనె చెడు వుంది.నేడు మత వ్యవస్థ లేక పోయినా మనిషి మరొ విషయం మీద .. జాతి, కులం, భాష, వర్ణం,ప్రాంతం ఇంకా దేశం పేరు చెప్పి ఎదుటిని చంపుకుంటాడు అని, అటువంటి ద్వేషం లేని మరొ సృష్టి మొదలు పెడదామని బయలు దేరుతాడు.ఈ టపాలో నేను చెప్పాలనుకున్నది మతం వలన మనిషికి వ్యక్తిగతం గా , సామాజికం గా జరిగే నష్టాలని గురించి. సున్నితమైన విషయం. పైగా “దేముడిని పడగొడదాము రండి ” అన్న శీర్షికని చూసి చదవ వచ్చె వాళ్లు నొచ్చుకోకూడదు అని చాలా శ్రధ్ధ పెట్టి ప్రతి పదాన్ని ఆచి తూచి రాసాను. నా ఉద్దేశ్యం లో మతం లో చెడు దేముడూ ఒప్పుకున్నప్పుడే, చర్చ లక్ష్యం నెరవేరి పోయింది. మతం మనిషిని గొప్పగా ఏమి తయారు చెయ్యదని అతను ఒప్పుకున్నట్టు రాసాను. పైగా ప్రపంచం లో అతి ఎక్కువ మొత్తం లో ప్రజలు భావొద్వేగాలకి లోను అయ్యి, విచక్షణ కోల్పొయెది, మతం వలన అన్నది నా అభిప్రాయం.మిగిలిన జాతి, భాష, ప్రాంత వైషమ్యాలు, కూడా మనిషి కి మనిషి కి మధ్య దూరాన్ని పెంచుతాయి అని చెప్పాను.కాకపొతె మతం ఎంత ఎక్కువ మంది మనుషులని ఒక సమూహం గా , మరొ సమూహనికి వ్యతిరేకంగా కలపగలదొ మిగిలిన అంశాలు అంత ఎక్కువ ప్రభావం చూపలేవు అని అనిపిస్తుంది నాకు. భరద్వాజ బహుశా నా టపా అర్ధం చేసుకొలేక పోయాడు.లేదా నేను అంత విపులంగా నా భావాలని చెప్పలేక పోయాను.భలెగా వుంది అని అతడు ముచ్చట పడ్డాడు. అటు నాస్తికులు ఇటు ఆస్తికులు కూడా బావుందని అన్నారు.

తరువాత నేను రంగ నాయకమ్మ గారు రాసిన బలి పీఠం చదివాను.అసలు కధ కంటె ఆవిడ తనని తానె విమర్శించుకుంటూ రాసిన చివరి మాట నన్ను చాలా ఆకట్టుకుంది. అయితే ఆవిడ అభిప్రాయాలు కొన్నింటి తో నేను ఏకీభవించలేక పోయాను. వాటి పై నా అనుమానాలని ఒక టపా రూపం లో రాసాను.అందులో ఒక మతాంతర వివాహం ని తాను రూపు దిద్దిన తీరు పై ఆవిడ తనపై తాను కొంత విమర్శ చేసుకున్నారు. నీ భర్త నిన్ను బొట్టు మానెయ్యమంటె మానెస్తావా అని ఒక పాత్ర మతాంతర వివాహం చేసుకున్న యువతిని అడుగుతుంది. మానెస్తాను అని ఆ పాత్ర తో చెప్పించినందుకు, అది పురుషాదిక్యతని బలపరిచినట్టు వుందని అలా రాయడం చిన్న వయసులో తన అవగాహనా రాహిత్యం అని ఆవిడ చెప్పుకొచ్చారు.అయితే నాకు అనిపించింది ఏమిటంటె ఆ పాత్రకి, తన భర్త మీదున్న ప్రేమ కన్నా మతాచారాలు పైన నమ్మకం తక్కువ కావచ్చు, అందుకే బొట్టు మానెయ్యడానికి ఒప్పుకుంటాను అని అంది అని అనిపించింది.అయినా ఒక కమ్యూనిస్టు భావ జాలం వున్న వ్యక్తిగా , పురుషాదిక్యతని వ్యతిరేకించె మనిషిగా రంగ నాయకమ్మ గారు ఒక ప్రత్యేక కోణంలో మాత్రమె విషయాన్ని చూస్తున్నారని అనిపించింది.భర్త భార్యకి, భార్య భర్తకి తనకి నచ్చని విషయం చెప్పడంలో స్త్రీ వాదం, పురుషాదిక్యం వుండవు.మంచి అనిపించింది చెప్పడం లో తప్పు ఏమిటి?మతాన్ని వదులుకొమ్మని ఒక వ్యక్తి, తన జీవిత భాగస్వామికి చెబితే (తాను కూడా మతాన్ని వదెలెయ్యాలి)మంచిదే కదా అని అన్నాను.ఇప్పుడు భార్య భర్తని మందు తాగడం మానెయ్యమంటె ఇది నా స్వేచ్చకి భంగం,అని అతడూ అనగలడా?మతం కూడా మందులా చెడ్డదే కదా అని రాసాను. ఈ విషయం పై చర్చ పక్క దారి పట్టింది.

ఇప్పుడు ఆ వాఖ్య వెనక నా ఉద్దేశ్యం : మందు పూర్తిగా చెడ్డదా? మితం గా తాగినప్పుడూ, గుండె జబ్బులు ని దూరంగ వుంచడం లో సహాయ పడుతుంది.ఇంకా మందు కొన్ని చలి ప్రదేశాలలొ వెచ్చగా వుంచడానికి సహాయ పడుతుంది. అలా తాగె వారికి , పక్క వారికి ఏమి ఇబ్బంది వుండదు.స్పృహ తప్పెటట్టు తాగిన వాడికి సమాజం తో పని లేదు. వాడి వలన సమాజానికి నష్టం లేదు. మరి చిక్కెవడి తో? సగం స్పృహ వుండి, మంచి చెడు విచక్షణ కోల్పొయి, తనని తాను, తన చుట్టు పక్కల వాళ్లని ఇబ్బంది పెట్టె వాడితో! మతం తో ఇక్కడె దీనికి నేను పోలిక చూసాను.మితంగా మతాన్ని ఆచరించె వారి తో సమాజానికి చిక్కు లేదు.ఒకింత వ్యక్తిగతంగా ఒక్కొసారి, లాభదాయకం కూడా.అలాగె, పూర్తిగా మతాన్ని ఒంటబట్టించుకుని, పూజలు పునష్కారాలు, తపస్సులు చేసుకునే వారి తో, జన బాహుళానికి దూరమయిపొయె వాళ్లతో చిక్కేమి లేదు.చిక్కంతా ఎవరి తో? మతం మత్తు కొంత వరకు వుండి, దాని వలన మంచి చెడు విచక్షణ కోల్పొయి, కొంత మంది, స్వార్ధ పరుల చేతిలో కీలు బొమ్మలు అయ్యె వారి తో!ఇలాంటి వారు చాలా ఎక్కువ మోతాదు లో వుంటారు. మత నిర్దేశాలు అన్ని కూడా మనిషిని పూర్తిగా మంచి మార్గం లోనె నడవమని చెబుతాయి. ఇది మన భరద్వాజకి నచ్చలెదు.మా ఇద్దరి మధ్య చర్చ మొదలయ్యింది.

మతాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకునే వారు, మతాన్ని నిజంగా పాటిస్తున్నారని అనుకుంటున్నానా అని అతడు అడిగాడు. నిజంగా అంటె?? నాకు అసలు మతాన్ని పాటించడం అంటెనె సరిగా తెలియదు అన్నాను.మత నిర్దేశాలని 100% తూచా తప్పక పాటించడం అన్నాడు. నా మత పరిజ్ఞానం ఏమిటి అని అడిగాడు. చిన్నప్పుడు, మా కజిన్ సిస్టర్స్ స్కూలులో భగవద్గీత, రామాయణం, మహా భారతం పారాయణం చెయ్యించెవారు. ఇంగ్లిష్ మిడియం చదువులు అయినా, సంస్కృతం కూడా వుండేది. చిన్నప్పుడు నుంది, ఏదొ ఒకటి చదవడం నా బలహీనత. కిరాణా దుకాణంకి వెళ్లి పప్పులు, తెచ్చిన కాగితాలని కూడా వదిలే వాడిని కాదు.అలాగే వాళ్ల వద్ద వున్న భగవద్గీత, రామాయణ భారతాలు చదివాను. హైస్కూలు మిషనరి స్కూలు లో, అక్కడ బైబిల్ చదివాను. హైదరాబాదు లో వున్నఫ్ఫుడు, పాత నిబంధన గ్రంధం చదివాను. ఒక ముస్లిం స్నేహితుడు సాయం తో ఖురాను చదివాను.అది పూర్తిగా పాత నిబంధన గ్రంధమె! ఇక కాలేజి అయ్యక నాన్న గారి కలెక్షన్ లో డాక్టర్ అంబేద్కర్ రచన దమ్మ పధం వలన భౌధ్ధ మత పరిచయ జరిగింది.ఇక మిగిలినది, నా పరిశీలన. నా చుట్టు పక్కల వున్న వారిని పరిశీలించడం వలన నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి.మతం చేసె మంచి కన్నా చెడు ఎక్కువ అని అనిపించింది.

మతం అనేది వుండడం వలన మనిషి, దానిష్ కార్టూన్లకి, డావిన్సి కోడ్లకి, బుస్సైన్ గీతలకి చలించి, అల్లర్లు చేస్తున్నాదు అన్నాను.నా వాదన తప్పు అయితే నాకు వివరించు, నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను అన్నా! నా ప్రశ్నలకి జవాబు లేదు గాని, చిల్లర కోసం నా సహనాన్ని పరిశీలించడమే పనిగా అడ్డగోలు వాదనలు మొదలు పెట్టాడు.అయితే భరద్వాజ కేవలం బుస్సైన్ గీతల పైన మాత్రమె స్పందించాడూ.మిగిలిన విషయాలు నాకు అనవసరం. మిగిలిన మతాలలో వారు మనషులు కాదా అంటె? వారి విషయం, నాకు అనవసరం అన్నాడు.అప్పుడూ చర్చ హిందు మతం పైన కేంద్రీకృతమయ్యింది. హిందూ మతానికి దిశా నిర్దేఅశాలు చేసె చతుర్వేదాలు కేవలం ఒక వర్గం గుప్పిట్లో వుండడం ఎంత వరకు సమంజసం అని అడిగాను. వాటిని చదవడానికి ఒక అర్హత కావాలి అన్నాడు. సరె ఆ ఆర్హత పుట్టుక తో ఎందుకు నిర్ణయం అవుతుంది? అని నా ప్రశ్న. ఒక వాల్మికీ వేదాలు చదివె అర్హత సంపాదించిడానికి , ఒక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన వాడికి కొలమానం ఒకటేనా అని అడిగాను.కాదు కదా సమాధానం లేదు.ఇప్పుడూ అందరు చదవ వచ్చు కదా అన్నాడు.మరి ఇన్నాళ్లు జరిగిన వివక్ష వలన నేటి సమాజం పరిస్థితి? ఆ చతుర్వేదాలు చదివిన వారిలో అధికులు నేటి కుల వ్యవస్థ కి కారణం కదా? మరి ఆ చతుర్వేదాలు చదివి వారికి, వారి వలన సమాజానికి కలిగిన లాభం ఏమిటి? చదివినా అర్ధం చేసుకొలేక పోతె, అర్ధం చేసుకున్నా దానిని ఆచరిచలేక పోతె అటువంటి చతుర్వేదాల వలన ఏమి ప్రయోజనం?

ఒహో … వీడు కూడా జాతి వైరం వలన నష్ట పోయిన మరొకడు? తేనె కరిగి ఇప్పుడు “కత్తి” కనిపిస్తుంది. పిల్ల కాకి రూపం లో వున్న రాబందు రెక్కలు విప్పుతుంది. అని భరద్వాజ వెక్కిరింత. అప్పటికే కొన్ని పదులు సార్లు నన్ను మత ద్వేషి అన్నా ఊరుకున్నా.అది నా పై వ్యక్తిగత దాడి అయినా గౌరవం ఇచ్చి మాట్లాడా! కుల గజ్జి అని అన్నప్పటికి నా సహనం చచ్చి మనోడికి మూడింది. వ్యక్తిగత దాడి, వెక్కిరింత అంటె ఏమిటో రుచి చూపించా!నాకె సిగ్గేసె స్థాయి లో తిట్టా! వీడితో చర్చ వలన తల నొప్పి తప్ప మనకి ఒరిగేదేమి లేదు అని అర్ధం అయ్యాక, మీరు నుండీ నువ్వుకి వచ్చా!నా కోపం చూసి, భరద్వాజ.. ” కెబ్లాసలు.. వీడు అనుకున్నంత సౌమ్యుడు కాదు. చూడండి అంటు సహాయం కోసం అర్ధించాడు.” నేను సౌమ్యుడిని అవునో కాదొ చూడడానికి ఇంత సమయం చర్చించావా అని బూతులు తిడీతే “కాదు..కాదు.. వంద డాలర్ల పదెం, నీ సౌమ్యత బూటకం అని నిరూపించడానికి ..నేను గెలిచా” అన్నడూ చిల్లర వెధవ. ఛీ..ఛీ.. మళ్లీ బూతులు వస్తున్నాయి. ఇలా బూతులు కామెంట్ల రూపం లో వుంచడం ఇష్టం లేక తొలిగించా!దీనికి గురించి, బ్లాగు ముఖంగా ఒక కామెంటు కూడా రాసా!ఎంత గా తల బొప్పి కట్టక పోతె, హఠాత్తుగా దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి? మళ్లి కింద పడ్డ తనదే పై చెయ్యి అంటాడు. కామెంట్లు డిలీటు చేసినా నీ విషయం అందరికి చెబుతాలే అంటె…అవును ఏడ్చె చంటి పిల్ల వాడిలా వెళ్ళి కంప్లైంటు చేసుకో పొమ్మన్నాను.నేను భయపడిన వాడిని అయితే ఈ టాపిక్ మళ్లీ ఎందుకు ఎత్తుతాను?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. saamaanyudu అంటున్నారు:

  మతం పట్ల మీకున్న అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. ఎవరేమనుకున్నా మీ వాదాన్ని బలంగా వినిపించినందుకు అభినందనలు.

 2. sowmya అంటున్నారు:

  చప్పట్లు, ఈలలు !

 3. karthik అంటున్నారు:

  boss few things:
  >>అప్పటికే కొన్ని పదులు సార్లు నన్ను మత ద్వేషి అన్నా ఊరుకున్నా.
  even i perceive you the same way but you need not feel offended for that because there is nothing wrong in hating something. we dont like means we DONT like..
  >>నేను భయపడిన వాడిని అయితే ఈ టాపిక్ మళ్లీ ఎందుకు ఎత్తుతాను?
  malak is the one who started thing again. (did i miss anything??)
  >>కెబ్లాసలు.. వీడు అనుకున్నంత సౌమ్యుడు కాదు. చూడండి అంటు సహాయం కోసం అర్ధించాడు
  ha ha ha. i didnt see those comments but knowing malak for quite sometime i would never believe this 😉

  However, I still fail to understand what forced you delete those comments. if you scolded some one why should you push it below the blanket??

  Anyways lets wait for malak’s response. But still feel that deleting those comments made the whole thing unclear.

  -Karthik

  • krishna అంటున్నారు:

   yes karthik u missed a lot. i started it in bondapaTi ji ‘s blog. regarding the word ” hate monger” used by bharadvaaja against me, i too taken that in a lighter way. but when he crossed limits, irritataed with stupid logics, and called me caste biased, i could nt control my self. i thought all the crap (that discussion ) is not needed to be in my blog. so i deleted them. i can restore all the comments, ( 136 comments.) but who know’ s he will say i manipulated some thing, edited blah, blah…
   i am also waiting for his reply.

