మనకెందుకింత తొందర?(regarding our judiciary and ajmal kasab)

Posted: మే 6, 2010 in రాజకీయం, వ్యంగ్యం

మన దేశ చరిత్ర లోనె అత్యంత వేగవంతంగా విచారణ జరుపుకున్న చారిత్రకమైన కేసుగా అందరు ముంబయి దాడుల పైన ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ కోర్టు వారి విచారణని అనుకుంటున్నారు.గొప్ప విషయమే!ప్రజల మనొభావాలకి , దేశ భక్తి తదితర ఉగ్వేదాలకి బాగా సంబంధించిన విషయం కదా!అందుకేనా మన ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని త్వరితగతిన ఈ కేసు ఒక కొలుక్కి వచ్చినట్టు చేసింది? లేక పక్క దేశానికి ఒక ఉదాహరణగా ఈ కేసుని చూపించి వారి వైపు నుండీ కూడా ఇలాంటి ఫలితాన్నె ఆశించి ఇలా చేసిందా?అదే కనుక అసలు ఉద్దేశ్యం అయితే మనం (ప్రజలు అని అర్ధం, ఈ పాడు రాజకీయ పార్టీలో, పనికి మాలిన ప్రభుత్వాల గురించి కాదు అంటుంది. )మెచ్చుకోతగ్గ ఫలితాలు అందవు.ఎందుకో కొంచెం వివరంగా చెబుతా! అసలు మనకి అలవాటు లేని పని చేస్తె ఫలితాలు ఎలా వుంటాయి?పులి ని చూసి నక్క వాతలు పెట్టుకుంటె ఎలా వుంటుంది? లతా మంగేష్కర్ బ్రేక్ డాన్స్, ప్రభు దేవా గానాలాపన చేస్తె ఎలా వుంటుంది?మన దేశ న్యాయ వ్యవస్థకి అలవాటు లేని విధంగా ఇలా తొందర తొందరగా కంగారుగా , నిఝంగానె వేగవంతంగా పూర్తి చేద్దామనుకున్న ఈ కేసు వలన మనం నేర్చుకోవలసిన గుణపాఠాలు నేర్చుకోగలిగామా? పోని తొందరగా పూర్తి చేద్దామనుకున్నప్పుడూ పధ్ధతి ఏమిటి? ముఖ్యమైన విషయాల పైనే పూర్తి శ్రధ్ధ పెట్టడమా?లేక అన్ని విషయాలని పై పైన చూసి ఒక నిర్ణయానికి రావడమా?అజ్మల్ కసాబ్ పైన పెట్టిన ఆరోపణలు ఎన్నో తెలుసాండీ?ఎనభై మూడు! అవును అక్షరాలా ఎనభై మూడు!! చాలా తక్కువ కదూ!అందుకే వాడు వాడికి వాడే విసుగుతో ఉరి వేసుకు చావక ముందే తీర్పు వచ్చింది.శిక్ష ఇంకా తేల్చవలిసి వుంది.అది కూడా తొందరగానే వచ్చేస్తుందట!అసలు అన్ని ఆరోపణలు కాకుండా ధృఢంగా ఒకటి రెండు ఆరోపణలు చాలవా?అందరి కళ్లెదుట జరిగినదానిని కూడా నిరూపించలేమని భయమా పబ్లిక్ ప్రాసిక్యూసిన్ వారికి?

ఎలాగు వాడు ఈ తీర్పు పైన హై కోర్టుకి, అక్కడ కూడా తీర్పు బాగోక పోతె సుప్రీము కోర్టుకి ,ఒక వేళ అక్కడ కూడా వాడికి నచ్చని విధంగా తీర్పు వస్తె రాష్ట్రపతి క్షమాభిక్షకి ప్రయత్నిస్తాడు కదా!(క్షమా భిక్ష అని అన్నానంటె వాడికి ఏ శిక్ష పడుతుందనుకుంటున్నానొ అర్ధం అయ్యింది కదా!)ఎలాగు ఇవన్ని పూర్తి అయ్యెటప్పటికి పుణ్యకాలం కాస్త తీరి పోతుంది. వాడిని చంపేద్దామా వద్దా అని మన వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చెలోపు వాడే చచ్చి ఊరుకుంటాడు.కాబట్టి అప్పటికల్లా చాలా సమయం వుంది కాబట్టి, తాము తరచి చూసినా ఈ అధారాలు, సాక్ష్యాలు గట్రా పైవాళ్లు ఎలాగు చూస్తారనుకుని ఇప్పుడు అలా పై పైన చూసి ఊరుకోలేదు కదా!ఛా నాకు తెలుసు లెండి.మన ప్రజాస్వామ్యానికి నాలుగు స్థంభాలలో ముఖ్యమైన న్యాయ వ్యవస్థ ఇంకా అంత భ్రష్టు పట్టి పోలెదు, నేను ఒప్పుకుంటాను.ఇదంతా పని ఒత్తిడే కావచ్చు.ఆ…… అక్కడ కొంతమంది లంచగొండి న్యాయమూర్తులు వుండవచ్చు గాని మొత్తం వ్యవస్థగా చూస్తె,మిగిలిన వాటికి కంటె చాలా బెటరు.అంతే కదా!ఏ మొక్క లేనప్పుడు, కొత్తిమీర మొక్కే మహా వృక్షం.కాబట్టి న్యాయ వ్యవస్థ తప్పు లేదు అని రూఢిగా(?) చెప్పవచ్చు!

