సానియా-ప్రతిజ్ఞ

Posted: ఏప్రిల్ 9, 2010 in పిచ్చాపాటి
ట్యాగులు:

నేను  సానియా మీద అలిగాను. ఈ పోస్టు వెయ్యడానికి కూడా మనసొప్పలేదంటే నమ్ముతారా?కాకపోతే సాటి పెళ్లికాని మగ బ్లాగర్ల కోసం(అంటే వారి క్లారిఫికేషన్ కోసం) ఇది రాస్తున్నా!అసలు నాకు సానియా మీద కోపం ఎందుకొచ్చిందో చెప్పలేదు కదా!నా కంటే అందగాడా షోయబ్ మాలిక్?(డౌట్ వుంటే నా ప్రొఫైలు ఫొటొ చూడండీ! )నా కంటే ఈడు జోడునా వాడు? నాలాంటి యంగ్ హాండ్సము కుర్రాడిని వదిలేసి ఏవడో కౌన్ కిస్కా గొట్టాం గాడిని పెళ్ళి చేసుకుంటుందా సానియా?అసలు వాడిని చేసుకుని ఏమి సుఖపడుతుందండీ?వాడూ అంతర్జాతీయ క్రికెటరు కదా?సంవత్సరం లో పది నెలలు క్రికెట్ అంటు దేశం (ప్రపంచం) మీద పడి తిరుగుతాడు.అసలు సానియాని ఏమి పట్టించుకుంటాడు?(అఫ్‌కోర్స్ ఇప్పుడు మనోడి పరిస్థితి,వాళ్ల టీము పరిస్థితి చూస్తే అది అసంబద్దంగా అనిపిస్తుంది అనుకోండి.)ఇక ముద్దు ముచ్చట,ఆట పాట ఏమి జరుగుతాయి పాపం పిల్లకి?అదే నన్ను చేసుకుంటే ఎంత సుఖ పడుతుందని!

మనకున్న రాజ కార్యాలు అన్ని మానుకుని మరీ సానియా బాగోగులు చూసుకునే వాడిని కదా!అంతగా కావాలంటే తనకి టెన్నిస్ కోచ్ గా వుండి తన తో పాటు ఎప్పుడు తోడు నీడగా వుండేవాడిని కదా!(ఇంతకి టెన్నిస్ అంటే ఒక బల్ల వుంటాది,దాని మీద రంగు రంగు పెద్ద సైజు గోళీ కాయలు వుంటాయి.వాటిని ఒక పొడగాటి కర్ర పుల్ల తో పొడుస్తుండాలి అదే కదా?) నాకు తెలుసండి మీరు మరీను!(ఇక చూసుకోండి.చిన్న క్లూ ఇస్తే చెలరేగిపోను?) నెక్స్ట్ ఒలింపిక్స్ లో మనకి మాణ్ణాలుగు స్వర్ణ పతకాలు తెప్పించెస్తాను.సానియా తో పాటు మన దేశం కూడా క్రీడల్లో ముందుకు దూసుకు పోయేది.హ్మ్ ……ఏమి చేస్తాము చెప్పండి,ఎవరి రాతని ఎవరు మార్చగలరు?ఇది మన కోప కారణం.

అంతే తప్ప షోయబ్ మాలిక్ పాకిస్తాని అనో, భారత దేశంలో ఇంకెవరు దొరకలేదనొ ఆడిపోసుకోవడం అర్దం లేనిది.అతడు ఏదొ తప్పు చేసాడని మనం అనుమానాలు వ్యక్తపరిచి ఇంత తెలివి తక్కువగా వాడి బుట్టలో పడ్డావేంటి సానియా అని జాలి పడక్కరలేదు.అతడు తప్పు చేసాడొ లేదో గాని ఆ వివాదం ఇప్పుడు ముగిసింది.ఆ నిజానిజాలు మనకి తెలియవు.ఇంకొంతమంది,అసలు ఇంత తొందరగా వీళ్లు ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారని,కళ్యాణమొచ్చినా,కక్కొచ్చిన అసలు ఆగదు,ఆ కక్కే ముందు వస్తే అస్సలు ఆగదు అని ఛంఢాలమైన అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.అది చాలా అసంబధ్ధంగా అనిపిస్తుంది.అది కాకుండా మనకి తెలియని మనుషుల వ్యక్తిత్వం పై అంత చౌకబారు ఆరొపణలు చెయ్యడం మన దిగజారుడుతనం ని చాటి చెబుతుంది.ఒక మనిషి మంచొడా చెడ్డొడా అన్నది వాడి జాతీయత మీద ఆధార పడదు.ఈ సంకోచపు చట్రాలను వదిలి సాటి మనిషిని సాటి మనిషిలా చూడాలి.అంతే కాకుండా ఎదుటి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్చ అనేది ఒకటి వుంటుంది అని (సెలబ్రిటి అయినా) గుర్తుంచుకోవాలి.

ఈ ఆడ సెలబ్రిటిలు అందరు ఇలా రెండో పెళ్లి వారిని ఎందుకు పెళ్లి చేసుంటారని ఒక పెద్దాయన అనుమానం వెలిబుచ్చారు,దానికి సమాధానం నా దగ్గర లేదు గాని సానియా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదొ మటుకు తెలుసు.చిన్నప్పుడు హైస్కూలువరకు తను చేసిన ప్రతిజ్ఞ చాలా సీరియస్సుగా తీసుకుందట!ఆ ప్రతిజ్ఞ ఏమిటంటారా?

