ఉరి …..సరి????

Posted: మే 8, 2010 in రాజకీయం, వ్యంగ్యం
ట్యాగులు:,

వేడి వాడి విషయం మీద ఇన్ని వేరు వేరు అభిప్రాయాలు, అవి కూడా చదవగానె అప్పటికి పూర్తిగా సరైనదే అని అనిపిస్తుంటె ఏమని కామెంటాలో తెలియక తికమకలో ఈ టపా…సాధారణంగా నేను ఒక అభిప్రాయానికి బానిస అవ్వదలుచుకోను.నా అభిప్రాయం మార్చుకోవడానికి సిగ్గు పడను.మార్పు ఒక ఆరొగ్య కరమైన అలవాటు అని నా అభిప్రాయం.ఈ అభిప్రాయం కూడా మారవచ్చు:-)

క్రిందటి టపాలో మన న్యాయ వ్యవస్థ పైన నా ఆక్రోషం వెలిబుచ్చాను.అయితే వచ్చిన కామెంట్లన్ని కూడా వేరే వేరే విషయాల పైన….నాకు అర్ధం అయ్యిపోయింది, నేను రాద్దామనుకున్నది నాకు తప్ప ఇంకెవరి అర్ధం కాలేదు అని:-)తప్పు మీది కాదు లెండి. ఈ సారి కొంచెం స్పష్ఠత కోసం ప్రయత్నిస్తాను.

మన న్యాయ వ్యవస్థ ముందు నుండీ ఇంతే…..ఒక రాజకీయ నాయకుడు లేక ఒక పై హోదాలో వున్న అధికారి పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా , వారు అరెస్ట్ అవ్వడం అరుదు.అయ్యినా బెయిలు మీద బయటకి రాకుండా వుండడం ఇంకా అరుదు.బెయిలు పైన బయటికి వచ్చినా తమ అధికారాన్ని, పలుకుబడిని దుర్వినియోగ పరచకుండా వుండడం ఇంకా ఇంకా అరుదు.అటువంటి వారి పైన కేసులు విచారణలు నత్త నడక నడుస్తాయి.వారి వలన సాక్ష్యాలు,విచారణ కూడా ప్రభావితం అవుతాయి.మరి కసబ్?కారాగారం లో వున్న ముద్దాయి.మన రక్షణ బలగాల సామర్ధ్యం అందరికి తెలిసినదే!ఎక్కువ కాలం కారాగారంలో వుంచలేమని మన ప్రభుత్వం చాటుకుంటుందా?ఇది విచారణ అలవాటుకి భిన్నంగా ఇంత ఆదరా బాదరా గా చెయ్యడం పైన్ నా అభిప్రాయం.

