“అతడు మనిషి”- కధా పరిచయం (గ్లాసు సగం నిండుగా వుందా?ఖాళీగా వుందా?)

Posted: ఏప్రిల్ 27, 2010 in కధలు

ఒకానొక చర్చలో మిత్రుల తో కొంచెం అభిప్రాయ భేధం వచ్చింది.మన ప్రపంచం లో అసమానతలు నెమ్మది నెమ్మదిగా తొలగి పోతున్నాయని వారు అంటే నేను ఇంకా జరగవలిసింది చాలా వుంది అని అన్నాను.అసమానతలు వున్న విషయం లో ఇద్దరిది ఏకాభిప్రాయం అయినా వాటి స్థాయి ఎంత అన్నదాని పైన విభేధించాము.అయితే మధ్యే మార్గం గా గ్లాసు లో నేను సగం ఖాళీని చూస్తున్నానని,మీరు సగం నిండుగా వున్నది చూస్తున్నారని చెప్పి చర్చ ముగించాను. ఈ నేపధ్యం లో నేను చదివిన ఒక మంచి కధ గుర్తుకి వచ్చింది.మన నిత్య జీవితం లో కనిపించె సాధారణ విషయాల వెనక మనం అసమానతలని ఒక్కొసారి గమనించలేము.అలా జరగడం సహజమని అనుకుంటూ,అందులో ఒక వివక్ష వుందని కూడా మన స్పృహకి అందదు.అటువంటి ఒక మామూలు సంఘటన వెనక వున్న వివక్ష ని ఎత్తి చూపించె కధ ఇది.చాలా రోజుల గా ఆ రచయత వివరాలు సంపాదించుదామని ప్రయత్నించి ఇక కుదరదని ఈ టపా రాయడానికి ఉద్యుక్తుడని అయ్యాను.నాకున్న చెడు అలవాట్లలో ఇది ఒకటి,కధల, పుస్తకాల లో విషయం ఎప్పటికి మర్చిపోలేకపోయినా ఆ సదరు రచయత పేరు,కధ పేరు మర్చిపోతుంటాను.అయితే “అతడు మనిషి” అన్న ఈ కధ ప్రముఖ కధల పత్రిక “విపుల”లో ముప్పై వసంతాల వార్షిక సంచిక ప్రత్యేకం గా నిర్వహించిన కధల పోటిలో బహుశా మొదటి బహుమతి పొందిన కధ.ఇంత కన్న వివరాలు గుర్తు లేనందుకు నన్ను క్షమించండి.ఎవరైనా ఆ వివరాలు తెలపగలిగితే అవి ఇక్కడ పొందుపరుస్తాను.

*జాజిమల్లిగారు అందించిన వివరాలు ప్రకారం ఈ కధ రాసింది,అద్దేపల్లి ప్రభు.కృతజ్ఞతలు జాజిమల్లి గారు.*