  • krishna అంటున్నారు:

   @ కార్తిక్
   మీరు గాని మరెవరు గాని నన్ను మత ద్వేషి అనుకుంటె నాకు ఇబ్బంది లేదు. కాని పర మత ద్వేషి అనుకోకుండా వుంటె చాలు.అయినా మనం ఎదుటి వారి తో మాట్లాడెటప్పుడు సాధ్యమైనంత వరకు, మృదువైనా పదాలే వాడితే మంచిది. నేను మీ స్థానం లో వుంటె మతం పైన నా అభిప్రాయాలు కి సరి పడె నాలుగు పదాలు లో ఒకటి ఎంచుకుంటాను.
   1. మతం పై అయిష్టత.
   2. మతం పట్ల వ్యతిరేకత.
   3. మత ద్వేషం
   4. మతం అంటె అసహ్యం.
   ఇక భరద్వాజ సహాయానికి పిలిచాడొ లేదొ గాని, చాలా మంది అసలు విషయం తెలియకుండానె కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నా జవాబు చదివాక చాట భారతం అని , ఊరుకున్నారు.చర్చ విషయ ప్రాధనం అయితే , చిల్లర డబ్బులకి ఎదుటి వారి సహనం పరీక్షించడానికి కాకపొతె, అసంబధ్ధమైన వాదనలు లేక పోతె కామెంట్లు డిలీటు చేసె వాడిని కాదు. శ్రావ్య గారి అభిప్రాయం కూడా విన్నాక కామెంట్లు తిరిగి పెట్టాలా వదా అన్నది నిర్ణయిస్తాను.

 4. NotNecessary అంటున్నారు:

  KRISHNA:

  There are some pseudo secular bloggers with dual faces.

  They used their caste to survive all these years(i know about them personally).

  So don’t bother about these. Continue sharing your well learned thoughts.

 5. శ్రీవాసుకి అంటున్నారు:

  కృష్ణగారు

  కొంచెం కోపంగా, ఆవేదనగా వ్రాసినట్టున్నారు ఇది. ఆరోజే చెప్పాను కదా ఇలాంటివి పట్టించుకోవద్దని. బ్లాగర్ డాట్ కాం బ్లాగ్లలో అయితే ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయండీ. అందులో కొంతమంది మీద పేరడీ బ్లాగ్లు కూడా వెలిసాయి. పైన కామెంట్ చేసిన సౌమ్య గారు కూడా ప్ర.పీ.సం.స బ్లాగ్లో చాలా కామెంట్లు వ్రాస్తారు. కావాలంటే అడగండీ. అలాగే పానశాల, పైత్యం అని పేరడీ బ్లాగ్లు కూడా ఉన్నాయి. ఇందులో వీళ్ళంతా తలపండిపోయారు. మనకే ఇలాంటివి కొత్త. సరదాగా బ్లాగ్లు చూడటం, బి.పి పెంచని టపాలు వ్రాయడం మేలు.

  • krishna అంటున్నారు:

   ఆ విషయం నేను కూడా మరీ అంత సీరియస్ గా తీసుకోలెదు లెండి.కాకపోతె బొందల పాటి గారి బ్లాగు లో ఎవరొ అవాకులు చెవాకులు పేలితే భరద్వాజ, పెద్దరికం నెరుపుతుంటె చూడలేక ఆ విషయం అందరికి తెలియాల్సిన అవసరం వుందని ఈ టపా!

 6. sravyav2020@gmail.com అంటున్నారు:

  కృష్ణ గారు నాకొక చిన్న డౌట్ మతాన్ని నమ్మక పొతే దాని నమ్మే వారి అభిప్రాయాలను గౌరవించాలా అక్కరలేదా ?
  BTW నాకు తెలిసి భరద్వాజ గారు అంత సంయనం కోల్పోయి వాడు వీడు అని గాని, చదవలేని భాష లో గాని కామెంట్లు రాయటం నేను ఎక్కడ చూడలేదు , ఇంతకన్నా భయంకరమైన వాదనలలో కూడా ఆయన సంయమనాన్ని చూసాను. మీరెంటండి ఈ రాతలు
  చిల్లర వెధవ. ఛీ..ఛీ.. మళ్లీ బూతులు వస్తున్నాయి >> ఏమిటండి ఈ భాష ? దీనిని ఏమంటారు ?

  • krishna అంటున్నారు:

   @ శ్రావ్య గారు, మతం పై నాకు కొన్ని నిర్ధుష్ట అభిప్రాయాలు వున్నయి. ఆ విషయం లో నేను కొత్తగా నేర్చుకునే అంశాలు వలన నా అభిప్రాయం మార్చుకోవడానికి నేను సిధ్ధం.నేను మతం లో మంచి చెడులు బేరీజు వేస్తు, ‘ దేముడిని పడగొడదాము రండి ‘ అని ఒక టపా రాసాను. మతం లో మంచి కూడా పేర్కొంటు, అందులో వున్న చెడుని చెప్పాను. నేను మతాన్ని నమ్మక పోయినా నా బంధువులు, స్నేహితులు చాలామంది ఆస్తికులు.వారిని గౌరవిస్తు, నా అభిప్రాయాన్ని కూడా సున్నితంగా చెబుతాను. మూఢ విశ్వాసాలని ఖంఢిస్తాను. సాటి మనిషిలో దేముడిని చూడడానికి ప్రయత్నిస్తాను. అన్ని సార్లు సఫలం కాలేను అనుకోండీ, నా తప్పులని నేనె బేరీజు వేసుకుని నన్ను నేను సరి దిద్దుకుంటాను.
   ఇక నా భాష, నా సయమనం విషయానికి వస్తె,
   సహనానికి హద్దు వుంటుంది. నువ్వు అన్నంత మాత్రాన కించ పరిచినట్టు కాదు, మీరు అంటు అవాకులు చెవాకులు మాట్లాడడం మర్యాదా కాదు.మా చర్చ లో చాలా భాగం కాని, ఇతరుల తో నా చర్చలో గాని, నేను ఎప్పుడు హద్దులు మీరలెదు.చర్చ విషయ ప్రధానం కాక ఎవరి తోనొ, కట్టిన పందెం గెలవడానికి నా సహనం పరీక్షించడానికి అయితే మరి….అసలు చర్చ లో ఇంత కంటె నీచమైన భాష వాడవలిసి రావడం కూడా అవి డిలీటు చెయ్యడానికి కారణం.

   • మంచు అంటున్నారు:

    కృష్ణ గారు.. మళ్ళి మీతొ సెపెరెట్ గా చర్చకి దిగాలేమో.
    మతం లొ చెడు లేదు. మతాన్ని పాటించే మనిషిలొ వుంది. అది యే మతమయినా కానీ.
    బద్రి ఎక్కడొ ఒక కామెంట్ పెట్టాడు ఇలా ( కరెక్ట్ గా ఇదే కాదు.. ఇంచుమించు ఇదె అర్దం వచ్చెలా ) ..
    ———————-
    ఐనస్టీన్ కనిపెట్టిన ఏ = ంచ్2 న్యూక్లియర్ పవర్ జెనెరేట్ చెయ్యడానికి వాడుతున్నారు.. అణు బాంబులు తయారుచెయ్యడానీకీ వాడుతున్నారు. ఒక వెళ ఐనస్టీన్ కనిపెట్టిన ఆ సూత్రం వల్లె ఈ రొజు ఈ అణుబాంబులు తయారుచేస్తున్నరని ఆ మాహా శాస్త్రవెత్తని నిందించడం ఎంతవరకూ సమంజసం. అది వాడుకునే మనుష్యుల మీద కదా అధారపడింది.

    ———————–

    ఈ ప్రపంచం లొ ఎదయినా (డబ్బు, తెలివితెటలు, పవర్, స్వార్ధం) రెండు రకాలుగా వాడుకొవచ్చు.. అందుకూ మతం కూడా ఎమీ మినహాయింపు కాదు.. అందుకు మొత్తం మతాన్నే రూపుమాపాలనడం ఎంతవరకు సమంజసం

   • krishna అంటున్నారు:

    i will definitely answer you about this. but in my next post on religion.