ఇక శిక్ష గురించి…. నా ముందటి టపాలో ఉరి శిక్ష కసబ్ చేసిన నేరం కి సరైనదా కాదా అన్నది చర్చించలేదు.నేను కేవలం అన్నది ఈ శిక్ష పడుతుందని నాకనిపిస్తుందని.దానిని సమర్ధించలేదు..అలాగె వ్యతిరేఖించలేదు.ఇప్పుడు నా అభిప్రాయం…అవును కసబ్ తనకి తాను గా ఒక తీవ్రవాది అయ్యాడు.తన అంగీకారం తోనె జిహాదిగా భారత్ లో అడుగు పెట్టాడు.చావుకి సిధ్ధ పడె ఇక్కడకి వచ్చాడు.పేదరికమా… ఆకలా… లేక మత మూఢత్వమా?మనకి తెలియదు.యువకుడు, పాపం ఏవొ బలీయమైన కారణాల వలన ఇలా చేసి వుండవచ్చు?ఒక అవకాశం ఇద్దాము.మారిపోయి సమాజానికి మంచి చేస్తాడు అనే వారు కూడా వున్నారు.అతడు మరీ మంచి చెడు తెలియని చిన్న పిల్ల వాడు కాదు.అతడు మారవచ్చు.ఇది ఎవరూ నిర్ధారణ గా చెప్పలెము. కాని ఆ మారణ కాండ చేసె ముందు మాదక ద్రవ్యాలు ఆ పది మంది(?) తీవ్రవాదులు తీసుకున్నారు.బహుశా తమకి నెప్పిని ఎక్కువ సేపు భరించగలిగి ఎదురు దాడి ఎక్కువ సేపు చెయ్యగలిగి వుండడానికి కావచ్చు.లేదా జాలి కనికరం లెకుండా అమాయకులని ఊచకోత పెట్టడానికి కావచ్చు.అంత మాత్రానా వారు మత్తు మందు ప్రభావం లో ఇది చేసారని సమర్ధించడం ….అనడానికి మాటలు రావడం లేదు.అసలే నా బ్లాగుని పిల్లలు పెద్దలు అందరు చదవాలని ఆకాంక్షిస్తున్నా!కాని ఇంకో వాదన వుంది.చావడానికి సిధ్ధ పడి వచ్చిన ఒక తీవ్రవాదిని మనం ఇంత ఖర్చు పెట్టి, ఇంత సమయం వెచ్చించి,ఇప్పుడు చంపడం లో కూడా వారిదే గెలుపు అవుతుంది అని.ఇలా ఉరి తీస్తారని భయపడి తీవ్రవాదులు మన దేశంలో అడుగు పెట్టడానికి సంకోచిస్తారా?లేదు.కాని ఒక ప్రతి దాడిలో ఒక తీవ్రవాదిని చంపడానికి, ఎంతో ఆలోచించి అతడికి ఉరి శిక్ష వేయడానికి చాలా తేడా వుంటుంది.సందర్భం వేడిలో ఆలోచితమో, అనాలోచితమో తెలీకుండా చంపడం వేరు.అతడికి తన వాదన వినిపించుకుని నిర్దోషిత్వం (?) నిరూపించుకునె అవకాశం ఇచ్చి అప్పుడు ఈ నిర్ణయానికి రావడం…తేడా లేదు?రెండిటిని ఒకే గాటిని కట్టడం సరి కాదు కదా?

మరి ఈ నిర్ణయం వలన కలిగే పరిణామాలు ఏమి కావచ్చు?కాందహార్ వంటి ఆకృత్యాలు ఆపగలిగే సత్తా లేనిదని మన దేశం పై ఒక గొప్ప అభిప్రాయం మన న్యాయ వ్యవస్థ ప్రపంచానికి తెలియబరుస్తుంది.అది కాకుండా శిక్ష విషయం లో పూర్తిగా కేసు పూర్వాపరాలు పై ఆధార పడకుండా మన ప్రభుత్వ రక్షణ దళాల సామర్ధ్యం వలన ప్రభావితం అయ్యిందని మన న్యాయ వ్యవస్థ పై కూడా ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది.ఒక వ్యక్తి పై ఇంత ఖర్చు పెట్టి విచారణ జరిపినందుకు…దౌత్యపరంగా గాని, దేశ భద్రతపరం గా గాని, రక్షణ పరం గా గాని మనకి కలిగిన లాభాలు ఏమిటి?బహుశా కొన్ని జరగ బొయె దాడులు కి సంబందించిన రహస్యాలు తెలిసి వుండవచ్చు..తెలిసి వుండక పోవచ్చు.అది పెద్ద విషయం కాదు.ఇలా పట్టుబడ్డ తీవ్రవాదులు పైన మనం ఆధార పడీతే మన నిఘా వర్గాలు ఏమి చేస్తాయి?భద్రత పరంగా…జరగబొయె ఎన్ని దాడులు గురించి కసబ్ కి తెలుసు?ఆ లాభం కూడా తాత్కాలికమే!దౌత్య పరంగా దీనిని ఉపయోగించుకునే తీరు పై ఆధార పడుతుంది.ఉమ్మడి ప్రకటనలో బెలూచిస్తాను వగైరాల పై విచారణ లో సహకరిస్తాము వంటి ప్రకటనల వలన దౌత్య పరం గా మనకి చాలా నష్టం జరిగింది.అంటె లేని విషయాల వలన కూడా ప్రపంచ దేశాలలొ ఒక అభిప్రాయం కలగ జేయడం వలన మన పొరుగు దేశం దౌత్య విజయం సాధించింది.అయినా ఈ విషయాల వలన తమ దౌత్య నీతి మార్చుకునేటంత వెర్రిబాగులవి కావు ప్రపంచ అగ్ర దేశాలు.అది నెమ్మది నెమ్మదిగా మారె విషయం.ఇలాంటి విషయాలని లౌక్యంగా వాడుకోవడం పై ఫలితం వుంటుంది.కాని కొంతమంది అభిప్రాయం మన ప్రభుత్వం చేసినది సరైనదేఅని.విచారణలో తేలిన అన్ని విషయాలు మీడియా తో పంచుకోరు కాబట్టి ఎంత లాభం జరిగిందో పూర్తిగా అంచనా వెయ్యలేమన్నది నిజం.పారదర్శికత ఇలాంటి విషయాలలో కుదరదు.కాని నా లాంటి అల్ప సంతోషుల కోసమైనా మనం బొలేడన్ని విషయాలు తెలుసుకున్నామని ఢాంభికాలు పోవచ్చు కదా!దాని వలన తీవ్రవాద సంస్థలు కొంచెం ఆచి తూచి అడుగు వేస్తాయి, చేయబోయె దాడుల విషయం లో మన భద్రతా దళాలుకి ఎంత సమాచారం వుందో అన్న భయం వలన!