అసలు వీడిని ప్రాణాలతో పట్టుకుని మనవాళ్లు సాధించిన గొప్ప ఏంటో తెలియదు. మహా అయితే వాడి జాతీయత ప్రపంచానికి నిరూపించగలిగాము!వాడి మీద పెట్టిన ఖర్చుకి గిట్టుబాటు అయినట్టెనా?లేక అప్పుడే లేపేసి వుండాల్సిందా?ఏవొ కొంత మంది పేర్లు చెప్పాడు అని అంటున్నారు.కాని వాటి వలన మనం సాధించిన దౌత్య విజయాలు(?) ఏమిటి? ఈ ఇజ్రాయిలు, అమెరికాలు ఆ మాత్రం సాక్ష్యాలు లేక పోయినా మనని సమర్ధించేవి!ఈ చైనా వగైరాలు అవి వున్నా మనని వ్యతిరేకించేవి!మరి లాభం!ఈ విషయంలో నిజానిజాలు ఏమైనా సామాన్యుడిని వంచించె వ్యవస్థలు, ప్రభుత్వాలు వున్నంత వరకు,మనకి మిగిలేవి ఈ ఊహాగానాలే!వీటి అన్నిటికంటె నాకు అనిపించే అతి పెద్ద అనుమానం ఏమిటంటె, అసలు ఇంటిదొంగని (ఏదొ పెద్ద చేపే అయ్యుంటాది) వదిలేసె ప్రయత్నం కాదు కదా!ఇలాంటి ఆదరాబాదరా విచారణే పక్క దేశస్థులు కూడా చెయ్యాలనా మనం కోరుకోవాలి?చిన్న చేపలు మాత్రమేనా మనం పట్టుకోవలిసింది?పెద్ద చేపలు అసలు లేనె లేవా?వాడిని సులభంగా చంపేసె కంటె చావు అంటే భయం కలిపించి, వాడితో రాబట్టగలవలసినంతా రాబట్టి అప్పుడూ ఏమన్నా చేస్తె మంచిది అనుకుంటాను.

అసలు తొందరగా తీర్పు రావలిసిన కేసుల విషయంలో ఎక్కడ లేని జాప్యం చేస్తారు.ఏ మాజీ ప్రధాని మీదో,మాజి ప్రధాని కొడుకో మీదొ ఆయన చచ్చేటంతవరకు, తీర్పు రాదు.అది ఎంత అకస్మాత్తు మరణమైనా కానివ్వండి,ఎంత హృదయవిదారకమిన మరణమైనా కానివ్వండి, అతడిని దోషా, కాదా అన్నది తెలియబర్చవచ్చు కదా!తమ అధికార బలం తో తమ మీద కేసు పెట్టిన వాళ్లని చిత్రహింస పెట్టి, వారి చావుకి కారణమైనా వారిని,ముదు ముసలి కాలం వచ్చెటంత వరకు, కేసు నాన్చుతారు, అంతెగాని, మన కస్టడిలో వున్న వాడి పై ఆదరా బాదరాగా కేసు పూర్తి చేస్తారు.అసలు విషయం ఏదన్నా వుంటె అది బయటికి రాకూడదని అంతె తొందరగా మఠాష్ చేసినా ఆశ్చర్య పోనక్కరలేదు.నిఝం ఎప్పటికి ఇక బయటికి రాదు కదా!సంతోషించవలసిన విషయమే!మీ ఉద్దేశ్యం?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. శ్రీవాసుకి అంటున్నారు:

  ఆ కసబ్ గాడికి జైల్లో మహారాజ పోషణ జరిగింది. చికెన్ బిర్యానిలు పెట్టి కొత్త అల్లుడిలా చూసుకొన్నారు. పై కోర్టులకి కూడా అప్పీలు చేసుకొనే సౌలభ్యం వాడికుంటే మిగిలిన తంతు మీరు చెప్పినట్టే జరుగుతుంది. అంతమందిని చంపిన పశ్చాత్తాపం వాడికుందో లేదో మరి. ఆరోజే కాల్చి పారేయాల్సింది. ఎన్ని సాక్ష్యాలు పాక్ కి ఇచ్చిన వాళ్ళు లక్ష్య పెట్టరు. అమెరికా అయినా అంతే తన స్వార్ధమే తప్ప ఇంకోటి పట్టదు. ఇక ఇందులో ఉన్న పెద్ద తలకాయలు. వారి ఆసరా లేకుండా ఇలాంటివి జరుగుతాయా. చనిపోయినవారు ఎలాగు తిరిగిరారు. ఎవరు,ఎందుకు చేయిస్తున్నారో తెలుసున్నప్పుడు వీడ్ని ముప్పొద్దుల మేపడం అనవసరం. చేతనైతే అమెరికా తరహాలో ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయగలగాలి. సాక్ష్యాలు సమర్పించినంత మాత్రాన పాక్ ఏమి తక్షణ చర్యలు తీసుకోదు.

 2. హరి దోర్నాల అంటున్నారు:

  పెద్ద చేపల గురించి కసబ్ కేం తెలుసండి. ఆ చిట్టా తెలిసిన వాడు కరాచిలో విందులు చేసు కుంటున్నాడు. బయట పడేంత వరకు వాళ్ళ కాళ్ళకు మనం ఇక్కడ మొక్కుతూనే ఉంటాం.

 3. prasanth అంటున్నారు:

  నా మటుక్కు నాకు మన ప్రభుత్వం చేసింది సరైనదే అని అనిపిస్తోంది. మనం వాడు దొరికిన రోజునే ఆటవిక న్యాయం స్టైల్లో కాల్చి పారేసి వుంటే, మనకు మనం ద్వేషించే పక్క దేశాలకీ తేడా లేకుండా పోతుంది. మన బలం అంతా మన సహనంలోనే వుంది అనేది నా అభిప్రాయం. డిప్లొమాటిక్ గా చూస్తే ఇది ఖచ్చితంగా మన విజయమే. వాడు విచారణలో ఎం చెప్పాడో మనకేవారికి తెలియదు, అది ఎలాగు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి అందరివి వూహాగానాలే. ఇలాంటి న్యూస్ విన్నప్పుడు పెల్లుభికే భావోద్వేగాలుఖచ్చితంగా తప్పు అని నేను అనను. కాని ఇలాంటి సమయంలోనే మనం కాస్త సంయమనంతో వుండాలి అంటాను. వాడికి వేసిన శిక్ష ఖచితంగా సరైనదే. అది ఖచ్చితంగా అమలు జరిగి తీరాల్సిందే.

 4. sowmya అంటున్నారు:

  అసలు తీర్పు గురించి ఇంత ఆలోచించడమేమిటి, అప్పుడే చంపిపారేయక. వాడేలాగూ రహస్యాలు చెప్పడు. ఒకవేళ చెప్పినా మనవాళ్ళు పెద్దగా అడ్డుకునేదేమీ లేదు.

  ఈ కేసుని శ్రీకాకుళం వాళ్ళకి అప్పజెప్పాల్సింది. ఏ బాధా ఉందదు, ఒక్క కథతో చంపిపారేస్తారు.

  • saamaanyudu అంటున్నారు:

   @saumya గారు యిక్కడ శ్రీకాకుళం వాళ్ళ కథల ప్రస్తావన ఎందుకు తెచ్చారు? మిగిలిన ప్రాంతాల వారికంటే వారు రాసిన కథలు ఏమీ తీసిపోవే? మరి ఈ వెటకారమె౦దుకు? రాష్ట్రంలో ఎక్కడా లేని కథానిలయం రేకాకుల౦ లోనే వు౦ద౦డీ. కారా మాస్టారి కథలు చదివారా? భూషణం మాస్టారి కథలు చదివారా? యింకా చాలా మ౦ది వున్నారు. ఎవరి మా౦డలిక౦ వాళ్లకి గొప్ప. అదే జీవ భాష.