   • మంచు అంటున్నారు:

    that was E = mC^2

 7. Tokkalo blasa అంటున్నారు:

  Aaku rowdy gaadu nuvvanukunnamta manchodu kaadu. Blogs lo gaadida gaadu veedu.

 8. krishna అంటున్నారు:

  మీ కామెంట్స్ తీసివేయకుండా ఉండి ఉంటే (మీవి కాని, తనవి కాని) అప్పుడు ఎవరికయినా పూర్తిగా చదవటానికి ఆస్కారం ఉండేది. ఎప్పుడు అయితే మీరు కామెంట్స్ అదీ సెలెక్టివ్ గా తీసివేసారో, అప్పుడే మీరు తొందరపడ్డారేమో అని మీకే అర్ధమయ్యిందేమో అని అలోచించుకోండి.
  my 2 cents

  • krishna అంటున్నారు:

   ఇంగ్లీష్ కృష్ణ గారు,
   బహుశా మీరు చెప్పినది నిజమే కావచ్చు.శ్రావ్య గారు లాంటి వారు, అటువంటి భాషని హర్షించలేరు.నేను సయమనం కోల్పోయిన మాట వాస్తవమే!అందువలన వాటిని తొలిగించాను.

 9. అబ్రకదబ్ర అంటున్నారు:

  Take it easy 🙂

  మతం మత్తుమందు అననే అన్నారు కదా. దాని గురించి రాస్తే ఎవరో ఒకరికి మండుద్ది మరి. వాళ్ల మంట వాళ్లు వ్యక్తీకరిస్తారు, వాళ్లకి చేతైన పద్ధతిలో. మీకు చేతైన పద్ధతిలో మీ అభిప్రాయాలూ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇలా మళ్లీ సుదీర్ఘ వివరణలిచ్చుకుంటూ కూర్చోటం వృధా.

  • krishna అంటున్నారు:

   అబ్రకదబ్ర గారు,
   అసలు విషయం ఏమిటంటె ఒక బ్లాగులో నిందితుడు, మరొక బ్లాగు లో న్యాయ నిర్ణేత స్థానం లో కుర్చోవడానికి ప్రయత్నించడం. దానిని ఎండగడదామని ఈ ప్రయత్నం.
   అన్నట్టు, మీరు నా బ్లాగు లో కామెంటడం , నాకు గర్వకారణం.నాకు నచ్చె నేను మెచ్చె బ్లాగర్లు, మనసులో మాట సుజాతగారు, మీరు. ఆవిడ ఒకసారి కామెంటారు.ఇప్పుడు మీరు… iam happy.

 10. మంచు అంటున్నారు:

  మీ పొస్ట్ చదివాకానీ కామెంట్లు చదవలేదు.. ఒకె

  మతం మీద మీ అభిప్రాయాలొ ఎకీభవించపొయినా.. మీ ” పొస్ట్ వరకూ” నాకయితే ఏం ప్రాబ్లెం కనిపించలేదు. కనిపించి వుంటే ముందు నేనే బహుశా మీతొ వాదానికి దిగెవాడినేమో. తమాషా ఎమిటంటే ..సౌమ్య బ్లాగులొ (హ్త్త్ప్://వివహ-భొజనంబు.బ్లొగ్స్పొత్.చొం/2010/04/బ్లొగ్-పొస్త్_06.హ్తంల్) మతం గురించి ఒక కామెంట్ రాస్తూ నా వాదన సమర్దించుకొవడానికి ఈ పొస్ట్ ఒకటి రెఫరెన్స్ గా చూపా.. అయితీ నేను మీ పొస్ట్ సరిగ్గ అర్ధం చేసుకొలెదొ , మిమ్మల్ని సరిగా అర్ధం చేసుకొలెదొ తెలీదు.

  ” హిందూ మతానికి దిశా నిర్దేఅశాలు చేసె చతుర్వేదాలు కేవలం ఒక వర్గం గుప్పిట్లో వుండడం ఎంత వరకు సమంజసం ” . హిందూ మతం లొ మీరు చెప్పిన వర్గం కాకుండా ఎన్నొ వర్గాలు వున్నాయ్.. కొన్ని వందలు.. అందులొ కొన్ని ఈ రొజు మీరు చెప్పిన వర్గం కన్నా ఉన్నత స్తాయి లొ వున్నాయి ( డబ్బు, పలుకుబడి, రాజకీయాలు, పవరు లాంటివి ) కొన్ని తక్కువ స్తాయి లొ వున్నాయ్.. ఈ వర్గాలకెవరికీ లేని సమస్య నాస్తికుల కెందుకు అన్నది నా ప్రశ్న. ( మీరు నాస్తికులు కాక పొతె వదిలెయండి)
  నాస్తికుల ఉద్దేస్యం మూడనమ్మకాల రూపు మాపడమా.. లేక మతాన్ని రూపు మాపడమా.. మూడనమ్మకాలకు మతమే మూలం కనుక మతాన్ని కూడా అని చెప్పకండి.. రొజులతొ పాటు అలవాట్లు, పద్దతులు, కట్టుబాట్లు మారుతున్నాయ్.. ఎప్పుడొ వున్న సతీ సహగమనం ఇప్పుడు లేదు.. ఆడవాళ్ళు 30 రొజులూ ఆఫీసుకి వెళ్ళొచ్చు. కానీ మతం అలాగే వుంది. మతాన్ని విమర్శించకుండా కేవలం మూడనమ్మకాలని రూపుమాపడం పెద్ద కస్టమయిన పనేమి కాది.. యురొప్ ఉదాహరణగా తీసుకొండి..
  అలాగె సౌమ్య బ్లాగులొ రాసిన కామెంట్ వీలయితే ఒకసారి చూడండి..

  కొన్ని కామెంట్లు డిలీట్ చేసి కొన్ని వదిలెయ్యడం ఎంతవరకు సమంజసమో మీరే అలొచించండి.. మీకు నిజంగా ఆ చర్చ చెత్త అనిపిస్తె మొత్తం కామెంట్స్ డిలీట్ చేసి పారెయొచ్చుకదా.. కొన్నె డిలీట్ చెయ్యడం వల్ల.. రెండువైల్పిల వాదనలు ఎలా తెలుస్తాయ్

  వాసుకి గారు :-))

  • krishna అంటున్నారు:

   @ మంచుగారు,
   అసలు వాదం తో నాకు ఇబ్బంది లేదు అండి. ఎదుటి వారి నుండి, నేను ఇంకా నేర్చుకునే స్థాయి లోనె వున్నాను. కాని వితండ వాదం???కొంత వరకు భరించగలం. కాని వారి ఉద్దేశ్యమే మన సహనాన్ని పరీక్షించడం అయితే????? ఆ విషయం భరద్వాజ కూడా ఒప్పుకున్నాడు.అసలు ఈ టపా ఉద్దేశ్యం కూడా, నా మీద వ్యక్తిగత దూషణలు చేసి, మరొక బ్లాగులో అవి తప్పని భరద్వాజ సుద్దులు చెప్పడం గురించి.మతం పై నా అభిప్రాయాలు, మీరు చదివిన టపాలో రాసాను కదా!ఎక్కడైనా కించపరిచే ఉద్దేశ్యం వున్నట్టు అనిపించిందా? బలి పీఠం పై నా టపాలో నేను వెలిబుచ్చినది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను మందు తో మతాన్ని పోల్చినా దానిని అపహాస్యం చేసానా లేక ఒక రీజనింగు తో ఆ పోలిక చెప్పానా అన్నది కల్మషం లేకుండా అలోచిస్తె తెలుస్తుంది. సరె నా వ్యక్తిగత అభిప్రాయం ఆయనకి నచ్చలేదు అనుకోండి, సరిగా వాదించి, నా అభిప్రాయం మార్చినా నాకు నష్టం లేదు.కేవలం వ్యక్తిగత దూషణ , నా సహన పరీక్ష అయితే బుద్ది వచ్చినట్టు మనమే చెయ్యాలి తప్ప ఎవరి మీద ఆధార పడకూడదు అన్నది నా అభిప్రాయం.
   మతం పై నా అభిప్రాయాలు మరొక తపా లో…
   కొన్ని వాఖ్యలు లో నావి కూడా వున్నాయి.అతడివి కొన్ని వుంచుదామనుకున్నా ఆ వేడిలో మొత్తం డిలీటు చేసా.బహుశా ఆ కామెంట్లు, కొన్ని రోజుల కోసం తిరిగి పెడతాను.ఇంకా నిర్ణయించుకోలెదు.

