ఈ టపా పెద్దలకి మాత్రమే!

Posted: మే 1, 2010 in అఙ్నానం

శీర్షిక చూసి కూడా టపా చదువుతున్నవాళ్లకి చిన్న వివరణ: పెద్దలు అంటె పెద్ద మనసు చేసుకుని ఎదుటి వారి కోణంలో కూడా ఆలోచించేవారికి అని, అంతే గాని స్త్రీ పురుష జాతులలో ఏదొ ఒక దాని పైనే అవాజ్య అనురాగమో అంతులేని ద్వేషమొ వున్న వాళ్లకి కాదు అని మనవి.ఇప్పుడు ముట్టుకుంటెనే తగలబడిపోయెంత వేడి వాడి విషయం నళినీ జమీలా గారి ఆత్మ కధ. అయితే ఆ విషయం వ్యభిచారం పైనో స్త్రీ పురుష హక్కుల పైనొ చర్చలా రూపాంతరం చెంది అందరి నోట్లో నానుతుంది.అయితే చర్చ పక్క దారులు పట్టడమో (వ్యభిచారమొ లేక వేశ్యా వ్యవస్థనొ అది అసలు వృతా కాదా అని చర్చించడం)లేక పోతె వ్యక్తి దూషణలకి కారణం అవ్వడం (అది కూడా అందరి మన్ననలు పొందిన ప్రముఖ బ్లాగర్ల నుండి కావడం ) మరీ విచారకరం. ఒక్కోసారి కామెంట్ల రూపం లో చర్చించేటప్పుడు వెంట వెంటనె జవాబులు ఇచ్చె తొందరలో మనం ఎంచుకునే పదాలు మన అసలు భావాలని వ్యక్తీకరించక ఒక్కొచొట అనుకున్న దానికి విపరీత అర్ధాలకిదారి తియ్యవచ్చు.అందుకే ఈ విషయం పైన నా ఆలోచనలు వ్యాఖ్యల రూపం లో చెప్పేకంటె ఒక టపా రూపంలో రాయడమే మంచిది అనిపించింది.

అసలు వేశ్యావృత్తి (దయ చేసి వృత్తి అవునో కాదొ అన్న విషయం పక్కన పెడదాము.) మన సమాజంలో ఏ కారణం చేత చోటు చేసుకుంది?నాగరికత ప్రబలని కాలంలో అంటె ప్రస్తుత వివాహ వ్యవస్థ రూపుదిద్దుకోక ముందు నుండి అయితే వుండి వుండక పోవచ్చు.మనిషి నాగరికత ముసుగులో తనకి తాను ఏర్పరుచుకున్న కొన్ని నియమ నిబందనల కారణంగా ఇప్పుడు వున్న వివాహ వ్యవస్థ రూపు దిద్దుకుంది అన్నది నిర్వివాద విషయం.కాని దానికి ముందు మనిషి (ఆడ మగ ఇద్దరున్నూ, ఇక మీదట మానవుడు అంటాను లెండి మీకు మనిషి అన్న మాట కేవలం పురుషుడికి మాత్రమే చెందిన పదం అని అనిపిస్తే:-)) కొన్ని జంతు జాలంలో వున్నట్టు సమూహాలలో స్త్రీ పురుషులు అందరు ఎవరి తో ఎవరన్నా జత కట్టినట్టు వుండే వారా? లేక సమూహంలో వున్నా కూడా ఒక వ్యక్తి తోనె జంట కట్టేవారా అన్నది తెలీదు.ఒక్కొక్కరు ఒక్కో సిధ్ధాంతం లేవదీసినా అసలు విషయం మనం కేవలం ఊహించగలమే గాని నిరూపించలేము.పురాతన కాలంలో మానవుడు వంట పాత్రలకి ఏ పదార్ధం వాడేవాడు , ఒళ్లు కప్పుకునేటందుకు ఏమి వాడే వాడు అన్నది ఆధారాలు కనిపెట్టవచ్చు గాని, తన జతగాడు/జతగత్తె విషయంలో అతడి అభిప్రాయాలు ఎలా తెలుస్తాయి?సహజం గానె బలవంతుడైన మగవాడి పై ఆహార సముపార్జనకై స్త్రీ ఆధార పడి వుండవచ్చు. ఆటవిక న్యాయం లో బలవంతుడిదే రాజ్యం.మిగిలిన జంతుజాలంలో కూడా ఆహార సముపార్జన లేక రక్షణ భాధ్యత మగ జాతిదే కదా!శ్రమ తో కూడిన పని బలశాలి చెయ్యడమే సబబు కూడా.కొని జంతువులలో తేడా వుండవచ్చు. కుటుంబ వ్యవస్థ, ఆస్తులు తన సంతానాన్ని దాటిపోకుడదనో, ఒక స్త్రీ కొరకు ఇద్దరు పురుషులు గొడవ పడడం ఎందుకనుకునో ఒక స్త్రీ కి జీవితం లో ఒకడే పురుషుడు మాత్రమే వుండాలని నియమాలు ఏర్పడి వుండవచ్చు.మన చరిత్రలో కూడా బహు భార్యత్వం వున్నంత ప్రబలంగా బహు భర్తృత్వం లేదు.మన పురాణాలలో వున్న బహు భర్తృత్వ ఉదాహరణలు కూడా చాలా తక్కువ.భారత సమాజంలో ప్రాచుర్యం లో వున్న పురాణాలలో కూడా ఈ విషయం లో మనకి ఒక అవగాహనకి రావడం కష్టం.బహు భార్యత్వం చెందిన కాలం తరువాత బహు భర్తృత్వం కూడా కనిపిస్తుంది.కాబట్టి ఏది ముందు ఏది తరువాత అన్నది ఊహించలేము.ఏక పత్ని వ్రతాన్ని భోదించిన తరువాత బహు భార్యత్వం కూడా కనిపిస్తుంది.కాబట్టి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వుంటేనె మంచిది, మరింత గజిబిజి అవ్వకుండా వుండడానికి.