ఇక సూటిగా నా అభిప్రాయం చెబుతాను.వ్యంగ్యంగా రాద్దామన్న ప్రయత్నం లో ఎవరికి నా అభిప్రాయాలు సరిగా చెప్ప లేక పోతున్నాను కామోసు.ఇంటి దొంగలు తప్పించుకు పోతున్నారన్నది నా భయం, బాధ.బహుశా కసబ్ కి తెలియక పోవచ్చు.వాడికి ప్రత్యక్షంగా కలిసినవాళ్లు, వారి పైన వున్న వాళ్లు…వారి పైన వున్న వాళ్లు ఇలా ఈ గొలుసు చుట్టు తప్పకుండా ఇంటి దొంగ వద్దకి తీసుకు వెళుతుంది.మ్యాపులు అందించిన ఇద్దరు భారతీయుల పైన, వారు ఇచ్చిన మ్యాపులు కంటె గూగుల్ వారి మ్యాపులు ఇంకా వివరణాత్మకంగా వున్నాయి కాబట్టి నిర్దోషులగా వదిలి వేసింది కోర్టు.వారు చేసిన పని ఎంత తోడ్పాటు అందించిందో వేరె విషయం.వారు తెలియక చేసారా, తెలిసి చేసారా అన్నది ముఖ్యం.తెలిసి చేసి వుంటె దేశ ద్రోహ ఉద్దేశ్యం వుంటె వారికి శిక్ష పడాలి.ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ, పోలిసు వర్గాలు, కోస్టు గార్డు జనరల్, వీళ్లందరి పైన కూడా కోర్టు క్రమశిక్షణ చర్యలకి ఆదేశించాలి అన్నది మంచి వాదన.దీని వలన కూడా ఇంటి దొంగ ని పట్టుకోవచ్చు.పక్క దేశం లో మన మీద విషం కక్కుతున్నది ఒక్క జైషె మొహమ్మదు ఒక్కటె కాదు.ఇప్పుడు పక్క దేశం పైన వత్తిడీ తెచ్చి ఒకడిని కటకటాల వెనకకి పంపినా ఇంకొకడు తప్పక తయారు అవుతాడు.కాబట్టి మన కంట్లో వున్న దూలాన్ని తీసుకుని తరువాత ఎదుటి వాడి కంట్లో నలుసు చూసుకోమందాము. ఉరి శిక్ష వెసినా వెయ్యక పోయినా, ఈ విచారణ ముఖ్య ఉద్దేశ్యం, మన దేశ రక్షణకి ఉపయోగపడాలి.అంతే గాని, ప్రజల భావొద్వేగాలని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం లో ఒక పావు గా మారి పోకూడదు. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా పరవాలేదు,వాడిని తప్పించే ప్రయత్నాలు విచ్చిన్నం చేసె సత్తా మన బలగాలకి వుంది అని నిరూపించుకుని, ఈ విచారణని క్షుణ్ణంగా చెయ్యాలి.ఈ ఖర్చు అంతా మనం పన్నులు ద్వారా కట్టిన సొమ్ము.దీనిని సక్రమంగా వాడుతున్నారని మనకి నమ్మకం కలగాలి.తీర్పు వలన మన దేశ ప్రతిష్ఠ , న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ఇనుమిడించాలి గాని,లోటు రాకూడదు.ఈ మాత్రం ఆశించడం కూడా అత్యాశేనా?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. ఆకాశరామన్న అంటున్నారు:

  @krishna

  చక్కగా విశ్లేశించారు. నేననుకోవడం కసబ్ ను ఇన్నిరోజులూ మేపిన దానికి తగిన ప్రతిఫలం మనకు ఇదివరకే వచ్చింది అని. కసబ్ మనకు చిక్కడం వలనే కదా మనదేశం పాకిస్తాను మీద దౌత్య యుద్దాన్ని చక్కగా చేయగలిగింది. కసబ్ విచారణ గురించి, అతని జాతీయత గురించిన వార్తలు అంతర్జాతీయ వార్తా పత్రికలలో కూడా ప్రముఖ స్థానాన్నే సంపాదించే వుంటాయి. ఇవన్నీ పాకిస్తాను మీద వత్తిడి పెంచేవి మరియు పాకిస్తాన్ను అప్రతిష్టపాలు చేసేవే కదా. కసబ్ ను అప్పుడే ఎంకౌంటరు చేసుంటే అమితంగా సంతోషించేది పాకిస్తానేనన్నది నిర్వివాదాంశం. కసబ్ అనే వాడు శత్రువులు మన మీదకి పంపిన పాము లాంటివాడు. కోరలు పీకిన తరువాత వాడ్ని చంపినా చంపక పోయినా పెద్ద తేడా లేదు. వాడ్ని చూపిస్తూ, వాడి జాతీయతను పదే పదే గుర్తుకు చేస్తూ పాకిస్తాన్ను ఎంత ఇబ్బంది పెట్టగలితే అంత ఇబ్బంది పెట్టాలన్నది నా అభిప్రాయం.

  • krishna అంటున్నారు:

   @ ఆకాశరామన్న గారు, మీ స్పందనకి కృతజ్ఞతలు. ఆ కోరలు పీకిన పాము వలన మనకు ఏమన్నా నష్ట పరిహారం జరిగితే మంచిదే! లేని పక్షం లో సరైన విధంగా దండించడంలో తప్పు లేదు.

 2. శ్రీవాసుకి అంటున్నారు:

  మీ గత టపా అర్థంకాకపోవడమేమి లేదు. కాని విచారణ అంతా పాక్ వైపు నుంచే జరిగింది. ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా వచ్చారన్నారు. కాని న్యాయస్థానం కోస్ట్ గార్డ్స్ ని ఈ విషయం మీద ప్రశ్నించలేదు. వారెందుకు ఆపలేకపోయారో వివరణ అడగలేదు. లోలోపల ఏమైనా అడిగారేమో అసలు విషయాలు బయటకు పొక్కట్లేదు కదా. గొప్ప నావికా బలముండి ఏమి చేయలేకపోయాము. ఈ దేశంలో వారికి ఎవరెలా సహకరించారు అన్నది కూడా విచారణ చేసారో లేదో. ఓ ఇద్దరిని మాత్రం నిర్దోషులుగా వదిలేసారు. కాని వారికి ఉగ్రవాదులతో మ్యాపులు ఇచ్చిన సంబంధం ఉన్నప్పుడు జైలులో పెట్టాలి కదా కాని ఆ పని మాత్రం జరగలేదు. ఏకకాలంలో వారి ఐదు చోట్ల దాడి చేసారు. మరి గూఢాచార విభాగం నిద్రపోతుందేమో. దేశం కోసం ప్రాణమిచ్చే సైన్యంలోనే కొన్ని కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. ముందు వారి పని పట్టాలి. అటు కాశ్మీర్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు. సియాచిన్ వంటి ఎత్తైన ప్రదేశాలలో సైన్యం ఉండి ఏమి చేస్తున్నట్టు. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఇక్కడ కూడా లోపాయికారిగా ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళున్నారు. న్యాయస్థానం ఆ వైపు నుంచి కూడా విచారణ చేపట్టాలి. ముందు ఇంటి దొంగను మనమే పట్టాలి ఈశ్వరుడు కాదు. ఒక్క ఉరి శిక్షకే ఉగ్రవాదులు భయపడిపోతారనుకోవడం అసంబద్ధం. చావుకి తెగించిన వాళ్ళు. కాకపోతే మన కోర్టుల జాప్యమా అని వారికి బ్రతుకు మీద ఆశ కలుగవచ్చు. కాకపోతే ఒకటి ఈదేశం మీదకి దండెత్తి వచ్చే వాళ్ళకి కుక్కచావు తప్పదని అర్థమయ్యేలా చేయాలి. మెతక దేశమన్న మాట ఉండకూడదు. రాజకీయాలు ఏవైనా ఉంటే ఆ తర్వాతే.