  • శ్రీవాసుకి అంటున్నారు:

   @ మంచు
   దేనికండీ ఇది. అవును మంచు అంటే మంచుపల్లకీ బ్లాగ్ కదా.

 11. krishna అంటున్నారు:

  @ నాదెండ్ల గారు…
  దీనికి నేను కాదు సమాధానం ఇవ్వాలిసింది అనుకుంటాను. మీ వాఖ్య ఇక్కడ అప్రస్తూతం అనిపించడం వలన తొలిగిస్తున్నాను.

 12. Sarath 'Kaalam' అంటున్నారు:

  మతం మీద మీ భావాలు బావున్నాయి. ఒకాయన కూడా ఇలాంటి భావాలే ప్రకటిస్తుంటే ముచ్చటపడి అభిమాని గొర్రెనయిపోయాను. తరువ్వాత్తరువాత నెమ్మదిగా మబ్బులు వీడి ఆ మత్తు వదిలి తాను మేధావి కాదనీ, మేతావి అనీ, కుల గజ్జి బాగా వుందనీ అర్ధమయిపోయి ఆ గజ్జికి దూరంగా వుంటున్నాను. ఒకసారి అనుభవం అయ్యింది కాబట్టి ఎవరయినా చిలకపలుకుల్లాంటి అభ్యుదయ భావాలు పలకగానే నమ్మేసేయ్యకుండా కాస్త జాగ్రత్తగా వుంటున్నాను. ఇప్పుడు కూడా కొన్ని గొర్రెలు అతన్ని అమాయకంగా మేధావి అని నమ్మి చుట్టూ తిరుగుతుంటాయి. ముఖ్యంగా ఓ ఆడ గొర్రె కూడా అలా తిరుగుతుంటే పాపం అని జాలివేస్తుంటుంది.

  ఇంతకూ వాళ్లంటున్నట్లు మీకు కూడా కులగజ్జి వుందా లేదా? దీని మీద ఓ క్లారిటీ ఇస్తే సంతోషిస్తాను.

  • మంచు అంటున్నారు:

   శరత్ – మంచు వేరు వేరు :-))

   • krishna అంటున్నారు:

    confused:-)

   • krishna అంటున్నారు:

    @ మంచు గారు, ఎదుటి వారి అభిప్రాయాలని గౌరవించనిది ఎవరొ? మతం పై నా అభిప్రాయాలు ఏమిటో ఇక్కడ అవసరం లేదు అనుకుంటా. ఒకరి బ్లాగులో చిల్లర వేషాలు వేసి, మరొక బ్లాగులో పెద్ద మనిషి ఫోజు కొడుతున్న వారి అసలు రూపం బయట పెట్టడం అసలు ఉద్దేశ్యం.అది తెలియడానికి కామెంట్లు కూడా చదవనక్కర లేదు.భరద్వాజ అరిచి గీ పెడుతున్నాడు కదా, నాకు 100 డాలర్లు లాభం అని,పాపం ఈ ఆర్ధిక మాంధ్యం మనుషులని ఎలా తయారు చేస్తుంది, ప్చ్..ప్చ్..
    ఇక సూటిగా నా అభిప్రాయం చెబుతాను.ఎదుటి వారిని గాని, వారి మతాన్ని గాని చులకన చెయ్యాలి అనుకుంటె మతం పై టపాలోనె చెసెవాడిని కదా!నేను ఒక పోలిక చెప్పాను, దాని వెనక లాజిక్ కూడా వివరించాను. మతాన్ని సమర్ధించే వారు, కేవలం తమ మతాన్ని మాత్రమె సమర్ధించుకుంటుంటెనె అర్ధం అవుతుంది, “ఎదుటి వారు మతం మనదైతేనే వారి భావాల తో సహానుభూతి పొందుతాను అని” నాకు మటుకు ఎవరు ఒక మతాన్ని గేలి చేసినా సమర్ధించే సంస్కారమూ లేదు, కుల వ్యవస్థ లో లోపాలు ఎత్తగానె కుల గజ్జి అంటించే గొప్పతనమూ లేదు. ఎదుటి వారి పట్ల గౌరవం చూపితే చాలు, అభిప్రాయాలు గౌరవించే పని లో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు కూడా గౌరవించేదామా? చర్చ సబ్జెక్టివ్ అయితే ఒకరి అభిప్రాయాలు ఒకరు వెలిబుచ్చుకోరా? ఇలా ఆర్ధిక మాంధ్యం వలన పందేలు కట్టుకుని సంసారం సాగదీస్తున్న వారికి చర్చ ఎప్పుడూ సబ్జెక్టివ్ అయ్యేను?

  • krishna అంటున్నారు:

   @ Sarath ‘kalam’
   నా జీవితం లో నేను ఎటువంటి వివక్షని ఎదురుకోలెదు. మహా అయితే బాగా చదివే మా అక్క నా పై తన పెద్దరికాన్ని, స్త్రీ ఆధిక్యాన్ని చూపించేది అనుకోండి. just kidding.
   మతం పై నా అభిప్రాయాలు కేవలం ఆలోచించి, చదివి, కొంత మంది పెద్దలు తో మాట్లాడడం వలన ఏర్పరుచుకున్నవే గాని, నేనెదొ వివక్షకి గురి అవ్వడం వలనొ, నా మీద ఎవరొ జులుం చూపడం వలనొ, కాదు.అలా వివక్ష కి గురి అయిన వారి ఆలోచనలు ప్రతీకార వాంఛ వలన ప్రభావితం కావచ్చు.అది సహజం.నేనెప్పుడు కుల వ్యవస్థ ద్వారా జరిగిన వివక్షకి ఇటువైపే వున్నాను.అయినా అది నాకు తప్పు గానె అనిపించింది.మన భారత దేశం లో పని వారి సంస్కృతి వుండడం, కొన్ని పనులని చిన్న చూపు చూడడం వలన నేటి(బహుశా నిన్నటి) కుల వ్యవస్థ ఇలా వుంది అని నాకు అనిపిస్తుంది.అదే పాశ్చాత్య దేశాలలో మధ్య తరగతి వారు, తమ ఇంట్లో మరుగు దొడ్లు కూడా కడుగుతుంటారు కాబట్టి అలాంటి పనుల పై మరీ అంత అసహ్యం లేదు. నేడు ఆ పనులు చేసె వారి పరిస్థితి మెరుగు పడి అలాంటి పనులకి ఎవరు దొరక్క మన పనులు మనమె చేసుకుంటె ఈ వివక్షలు, ఆయా వర్గాలని కించపరిచె పేర్లు రూపు మాస్తాయని నా అభిప్రాయం.
   ఇంతకి కుల గజ్జి అంటె???

 13. Jayavani అంటున్నారు:

  You gave your clarification without making it complicated this time.
  But my suggestion would be to keep balance and try to just concentrate on what is needed. I think there is no need to prove someone is wrong and the other one is right. People have their own way of justifying. You should think before you do anything whether answering some sort of questions is necessary or not. I guess you still need to learn on handling people and avoiding unnecessary conversations. I am sure being the blog owner, you always have the control over these things. If you think some thing is adding value to the blog, how much contraversial may be it is, you can go ahead and add that. The whole point of blogging is to share knowledge and opinions on different aspects. My request is try to keep it that way. You have a very good talent on expressing your opinions in an interesting and attractive way. Stick with that and don’t involve yourself into unnecessary things. This is my sincerest advise as your well wisher. Good luck.

 14. అబ్రకదబ్ర అంటున్నారు:

  >> “ఇంతకి కుల గజ్జి అంటె???”