నాకు అనిపించేది ఏమిటంటె ఆలోచించె శక్తి వున్న మానవుడు బలశాలులు బలహీనులని అణగదొక్కి తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించకుండా వుండడానికి కొన్ని నియమాలు నిర్దేశించుకున్నాడు.పోషణ భారం పురుషుడిది, పిల్లలని సాకే భాధ్యత స్త్రీ కి పంచుకున్నారు.అందరికి ఆమోద యోగ్యమైన నియమాలు ఎప్పుడూ ఏర్పడలేదు.వివాహ చట్రం లో వున్న కొన్ని లోపాలు వలన ఈ వేశ్యా వ్యవస్థ రూపు దిద్దుకుంది.వివాహ వ్యవస్థలో కేవలం పురుషులు మాత్రమే అసంతృప్తులు అనుకోవడానికి వీలు లేదు.మరి స్త్రీ కి ఇటువంటి వివాహానికి వెలుపల ప్రత్యమ్నాయ అవకాశం ఎందుకు ఏర్పడలేదు? ఒకటి: పురుషుల స్త్రీల శరీర ధర్మాలు వేరు.దాత గ్రహీతలుగా వేరు వేరు లక్షణాలు వున్న స్త్రీ పురుషుల తేడాల వలన బహుశా అటువంటి అవకాశం ఏర్పడలేదు అనుకోవచ్చు. రెండు: శీలానికి కలిపించిన పవిత్రత వలన.కోల్పోవడానికి అది భౌతిక అంగమూ కాదూ, కోల్పోయినంత మాత్రాన కొట్టొచ్చినట్టు కనిపించే విషయమూ కాదు.ముందు గానే వివాహ బంధం లో వున్న స్త్రీ కి వివాహేతర ప్రత్యమ్నాయ అవకాశం వలన కొత్తగా పోయె కన్యత్వం ఏమి లేదు.కాని జంటలో బయటి వ్యక్తి తో కలవడం వలన కలిగే అక్రమ సంతానం పురుషుడు మెడకి చుట్టుకుపోక పోయినా స్త్రీ కి అలా కుదరదు.అది కాకుండా ముందుగానె ఒక బంధంలో వున్న జంటలో పురుషుడు తనది కాని సంతానాన్ని పోషించేటంత ఉదారత చూపించాలనుకుని వుండడు. దీనిని బట్టి బలవంతుడు అయినా పురుషుడు తన సౌకర్యార్ధం కలిపించినది గాను,సమాజం లో అసంతృప్త వివాహితులు, అవివాహితుల వలన అసాంఘిక పరిస్థితులు తలెత్తకుండా ఒక సేఫ్టీ వాల్వ్ లా ఇది ఏర్పడింది అనుకోవచ్చు.