 3. శ్రీవాసుకి అంటున్నారు:

  నాదో సందేహం నా కామెంట్ మీ టపా పరంగా సరైనదేనా.

  • krishna అంటున్నారు:

   @ శ్రీ వాసుకి గారు, నేను క్రిందటి టపాలో పూర్తిగా మన న్యాయ వ్యవస్థ మీద ఆక్రోషం వెలి బుచ్చాను.సామాన్య ప్రజానికం లో దానికి వున్నత స్థానం వున్నా అదేమి మట్టి అంటని మాణిక్యం కాదు అని, దాని లో కూడా చీడ పురుగులు వున్నాయని, వాటి వలన కొన్ని అసంగతమైన తీర్పులు, సమాజం లో చెడూ ప్రభావం వుందని చెప్పాను. ఈ టపాలో కూడా మొదటి పేరా లో మళ్ళీ ఆ అభిప్రాయాన్ని కొంచెం స్పష్ఠంగా చెప్పడానికి ప్రయత్నించాను.
   నాకు అనిపించే మరొక విషయం ఏమిటంటె బహుశా ఉరి శిక్ష విధించినా దానిని అమలు చేయడానికి ఏళ్లూ పడుతుంటె చావుకి సిధ్ధపడి తీవ్ర వాదులైన వీరిలాంటి వారికి కూడా బతుకు మీద ఆశ పుడుతుంది కదా!ఎదుటి వారి ప్రాణాలని లెక్క చేయకుండా కల్లోలం సృష్టించిన వీళ్లు తమ ఆఖరి ఘడియలలో అన్నా ప్రాణం విలువ తెలుసుకుంటారేమో అన్నది లోపాయికారీ ఉద్దేశ్యం కాదు కదా!

 4. SansNom అంటున్నారు:

  కసబ్ ని మానవతావాదంతో వదిలేయాలి. మరణ శిక్ష అనాగరికం, రద్దు చేయాలి.
  కాబట్టి , వాడి అవయవాల్లో ట్రాన్స్ ప్లాంట్ చేయగలిగిన అవయవాలను (రెండు రెటీనాలతో సహా) తీసేసుకుని, ఒక మోకాలు, ఒక మోచేయి 26/11 కి గుర్తుగా వుంచుకుని వాణ్ణి పాకిస్థాన్ కి అప్పగించేయాలి. నిశాన్-ఎ-పాకిస్థాన్ హోదాలో శేష జీవితాన్ని పాకిస్థాన్ ప్రభుత్వ ఖర్చు మీద బ్రతికేస్తాడు, మన ఖర్చుతో కాకుండా. ఏమంటారు?
  మరణ శిక్షకు నేను వ్యతిరేకం, ఏమంటారు?

 5. dharanija అంటున్నారు:

  chalaa correct gaa cheppaaru

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s