  ఇదొక రకం అంటువ్యాధి. ఈ వ్యాధి లక్షణం భలే తమాషాగా ఉంటుంది: అదున్నవారికి తాము తప్ప ఎదుటివాళ్లందరూ సదరు గజ్జి బాధితులుగా కనపడటారు. అంటువ్యాధి కాబట్టి సహజంగానే ఒకర్నుండొకరికి పాకుతుందిది. అలా పాకిచ్చుకున్నవారు ఒకరి వీపుని ఒకరు, కొన్ని సార్లు ఎవరి వీపుని వారు గోక్కుంటూ, దురద తీర్చుకుంటూ, ఆ విధంగా ముందుకో వెనక్కో పోతుంటారు. అలా గీక్కునే సమయాల్లో వాళ్ల ముఖాల్లో వర్ణించనలవికాని అలౌకికానందం ద్యోతకమౌతుంటుంది.

  ఇంచుమించు కులగజ్జి లాంటిదే మతతామర కూడా. భారతీయుల్లో అధికులకి ఈ రెండు జబ్బులూ ఎంతోకొంత శాతంలో జన్యువుల ద్వారా సంక్రమిస్తాయి. జన్యుసంక్రమణం కాబట్టి వీటికి నివారణోపాయం లేదు. అదుపులో ఉంచుకోటమే ఎవరైనా చెయ్యగలిగేది.

  • krishna అంటున్నారు:

   @ అబ్రకదబ్ర గారు,
   హహ్హ ..హహ్హా..హహహ!!ఎంత సీరియస్ విషయమైనా ఇంత సరదాగా చెప్పడంలో మీ తరువాతే ఎవరైనా!!నిఝంగా కుల గజ్జి వున్న వాళ్లు కూడా మీ జవాబు చదివి మందహాసం చేసె వుంటారు. తరువాత మొహం మాడ్చుకుంటారు అది వేరె విషయం. జన్యు సంక్రమణ ద్వారా నాలో కూడా ఇది వుండి వుంటుంది. అదుపులో వుంచుకోవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తాను.
   ఇక బ్లాగులోక కళ్యాణం కోసం మీరు విధించుకున్న ఆరున్నొక సూత్రాలు విలువ నాకు తెలిసి వచ్చింది లెండి.వాటిని పాటించగలిగితే ఇలా వుండేది కాదు కదా!

 15. చదువరి అంటున్నారు:

  మీ బ్లాగుల్లో జరిగిన గొడవ గురించి నాకు తెలీదు. (మతంపై మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకు అసలే సరిపడనివి లెండి). అయితే..

  “…నా సయమనం విషయానికి వస్తె, సహనానికి హద్దు వుంటుంది.” -ఈ విషయంలో 100 శాతం మిమ్మల్ని సమర్ధిస్తాను.

  • krishna అంటున్నారు:

   @ చదువరి గారు,
   నా సహనపు హద్దులని నేను మరింత విశాలం చేసుకోవాలి లెండి. చర్చ పక్క దారులు పడుతున్నప్పుడు, ఎదుటి వారు వాదన వెనక ముసుగు చాటు ఉద్దేశ్యాలు వున్నాయి అని తెలిసినప్పుడు, ఇక మీదట నిలువరించుకోవడానికి ప్రయత్నిస్తాను.

 16. krishna అంటున్నారు:

  బెట్టింగ్ బంగార్రాజూ!
  ఎప్పటికి నీకు బుధ్ధి వస్తుంది?మరీ పరిస్థితి అంత దారుణంగా వుంటె అడగొచ్చు కదా!నాకు చేతనైనంత చందా నేను ఇస్తాను. తెలిసిన వాళ్లకి చెప్పి, ఇంకొంత ఇప్పిస్తాను.ఇలా పందేలు కట్టుకుని ఏమి సంసారం సాగిస్తావు. జనాలు నవ్వుతున్నారు, నీ చిల్లర వేషాలు చూసి!! అయినా 200 $ లో పదొ, పాతికో ఇస్తానంటె దొంగ సాక్ష్యం చెప్పేటందుకు చిల్లర వెధవలు నీకు తోడు వస్తారని నాకు తెలుసులే. నీ లాంటి అభిరుచే అయ్యుంటాది నీ స్నేహితుడిది.
  సిగ్గు…సిగ్గు…హెహెహెహె!!!!

  • krishna అంటున్నారు:

   @ మలక్, నా కామెంట్ల పై మోడరేషనాస్త్రమా? కామెంటిన వెంటనే కనిపిచడం లేదు.అందుకే నా బ్లాగు లో కూడా అదే కామెంట్ పెట్టా! నువ్వు అన్న నాలుగు అక్షరాలు పదాలు లేవె నా కామెంటులో! ఒహొ! చిరాకు తట్టుకోలేక పోయినట్టు వున్నావు. వెటకారం లో ట్యూషన్లు కావాలంటె అడుగమ్మా! నువ్వు అది నేర్చుకున్న స్కూలు కి నేను హెడ్‌మాష్టర్ ని లే! ఇరిటేషన్ అనిపిస్తే గొకేసుకో! నిన్ను గోకడానికి నీ వాళ్లు హెల్ప్ చేస్తారనుకో! మొహమటపడకు కుల గజ్జి తీర్చేసుకో!ఇప్పుడే నీ జబ్బు గురించి తెలిసింది. i pity u!!!

 17. krishna అంటున్నారు:

  @ malak!
  పలాయన వాదం అన్న పదం దివాలాకోరుతనం అంత దారుణమేమి కాదే! నా వాదనలో తప్పుని కొంత లాజిక్ తో తప్పని చెప్పవయ్య నా అభిప్రాయం మార్చుకుంటాను అన్నా!నీకు మతం పై అంత అవగాహన లేక పోతె మూసుకుని పోవాల్సింది, నాది అంతా ద్వేషం , నా ఊపిరి నిండా ద్వేషం అని జవాబు ఇవ్వక తప్పించుకుంటె పలాయనం అన్నా!పలాయనం అంటె తప్పించుకోవడమే కదా!నేను వాడిన పదం లో ఏమిటి తప్పు? నేను అన్నదానికి దివాలాకోరు తనం అని ఎందుకు అన్నావ్? నీకసలు తెలుగు వచ్చా? నీకు అర్ధం కాదు లే అని నాకు తెలుస్తుంది. ఒకటి అడిగితే ఒకటి చెబుతావు. తిక్క తిక్క సంబధం లేని ఉదాహరణలు…రాయడం చదవడం రాకపొతె మానెయ్యొచ్చు కదా! మా ప్రాణాలు ఎందుకు తోడెస్తావు?
  ఇంకా నేనెదొ ఈ గొడవ అయ్యాక భయపడి స్థబ్దుగా వున్ననని ఎందుకు అనుకున్నావు? నా బ్లాగు లో గొడవ గురించి కామెంట్ రాసా. నీ బ్లాగు లో వేదాల పై నీ టపా కి కామెంటా? బొందలపాటి గారి బ్లాగులో నీ నక్క జిత్తులుని ఎత్తి చూపా!ఇప్పుడు నీ డబ్బు కోసం గడ్డి తినే దివాలా కోరు తనం బయట పెట్టా!నేను దాడి చేసా! కాచుకోలేక పోతున్నవు.ఇప్పటి కన్నా మించి పోయింది లేదు, వితండవాదం మాని, ఊరుకో! నిన్ను సమర్దిస్తూ ఒక్కళ్లు కూడా ముందుకు రావడం లేదు.అలవాటెగా, “కెబ్లాసలు వీడు సౌమ్యుడు కాదు, అనవసరం గా తొడగొట్టి వాయగొట్టుకున్నా” అని మొత్తుకో!ఎవరైనా సహాయం చేస్తారేమొ? ఎవరిని అన్న తెచ్చుకొ, ఎవరిని అన్న తెచ్చుకో అని నువ్వన్నా నేను ఎవరి సహాయం అడగలేదు. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా కనీసం నీ వాదనని సమర్ధించే ఒక ఖామెంటూ రాలెదు.నాకు నీలా గుంపులు కట్టడం ఇష్టం లేదు.మతం పేరు మీద, కెలుకుడు కులం పేరు మీద!అయినా నువ్వు చెప్పిందే కదా, కెలకకురా కెలకబడేవూ అని. అనుభవించు. నీ ఖర్మ!