అయితే ఇది పూర్తిగా పురుషుని స్వార్ధమేనా? స్త్రీ పురుషులు సమానమని భావించే పాశ్చాత్య దేశాలలో, విచ్చల విడి శారీరక సంబందాలు వున్న సమాజాలలో, శారీరక శీలాని కంటె మానసిక స్వచ్చతకి, నిజాయితీ కి విలువ వున్న చోట కూడా ఈ వ్యవస్థ అమలు లో వుంది. ప్రతి సమాజం కి మరో సమాజం కి నీతులు, నియమాలు, మంచి చెడులు వేరుగా వున్నా మౌలికంగా మానవుని స్వభావం ఒకటె!మరి అటువంటి సమాజం లో నళినీ జమాలిని తప్పు దోవ పట్టించే కుహనా స్త్రీ వాద సంఘాలు లేవు.హెచ్చు మోతాదులో పురుషుని జులుం లేదు.స్త్రీ కి తనకి కావాలసినది తెలుసు.అయినా ఈ పరిస్థితి వుంది.సులభ పధ్ధతిలో సంపాదన పై అందరికి ఇష్టం వున్నా దొంగతనం లాంటి సంఘ వ్యతిరెక పనులు అందరు చెయ్యరు కదా.కేవలం సమాజం నియమాలు మారినంత మాత్రాన, చట్ట వ్యతిరేకం కాకపోయినా అది గౌరవ పదమైన విషయం అయితే కాదు కదా!మరి ఎందుకు సొంతంగా కొందరు ఇలాంటి పనులు చేస్తారు? తప్పు దారిలో నడిచే వారు ఎప్పుడు వుంటారు.ఇది తప్పు అని ఒప్పుకుంటే దీనిని రూపు మాపడం అంత కష్టమా?సులభంగా శారీరక సుఖం దొరికే చోట కూడా ఆత్మ న్యూనత వున్న వారు, వివాహం వ్యర్ధం అయిన వారు(భార్యా మరణం వగైరా) డబ్బులు ఇచ్చి దీనిని పొందుతారు.మరి ఈ వ్యవస్థ రూపు మాపేస్తే?ఈ వృత్తిలో వున్న వారికి వేరె జీవనోపాధి ఇవ్వడం వలన వేశ్యా వ్యవస్థ రూపు మాసిపోతుందా?శారీరక అవసరాలు అందరికి తీరినప్పుడే ఈ వ్యవస్థ అవసరం వుండదు.అలా అవ్వాలంటె మనిషి తిరిగి జంతు ప్రవుత్తి అలవరుచుకోవాలేమొ?ఈ వ్యవస్థ అవసరం లేక పోయిన ఇలా సులభంగా డబ్బు సంపాదించుకుందామనుకున్న వారు, స్త్రీ పురుషులు ఎవరైనా మరో సులభ పధ్ధతి అనుసరిస్తారేమో కాని కష్టపడి జీవితం సాగించరేమొ?ఇక ఈ రొంపిలోకి బలవంతంగా లాగబడిన వారికి,పరిస్థితులు బలవంతం చేసి ఇలా జీవనం సాగించడానికి తప్పని వారికి ఇది చట్ట బధ్ధం చెయ్యడం వలన లేక మరొ జీవనోపాధి కలిపించడం వలన సహాయ పడవచ్చు.ఈ విషయంలో నిర్మాణాత్మక చర్చ అవసరం.

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. శర్మ అంటున్నారు:

  వేశ్యావృత్తి ప్రాచీన కాలంలో ఉన్నంతమాత్రాన ఇప్పుడు కూడా వేశ్యావృత్తికి లైసెన్సులు ఇవ్వాలనడం అహేతుకం. ప్రాచీన ఈజిప్షియన్ సమాజంలో తల్లికొడుకులు పెళ్ళి చేసుకునే ఆచారం కూడా ఉండేది. ఇప్పుడు అలాంటి పెళ్ళిళ్ళని సమర్థిస్తే పట్టుకుని తంతారు. ప్రాచీనత పేరుతో వేశ్యావృత్తిని మాత్రం ఎందుకు చట్టబద్ధం చెయ్యాలి? వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే ఇన్సెస్ట్ ని కూడా చట్టబద్ధం చెయ్యాల్సి వస్తుంది.