ఇక కధ విషయానికి వస్తె కధా నాయకుడు ప్రభుత్వ ఉద్యోగి.ఒక పల్లెటూరు లో కొంచెం పని పడి వెళ్లిన అతడు భీకరమైన తుఫానులో చిక్కుకుని ఒక పూరి గుడిసె లో తల దాచుకుంటాడు.ఒక మూడు రోజుల పాటు, ఆ గుడిసెలో వున్న ఒక చిన్న కుటుంబం ఇచ్చిన ఆశ్రయంతో ఆ తుఫాను ధాటిని తప్పించుకుంటాడు.భార్య భర్త వారికి ఒక చిన్న పిల్లవాడు,ఇది వారి కుటుంబం.ఆ పిల్లవాడిలో తన కొడుకుని చూసుకుంటాడు మన కధా నాయకుడు.”చిరంజీవోడిలా” స్టెఫ్ఫులు వేస్తున్న కొడుకుని చూసి మురిసిపోయే తండ్రి,తండ్రి కొడుకల్ని ప్రేమగా విసుక్కునే భార్య! వారిని చూసి మాటి మాటికి తన కుటుంబం గుర్తుకి రావడం,తను వారిని చేరుకునేదెప్పుడా అని దిగులు పడడం, ఇదే కధానాయకుడి కాలక్షేపం.తన జీవితంలో ఏ రోజు తినని, తింటానని ఊహించని భోజనం అతడీకి రుచిగా కూడా అనిపిస్తుంది, బహుశా ఆకలి వలన ! ఎప్పుడు ఈ వర్షం,తుఫాను వెలుస్తుందా అని అతడు ఆ గుడిసె యజమానిని అడుగుతూ వుంటాడు.చిన్న తడిక గుడిసెకి తలుపులా వున్నా బయట వర్షం ని ఎంత మాత్రం ఆపలేదు.మూడు రోజులగా తడిసి ముద్దయి పోయిన కధా నాయకుడు వర్షం కొంచెం తెరిపినివ్వడం తో బయలు దేరుదామని అనుకుంటాడు.అయితే ఇంకా మోకాలు లోతు వున్న నీటిలో దారి తెలియక బయటకి వెళ్లడం మంచిది కాదని ఆ గుడిసె యజమాని నిలువరిస్తాడు.కాని ఇంకా ఇంటికి దూరంగా తన కుటంబమ్ని వదిలి ఉండడం ఇష్టం లేని కధానాయకుడు బలవంతం చేస్తె బస్సులు ఆగే చొటు వరకు తోడు వస్తానని అతడు కూడా బయలు దేరుతాడు.తనకి ఇంత సహాయం చేసిన వ్యక్తికి ఇద్దామన్నా డబ్బులన్ని తడిచి వుంటాయి.తనకి చేసిన మేలుకి కృతజ్ఞతలు తెలుపుతున్న కధానాయకుడికి “అతడు” ఇచ్చిన జవాబు: “దీనికి మరీ ఇంత ఇది అయిపోవాల్సినది ఏముంది సారూ?ఇందులో నేను అంతలా సేసింది ఏముంది?ఒక వేళ నేను నీ లానె వానలో చిక్కుకుపోయి నీ ఇంటి తలుపు తడితే నువ్వు మాత్రం నన్ను లోపలికి రానీయవా?నాకింత కూడు ఎట్టకపోతావా?అదే నేను సేసింది కదా”అంటాడు. కధ మొత్తం ఆ ప్రభుత్వుద్యోగి చెబుతున్నట్టు ప్రధమ పురుష వాచకంలో వుంటుంది.అతడు ఆ గుడిసె మనిషిని అతడూ అని సంబోధిస్తాడు. అతడు ఇచ్చిన జవాబుకి కధానాయకుడి చెంప చెల్లుమని అన్నట్టు అనిపిస్తే మనం కూడా వులికిపడడం సామాన్యమే!

కధా గమనం అంతా సామాన్యంగా వున్నా ఆ చివరి మాటతోనెఒకవిలువ ఆపాదించబడుతుంది,కధకి.ఒకసారి అబ్రకదబ్ర గారు తెలుగు కధల గురించి జరిగిన చర్చలో సందేశాలు ఇచ్చె కధ కన్నా థ్రిల్ కలిగించే కధని మాత్రమే ఇష్టపడతానని  ఇక్కడ చెప్పారు.కొంతవరకు ఆయన అన్నది నిజమే కావచ్చు,ముఖ్యంగా పెరట్లో కొట్టేసిన చెట్ల గురించి,వృధ్ధుల ఓల్డేజి హోముల గురించి,రేపటి పౌరులు నేడు కోల్పుతున్న బాల్యం గురించి,పదే పదే చెప్పిన సందేశం మళ్లీ ఇచ్చే కధలని ఎవరైనా ఇష్టపడరు.కాని ఒక సందేశం ఇచ్చినా గుండెలకి హత్తుకు పోయెటట్టు చెప్పిన  ఈ కధ నేను చదివిన మంచి కధలలో ఒకటిగా ఎప్పటికి నిలిచిపోతుంది.ఎవరైనా చెప్పండి మరి గ్లాసు సగం నిండుగా వుందా లేక ఖాళీగా వుందా?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. jajimalli అంటున్నారు:

  అద్దేపల్లి ప్రభు రాసారు .కధాసాహితి సీరీస్ లో కూడా ఈ కధ వచ్చింది
  దీని మీద చాలా చర్చలు జరిగాయి .అసమానతలు వివక్షల నేపధ్యంలో
  కాదు.మానవ సంబంధాల కోణం నుంచి …

  • krishna అంటున్నారు:

   మీరు అందించిన వివరాలకి ధన్య వాదములండి.ఇది చాలా మంచి కధ.కాకపోతె నేను కేవలం అసమానతలు,వివక్ష దోరణిలోనే చూస్తున్నానంటె , మానవ విలువలు దృష్ట్యా చర్చ ఎలా జరిగిందో తెలుసుకోవాలని వుంది.టపాలో రచయత వివరాలు పొందు పరుస్తాను.