 18. కత్తి మహేష్ కుమార్ అంటున్నారు:

  సామాజిక సత్యానికి బ్లాగుల్లోని పోకడలు అద్దంలాంటివి మాత్రమే. ఇక్కడా కులాల కురుక్షేత్రాలూ,ఆధిపత్యభావజాలాలూ తప్పవు.

  ఇక కెలుకుడు మహారథులకు కావలసింది entertainment మాత్రమే…కాబట్టి వాళ్ళతో చర్చలు వృధా. Just go ahead with your usual writing. Don’t waste time over them. They mean NOTHING.

  • krishna అంటున్నారు:

   మహేష్ గారు,
   వారికి ఎదుటి వాళ్లని ఇబ్బంది పెట్టి ఎంటెర్టెయిన్ అవ్వడం ఎలాగొ కొన్ని చిట్కాలు నేర్పిస్తాను.ఇంకెవరిని కేలకడానికి భయపడెటట్టు చేస్తాను.అందరు సరెలెమ్మని ఊరుకోవడం వలన వీరు అద్దు ఆపూ లేకుండా ఇలా తయారు అయ్యారు.వీరికి గుణ పాఠం అవసరమే! అలా అని నా సమయం ఎక్కువ వృధా చేసుకోను లెండి.మీ సలహాకి కృతజ్ఞతలు.

 19. krishna అంటున్నారు:

  క్రిష్ణ,
  1. మీరు నాస్తికవాదం గొప్పదనాన్ని తెలియచేయాలంటే “మతం కూడా(మందు పేకాట లాంటి) చెడ్డది కదా!” అన్న బ్లాంక్ స్తేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటారా? అది ఈ గలాటకు మొదలు కాదంటారా? మతం లో చెడు ఉండవచ్చు, మంచి లేదంటారా?

  2. ఎవో కొన్ని కులాలు వేటినో దాశిపెట్టుకొన్నారు అన్నారు, పైన అబక్రదబ్ర చెప్పినట్లు అది చేయని కులం కాని (జెనిటికల్ గా కాని, స్వార్ధ కారణాల వలన కాని), జాతి కాని ఎదయినా చరిత్రలో ఉందా?
  సరే ఉదాహరణకు ప్రస్తుతం నేను చూచిన రెండు ఉదాహరణలు చెప్తున్న, మా ఉర్లొ ఇటీవలే తర తరాలుగా పందులు కాసుకొనె ఎరుకలు, యానాదులు కొంతమంది కాయటం మొదలెట్టారు అని ఆ పందులకు విషం పెట్టటమే కాక, యానాదుల మీదకు కర్రలు, రాళ్లతో వెళ్లారు, అందుకని ఎరుకుల కులస్తులు అందరూ అంతే అందామా, లేక పందులు కాయటమనే వృత్తే తప్పు, చెడ్డది అందామా?
  ఇక ఈ మద్దెన వడ్డెర కులస్తులు, మట్టి తీసే పని మాకు తప్ప ఎవరికీ ఇవ్వకూడదు, ఇచ్చినా మా కోటా మాకు ఇచ్చినాకే అన్న డిమాండ్ చేస్తున్నారు, మీరు పేపర్లలో చదివేఉంటారు, మట్టి తీసే లాంటి సామాన్య శారీరిక శ్రమకు అదీ ఈ రోజులలో మాకే హక్కు కావాలని అడుగుతుంటే కొందరు, ఎప్పుడో knowledge ని మా కులానికో, మా కుటుంబానికో చెందాలన్న స్వార్ధం తో ప్రవర్తిస్తే దాని వలన మతం మొత్తం తప్పు అంటారా?
  కాస్తో, కూస్తో సం యమనం తో వ్రాసే మీరేనా ఇలాంటి బ్లాంకెట్ స్టెట్మెంట్స్ ఇచ్చింది? ఓ సారి ఆలోచించుకోండి!!

  ఇక పైన మహేష్ గారన్నట్లు ” ఇక్కడా కులాల కురుక్షేత్రాలూ,ఆధిపత్యభావజాలాలూ తప్పవు.” అంతే కాదు అంతులేని ఆత్మ నూన్యతాభావజాలాలకు, వాటిని అడ్డం పెట్టుకొని ఓ మతం మీదో, కులం మీదో విషం చిమ్మే వాళ్లకు బ్లాగ్లలో లోటు లేదు.

  వీటన్నిటినీ పట్టించుకోకుండా, మీరు వ్రాయాలనుకొన్నది వీలయినంత వరకు సం యమనంతో, వ్రాయటమే మీరు చేయగలిగింది, ఎవ్వరూ ఎవ్వరికీ గుణపాఠాలు చెప్పలేరు, ఎవ్వరూ ఎవ్వరినీ బలవతంగానో, బెదిరించో మార్చలేరు.

  ఎప్పటిలాగే my 2 cents

  • krishna అంటున్నారు:

   @ ఇంగ్లిష్ కృష్ణ
   నేను నాస్తిక వాదాన్ని కాని, మరే వాదాన్ని కాని సమర్ధిస్తూ పై వ్యాఖ్య చెయ్యలేదు.మంచి చెడు ప్రతి విషయంలోను, ప్రతి మనిషి లోను వుంటాయి.మతాన్ని అవహేళన చేసె ఉద్దేశ్యం నాకు లేదు. పైగా నేను ఒక మతాన్ని సమర్ధిస్తూ, పక్క మతాన్ని విమ్ర్శించలేదు.మతం లో మంచి లేదు అని నేను అనలేదు.దాని లో చెడు లేదని ఎవరన్నా అనగలరా? అలాగె మందు కూడా పూర్తిగా చెడు అని చెప్పలేదు. ఒక పోలిక చెప్పాను. దానిని సమర్ధిస్తూ ఒక విశ్లేషణ కూడా చేసాను. అది మీరు చదివి ఆ పోలిక ఏ విధంగా తప్పో చెప్పండి. నేను నా అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎప్పుడూ సిధ్ధమే! ఒక మంచి విషయం తెలుసుకుంటె దాని వలన నా ఆలోచనా పరిధి తప్పక పెరుగుతుంది.
   ఇక ఈ టపా విషయానికి వస్తె, మలక్ నా తో వాదన ఒక వాదనలా చేసినంత సేపు, నాకు చాలా ఆనందం కలిగింది. మతం పై నాకున్న అనుమానాలు తీరుతాయేమొ అనిపించింది. కాని ఆయన అవహేళన చేద్దామనె వితండవాదం పెట్టుకున్నాడు.సరె జరిగింది ఏదొ జరిగింది.అతడు వేదలు పై టపా రాసినప్పుడు, అతడి బ్లాగులో నా అభిప్రాయం చెప్పాను. కాని అతడు నా అభిప్రాయం ని వ్యతిరేకించలేదు.నేను ఏమి అవహేళన చేద్దామని కామెంట లేదు. కాని బొందల పాటి గారి బ్లాగు లో ఎవరొ అవాకులు చెవాకులు పేలితే భరద్వాజ పెద్దరికం నెరుపుతుంటె, అతడి ద్వంద ప్రవృత్తి బయట పెట్టలని ఇలా……అతడు పై చాలా మంది మంచి అభిప్రాయాలు వెలిబుచ్చారు.ఎంత తీవ్రమైనచర్చలోని ఐనా సయమనం కోల్పోడు అని. కాని నా తో చర్చ లో అతడి ప్రధాన ఉద్దేశ్యం, నా సౌమ్యత ని పరీక్షించడమే అంటా!నన్ను కావాలనే కెలుకుదామనే అవహేళన చేసాడు అంటా!సరె అవహేళన నేను చేస్తె ఎలా వుంటుందొ, నేను కెలికితే ఎలా వుంటుందో అతడికి చూపించాలి కదా!తప్పదు మరి!