  • krishna అంటున్నారు:

   అయ్యా నా వుద్దేశ్యం వేశ్యావృత్తిని చట్టబధ్ధం చేస్తె దొంగచాటుగా జరుగుతున్నది బహిరంగంగా జరుగుతుంది.అప్పుడు ఆ రొంపిలోకి బలవంతంగా లాగబడ్డవారికి స్వేచ్చ కలిపించవచ్చు అని.చట్టబధ్ధం కాకపోయినా దొంగచాటుగా చేస్తున్న వాళ్లని ఆపే దిక్కు లేదు.పోలిసులకి లంచాలు ఇచ్చే బాధ తప్పుతుందన్నప్పుడు ఇష్టాపూర్వకంగా ఆ వృత్తిలో కొనసాగుదామనుకున్నవారు కొనసాగుతారు.వారికి ఏమన్న కౌన్సిలింగ్ ఇచ్చి ఆ దారి నుండి బయటికి తీసుకు రావచ్చు. ఆ భాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.లేక పోతే నళినీ జమాలికి బ్రెయిన్ వాష్ చేసినట్టె ఈ స్వచ్చంధ సంస్థలు మరింత మందిని చెడగొట్టడం ఖాయం!

   • శర్మ అంటున్నారు:

    దొంగచాటుగా ఇన్సెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగని ఇన్సెస్ట్ ని చట్టబద్ధం చేసి అది బహిరంగంగా జరిగేలా చెయ్యలేము. వ్యభిచారాన్ని మాత్రమే ఎందుకు చట్టబద్ధం చెయ్యాలంటున్నారు? ఇన్సెస్ట్ పై ఉన్నంత వ్యతిరేకత వ్యభిచారంపై లేదనా?

   • krishna అంటున్నారు:

    ఇన్‌సెస్ట్ చేసెవారు, అది నచ్చి చేస్తారు.అది వారి బలహీనత! ఇందులో అమాయకులని కూడా బలవంతంగా రొంపిలోకి లాగుతారు.ఇష్టపడి గడ్డి తినేవాళ్ల గురించి కాదు నేను అంటుంది, బలవంతంగా రొంపిలోకి లాగబడ్డవారికి విముక్తి దొరుకుతుందని!ఇక నచ్చి చేసెవారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు.అప్పటికి మారని వారు ఇక ఎప్పటికి మారరు కదా! వ్యభిచారం చట్టబద్దం కాకపోయినా అయ్యినా వారు అలాగే వుంటారు కదా!

 2. saamaanyudu అంటున్నారు:

  మీ ఆవేదన అర్థమయ్యింది. ఇది సమాజంలో ఒక రాచపు౦డులా వె౦టాడుతూనే వుంది. పూర్వకాలం ను౦డే వున్నా ఇది పురుషాహంకారానికి గుర్తుగానే కొనసాగుతో౦ది. వీటిని కొన్ని కులాలకు పరిమితంగా జరిగేది. నాగరికత పెరిగినకొద్దీ ఇది విష్ఱు౦ఖల రూపం తీసుకు౦ది. ఎంతో మ౦ది అమాయకులు బలి అవుతున్నారు. ఈ రొంపి లో౦చి బయటపడే మార్గం లేక పడినా సమాజం చూసే చిన్న చూపు వలన మరల అదే వృత్తిలో మగ్గిపోతున్నారు. ఇది మాములుగా పరిష్కారం జరిగేది కాదు. ప్రస్తుతం టూరిజం అభివృద్ధి పేరుతొ ఇది మరి౦తగా వేళ్ళును కు౦టో౦ది. ప్రభుత్వమే ఈ ముసుగులో ప్రోత్సహిస్తోంది. దీనిని రూపుమాపడం ప్రస్తుత వ్యవస్థలో అసాధ్యం.

  • krishna అంటున్నారు:

   సంకల్ప సిధ్ధి లేని ప్రయత్నమే ఈ సమస్యలని ఇంకా సాగనిస్తున్నాయండి.చక్కటి ప్రణాలిక వుంటే ఏదన్నా సాధ్యమే !కాదంటారా?

 3. శర్మ అంటున్నారు:

  ఇన్సెస్ట్ పై ఉన్నంత వ్యతిరేకత వ్యభిచారం పై లేదు. అందుకే కొంత మంది వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలంటున్నారు. ఎవడైనా పబ్లిక్ లో తల్లికొడుకుల పెళ్ళి లాంటి మాటలు ఆడితే వాడిని పట్టుకుని తంతారు. అదే వ్యభిచారం చట్టబద్ధత గురించి మాట్లాడితే తన్నరు. కేవలం దొంగచాటుగా జరుగుతోంది అనే కారణంతో వ్యభిచారాన్ని ఎందుకు చట్టబద్ధం చెయ్యాలి? ఇన్సెస్ట్ కూడా దొంగచాటుగా జరుగుతుంది. చట్టబద్ధత కొరకు దొంగచాటుతనాన్ని కారణంగా చూపించడం హాస్యాస్పదం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s