 2. కధ గురించి కాదుగానీ… గ్లాసు సగం నిండుగా వుందా లేక ఖాళీగా వుందా? అన్న ప్రశ్న గురించి.
  ఎప్పుడో పాతికేళ్ళ క్రితం ‘MAD’పత్రికలో చదివానో సమాధానం.. అగ్లాసును నువ్వు నింపుతున్నావా? లేక ఖాళీ చేస్తున్నావా అన్నదాని మీద ఆధారపడి ఉంటుందీ అని.

  • krishna అంటున్నారు:

   మీ జవాబుకి ధన్యవాదాలు.చాలా చక్కని సమాధానం.బహుశా గ్లాసు మనకి ఖాళీ గా అనిపిస్తెనే మనం దానిని నింపడానికి ప్రయత్నిస్తాము కదా!నాకు గ్లాసు ఖాళీగానె అనిపిస్తుంది.

 3. manohar అంటున్నారు:

  Dear Pillakaaki,

  యీ కథలో ని యీ క్రింది వ్యాఖ్య లు నిరంతరం వింటూనే వుంటాము .కాని వాటిని మనకు మనం ఆపాదించుకోవడానికి సాహసం చేయం. అటువంటి దుర్భల స్థితిలో మనింటికే,… దైన్యస్థితిలో పేదవాడెవరైనా ఆశ్రయిస్తే….అతను చూపిన ఔదార్యం ఎంతమందిమి చూపగలం? పరస్పర సహకార ఆవశ్యకత గురించి , మానవసంబంధాలలో అఔదార్యపు కోణం గురించీ ,బాల్యం నుంచీ వివరించవలసిన ఆవశ్యకత ప్రస్తుత జీవన విధానంలొ ఎంతో వుంది.

  “దీనికి మరీ ఇంత ఇది అయిపోవాల్సినది ఏముంది సారూ?ఇందులో నేను అంతలా సేసింది ఏముంది?ఒక వేళ నేను నీ లానె వానలో చిక్కుకుపోయి నీ ఇంటి తలుపు తడితే నువ్వు మాత్రం నన్ను లోపలికి రానీయవా?నాకింత కూడు ఎట్టకపోతావా?అదే నేను సేసింది కదా”అంటాడు.

  • krishna అంటున్నారు:

   మనొహర్ గారు కృతజ్ఞతలు.ఎదుటి వ్యక్తిని స్థాయి పర భేదాలు, జాతి మత చట్రాలుకి అతీతంగా సాటి మనిషిగా చూడడం…అది ఒక గొప్ప పనిగా చూసె స్థాయిలో మన సమాజం వుండడం మన ధౌర్భాగ్యం!

 4. saamaanyudu అంటున్నారు:

  ఆ చివరి ప్రశ్నలోనే మన మనస్తత్వాన్ని ప్రతిబి౦బి౦చాడు రచయిత. మన యింటి ముందు వానలో నిలబడ్డ వాణ్ని గోచిపాతగాన్ని లోపలి పిలవలేని తనాన్ని కథలో చెప్పారు. మానవ స౦బ౦ధాలు సరుకుగా మారుతున్న వైనాన్ని, అలాగే మూలాలలో యింకా అవి ఇంకిపోని తనాన్ని తెలియజేస్తు౦దీ కథ అని నా భావం. మ౦చి కథను మరల గుర్తుచేస్తూ చర్చలో పెట్టినందుకు ధన్యవాదాలు సార్.

 5. మిత్రులారా,ఈ సందర్భంలోనే.. ఇలాంటిదే మరొక కధ,కధకుడు రావిశాస్త్రి గారు,కధానాయకుడు ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటాడు,అప్పుడే ఊరిప్రయాణమూ పెట్టుకుంటాడు,రైల్వే స్టేషన్ కి వెళ్ళనీకుండా పేద్దవాన.ఓ టీపాకలో ఆగుతాడు,అక్కడ ఎంతో అంతఃసంఘర్షణకు లోనయి కర్తవ్యాభిముఖుడై బయట హోరువానలోనూ ఆగకుండా వెళతాడు.ఆ కధ పేరు ఎవరన్నా చెప్పగలరా దయచేసి??

 6. అయ్యో,ఈ మాత్రం దానికే క్షమాపణలు అవీ ఎందుకండి బాబు?
  ఆకధ గురించి మనవాళ్ళెవరూ చెప్పకపోతే నేనే వెతుకుతాన్లెండి 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s