 20. krishna అంటున్నారు:

  మతం గురించి బోలెడంతా వివరించాను అన్నావు కదా! నీవు ఇచ్చిన ఉదాహరణ మీద నా ప్రశ్నలు.అన్నింటికి సమాధానాలు చెప్పు. నీకు తెలీక పోతె నువ్వు చర్చ కేవలం చిల్లర కోసం నా తో తగువు పెట్టుకున్నవని డిసైడు అయ్యిపోతా!అయినా నీకు చిల్లర కోసం దేనిని అయినా తాకట్టు పెట్టె గుణం వున్నట్టు వుంది.ఉద్యోగం సద్యోగం ఏడవలెదు లేదు కామోసు!పగలు రాత్రులు పోఅసుకోలు కబుర్లు కంప్యూటరు మీద! మరి డబ్బులు అవసరం వుండదూ!సరె ఇక సీరియస్ గా నా ప్రశ్నలు: 1. కార్ తయారీదారుడు = మతం. అవునా? 2. మాన్యూవల్ = మత గ్రంధం/ దిశా నిర్దేశాలు. అవునా? 3. యూజర్ = మతాన్ని అనుసరించేవాడు. 4. కారు నడపడం = మంచి మార్గం లో నడవడానికి మత దిశా నిర్దేశాలు పాటించడం. 5. తయారీ దారు ఇచ్చె మాన్యూవల్ అందరు యూజర్లు చదవాలి కదా, చక్కగా కారు నడపాలి అంటె! 6. నువ్వు చెప్పింది మాన్యూవల్ చదివి అర్ధం చేసుకోవాలి అంటె ఒక అర్హత వుండాలి అని. అవునా?అంటె అందరు చదివి అర్దం చేసుకోలేరా? నువ్వు కారు కొంటె నీకు చైనా భాషలొ మాన్యూవల్ ఇస్తె అది చదివి ఎలా కారు నడుపుతావు?నీకు అలాంటి మాన్యూవల్ ఇచ్చిన మానుఫేక్చరర్‌ది తప్పు కాదా?సరె అది నీకు అర్ధం అయ్యె భాషలోనె వుంటె… 7. తయారీదారు మాన్యూవల్ రాసెసి కొనేవారి అందరి కోసం షాప్ ముందు పడేసాడు అనుకొందాము.అది వాడి నిర్లక్ష్యం అయినా సరె, వదిలేద్దాము.కొంతమంది, ఆ మాన్యూవల్‌స్ అన్ని తీసేసుకున్నారు.అవి దొరకని వారికి మేము వున్నము కదా! మీకు దిశానిర్దేశం చెయ్యడానికి అన్నరు.సరెనా? 8. అంత గొప్ప మాన్యూవల్ చదివినా వారికి కారు నడపడం రాలేదు.సరి కదా, మాన్యూవల్ అందని వారికి కూడా కారు నడపడం రానివలేదు.ఇక్కడ మాన్యూవల్ లాక్కున్న వారి పై నా ప్రశ్న కాదు. అలాంటి మాన్యూవల్ వలన ఏమిటి ప్రయోజనం?చదివిన వారికి ఎవరికి అర్ధం కాలేదు.వారికి దాని వలన నిజంగా ప్రయోజనం పొదితే, వారిని మంచి డ్రైవర్లు గా మార్చగలిగితే మాన్యూవల్ అందని వారికి, లేక అర్ధం చేసుకోని వారికి అర్ధం అయ్యెటట్టు, డ్రైవింగ్ వచ్చేటట్టు చేసెవారు. వేల వేల సంవత్సరాలుగా ఈ వేదాలు చదివిన వారు,చదివి ప్రయోజనం పొందిన వారు, ఈ సమాజమ్ని ఒక రెండు వందల సంవత్సరాలు క్రితం ఏ స్థితిలో వుంచారు. అత్యధికులు, సతీ సహగమనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, అస్పృశ్యత, స్త్రీ వివక్ష ఇన్ని అవకరాలతో ఈ సమాజాన్ని అలంకరించారు.వేల సంవత్సరాల వేద పఠనం వలన ఏమి ఒరిగింది?ఈ మధ్య కలిగిన మార్పుకి ఆంగ్లేయుల విధ్యా విధానం, సంస్కరణ ఎంతవరకు కారణం?వేదాలు వేల ఏళ్లు చెయ్యని మార్పు ఇప్పుడు ఎలా కలిగింది?నేను క్రైస్తవాన్ని సమర్ధించడం లేదు.దాని పైన నాకు కొన్ని అనుమానాలు వున్నాయి.ప్రతి పాయింటు కి పాయింటు వారీ సమాధానం ఇవ్వు.అప్పుడు ఒప్పుకుంటా! వేదాలలో మంచిని.మతంలో మంచిన్.భేషరతుగా క్షమాపణ అడిగి నా వాఖ్యని వెనకకి తీసుకుంటా! సరైన సమాధానం నువ్వు ఇవ్వలేకపోతె,ఇంతకు ముందు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది.చిల్లర కోసమె చిల్లర వేషాలు వేసావని ఒప్పుకుని బ్లాగు లు వదిలేసి పోతావా? ఇది నా బెట్. దమ్ముంటే కాయ్.

 21. Indrasena Reddy అంటున్నారు:

  I completely agree with you Krishna gaaru..

  @Abrakadabra gaaru

  Your statement on “Kula Gajji” is halarious and it gets 100/100 marks. I will try to control my K G.

  Best Regards,
  IndraSena

 22. abhi అంటున్నారు:

  అయ్యో! మీకు వీళ్ళ గురించి తెలీదల్లే ఉంది. వీళ్ళకి ఇలా వక్రీకరించటం తప్ప మరింకేమీ చేతకాదు. అనవసరంగా మీ దృష్టిని మళ్ళించి మీ సమయాన్ని వృదా చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎంత అరిచినా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. పట్టించుకోవడం మొదలుపెట్టారా మీపై రోజుకో ఆరోపణ చేస్తూనే ఉంటారు.

 23. krishna అంటున్నారు:

  >>అనవసరమైన చోట కుల ప్రసక్తి తీసుకొచ్చేవారిది – నీదే :))>>
  who the two hoots are you to decide?
  ఇది నీ భాష!నాది కాదు.కుల ప్రస్తావన అప్రస్తుతం కాదు అక్కడ. వేదాలు చదివిన ఒక వర్గం అన్నా , బ్రాహ్మణులని అన్నా అది ఒక వర్గం పై నా ద్వేషమా?ఆ వర్గంలోని వారు (కొద్ది మంది వ్యతిరేకించి వుండవచ్చు) చేసిన మార్గదర్శనం వలన (ఎందుకంటె వేదాలు వారు మాత్రమె చదివి మిగిలిన వారికి ఉపదేశం చేసెవారు.) సమాజం లో దురాచారాలు ప్రబలినాయి.మార్గ దర్శనం చెయ్యాలిసిన వారే దురాచారాలని తెగనాడక వారు కూడా ఆచరించారు అని అందువలన ఆ వేదాల గొప్పవని, వాటిని చదవడం గొప్ప అని అనడం నేను ఒప్పుకోలేను.ఆ దురాచారల వెనక ఆ వర్గమే కాదు ఇంకా చాలా వర్గాలే వున్నాయి.వేదాల గొప్ప అని అంటె కాదు అని చెప్పడానికి అలా అన్నను.అది నీ కులం కాబట్టి తోక తొక్కిన పిల్లిలా ఎగిరావు. కుల భావం నీలో వున్నది.నీది కుల గజ్జి కాబట్టి ఎదుటి వారిలో కూడా నీకు కుల గజ్జి కనిపిస్తుంది.నేను అన్నది ఎందుకు తప్పొ చెప్పలేక, నేను చెబుతుంది పూర్తిగా వినలెక భరించలేక నీ కులగజ్జి బయట పెట్టుకున్నావు.ఇప్పుడు తెలిసిందా ఎవరిది కుల గజ్జో?
  25 మే 2010 7:04 am

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s