   • krishna అంటున్నారు:

    @ సౌమ్య గారు…చంపెస్తే ఏమి ప్రయోజనం? నిజాలు బయటకి రావాలి.నా లాంటి వాళ్లు కధలు చెబితే ఏమన్నా నిజాలు కక్కుతాడంటారా?
    @ సామాన్యుడు గారు..కధా నిలయం మీకు కూడా తెలుసా అండి. కధా అభిమానులు తప్పకుండా వెళ్లవలిసిన స్థలం. వివాహ భొజనంబు బ్లాగులో నేను పెట్టిన వాఖ్యకి ఆవిడ ఇచ్చిన సరదా సమాధానం లెండి పైన వాఖ్య.ఆ ప్రాంతం పై కాక సదరు వ్యక్తి పైన అభిమానం తో అన్నట్టు వున్నారు:-)

 5. sowmya అంటున్నారు:

  @కృష్ణగారూ ఇదే అంశంపై ఇంకో మంచి పొస్ట్ వచ్చింది, ఇక్కడ చూడండి.

  http://jokabhiramayanam.blogspot.com/

 6. krishna అంటున్నారు:

  శ్రీ వాసుకి గారు, హరి దోర్నాల గారు, ప్రశాంత్ గారు, సౌమ్య గారు మరియు సామాన్యుడు గారు మీ స్పందనకి కృతజ్ఞతలు.
  వందల మంది కళ్ల ముందు జరిగిన దానిని నిరూపించడానికి మనకి పద్ధెనిమిది నెలలు పట్టిందే అన్నది నా బాధ! సరె ఇంత సమయం తీసుకున్నారు కదా, ఈ విచారణ వలన మనం లాభపడింది ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.లోపలివారి సహాయమే లేకుండా ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగి వుండదు కదా!మరి వారి సంగతి ఏమిటి? వాడికి ఏమి తెలియదు అనుకోవడం ఎంత వరకు కరెక్ట్? మన చేతగానితనం కాదా ఇది?ఒక రాణా, ఒక హెడ్లీలని పట్టుకుని ఎన్ని నిజాలు బయట పెడతారు అమెరికా వారు? అవసరమైన కేసులలో జాప్యం చేసె మన కోర్టులు మన కస్టడిలో వున్న వాడి పైనె ఇంత ఆదరాబాదరా గా చాప చుట్టడం అనుమానంగా లేదు!మన జైళ్ల మీద వున్న నమ్మకమా ఇది?ఇంత కంటె అప్పుడే వాడిని ఆటవికంగా చంపెసినా ఏ బాధ వుండదు.మన చెతిలో వున్న వాడి నుండి కూడా అవసరమైన నిజాలు బయట పెట్టలేమా మనం?ఇదే నా ఉక్రోషం.

 7. bondalapati అంటున్నారు:

  గతంలో మౌలానా మసూద్ అనే భారతీయ జైల్లో ఉన్న తీవ్రవాదినికి పాక్ తీవ్ర వాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి విడిపించారు.కొంత మంది ఇప్పుడు కూడా అలా జరుగుతుందేమో, కసబ్ కి మర్ణ శిక్ష త్వరగా మమలు చెయ్యండి అంటున్నారు.
  కానీ కసబ్ విషయం లో అలా జరగక పోవచ్చు. అజాద్ ఒక నాయకుడు. కసబ్ ఒక ఫుట్ సోల్జర్ మాత్రమే. ఇతనిని విడిపిచటానికి అంత పెద్ద ప్లాన్ వేయక పోవచ్చును. ఏదేమైనా ఇక కసబ్ నుంచీ బయటికి వచ్చేదేమీ లేక పోతే త్వరగా అతనికి ఉరి అమలు చేయటం మంచిది. సౌమ్య గారిచ్చిన లింకు లోని అభిప్రాయం తో నేను ఏకీభవించలేక పోతున్నా. కసబ్ కి శిక్ష వేయకుండా వదిలెయ్యటం, లేక తక్కువ శిక్ష వెయ్యటం కూడా టెర్రరిజాన్ని జస్టిఫై చేస్తుంది. అది కూడా తీవ్రవాదులకి ఒక మోరల్ విక్టరీ. అతని చేత తీవ్రవాద సిధ్ధాంతాలకు వ్యతిరేకం గా స్టేట్మెంట్లు ఇప్పించినా వాటిని బలవంతం గా ఇప్పించినవి గానే లోకం చూస్తుంది. కసబ్ దగ్గర ఇండియా లోని పెద్ద చేపల గురించిన సమాచారం ఉండకపోవచ్చు. పెద్ద చేపలు ఆ జాగ్రత్త తీసుకొంటాయి. పైగా అతని దగ్గర సమాచారం ఉన్నా అది పెద్ద చేపలకు వ్యతిరేకం గా సాక్ష్యం గా పనికి వచ్చే స్థాయి లో ఉందక పోవచ్చు. పాకిస్తాను లోని పెద్ద చేపలను మనం ఎటుతిరిగీ చేరలేము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s