“భారత దేశం నా మాతృదేశం.భారతీయులు అందరు నా సోదర సోదరీమణులు……..”

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. sireesha అంటున్నారు:

  sooo sweet,

  paapam meelaaga chaala mandi baadhapadutunna vaarandari tarupuna raasinatlunnnaru!!. okkk take it easy saaniyaa kakapote maro monikaa..ante kada

 2. Phani అంటున్నారు:

  Its ok…
  take it lite… dont loose your hart

  try for eliyana… ( and i am not expecting the same kind of post when she too get married 🙂 )

 3. రవి చంద్ర అంటున్నారు:

  చివర్లో ట్విస్ట్ మాత్రం అదిరింది 🙂

 4. శ్రీవాసుకి అంటున్నారు:

  >భారత దేశం నా మాతృదేశం.భారతీయులు అందరు నా సోదర సోదరీమణులు……..”

  అయితే మీరు కూడా ఏ పాకిస్తాని పాపనో, అఫ్ఘనిస్తాన్ అమ్మయినో పెళ్ళి చేసుకోవాలి.

 5. sowmya అంటున్నారు:

  మంచి జల్ల కొట్టారుగా

  నవ్వుతూనే తిట్టారు 😛

  మీ వరస నాకు నచ్చింది.

 6. jyothirmayi అంటున్నారు:

  పాపం ఏం చేద్దాం సానియా కు అద్రుస్టం లేదు.వదిలేయండి.

 7. subbarao అంటున్నారు:

  ఒలింపిక్స్ తరవాత సానియా కి ఒక అర్జున అవార్డు రాకుండా పోయింది. మీకేమో ద్రోణాచార్య అవార్డు రాకుండా పోయింది. ఏమి చేస్తాం?.

 8. sivaranjani అంటున్నారు:

  చాలా బాగా రాసారు . మిమ్మల్ని చేసుకోకపోవటం తన దురదృష్టం , పాపం సానియా !

 9. Srava Vattikuti అంటున్నారు:

  నెనర్లు అనగా Thanks 🙂 బాగా రాసారు !

 10. jajimalli అంటున్నారు:

  సెటైర్ రాసేపుడు చాలా బాలెన్స్ వుండాలి .ఆ విషయంలో మీరు నేర్పరి .తక్కువ మందిలో ఈ లక్షణం
  కనిపిస్తుంది .వాక్యం కూడా ప్రోమిసింగా వుంది.పిల్ల కాకినని చెప్పి అందరినీ మోసం చెయ్యకుండా
  ఏదొక ప్రక్రియ ఎంచుకుని (వ్యంగ్య కధలు బెటర్ )తెలుగు సాహిత్యానికి మీ కాంట్రిబ్యూషన్ ని విస్తృతం
  చెయ్యండి.కంటెంట్ ని డీల్ చెయ్యడం లో కొంచెం శ్రద్ధ పెట్టగలరు .ఇంతకు ముందే (బ్లాగ్ లో రాసినవి కాక)
  మీ రచనలు ప్రచురింపబడి వుంటే,మీకు వీలుంటే తెలియజేయండి.

  • krishna అంటున్నారు:

   నేను నిఝంగానే పిల్లకాకినండి,నమ్మండి ప్లీజ్!మీ మెచ్చుకోలు నా ఆత్మస్థయిర్యం పెంచేది గా వుంది.ధన్యవాదాలు.రాద్దామని ప్రయత్నమే తప్ప రాయడానికి అంతగా వీలు పడేది కాదు.బహుశా ఆత్మన్యూనతా భావం వల్ల కాబోసు.ఇక మీదట తప్పక ప్రయత్నిస్తాను.

 11. Jayavani అంటున్నారు:

  ఫినిషింగ్ టచ్ చాలా బావుంది 🙂

 12. dharanija అంటున్నారు:

  chalaa baagundandee navvu aapukolekapoyaamu

 13. sowmya అంటున్నారు:

  krishnagaru i want to mail u something. if u don’t mind, could u please give me ur mail id?

 14. శ్రీవాసుకి అంటున్నారు:

  Krishna gaaru,
  You restricted comment box to your latest post. So i couldn’t post my last comment. Anyway here iam putting my comment. After you read it, you may delete it. as you wish. Please dont’ mind.

  @ కృష్ణ గారు
  వేదాలు, ఉపనిషత్ లు ఆడవారు, ఇతర వర్ణాల వారు కూడా చదివారు. గార్గి అనే మహిళ యాజ్ఞవల్క్య మహర్షితో సంవాదం చేస్తుంది జనకుని కొలువులో. అలాగే అనసూయ వంటి మునిపత్నులు కూడా. వీరంతా వేద పరిజ్ఞానం ఉన్నవారే. మాంసం అమ్ముకొనే ధర్మవ్యాధుడు కూడా ఒక మహర్షికి జ్ఞానబోధ చేసినవాడే. ఇక వాల్మీకి ఒక బోయవాడు. ఇలా మరికొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి పేర్లయితే గుర్తులేవు. పూర్వం ఆడవారికి కూడా యజ్ఞోపవీతం ఉండేది. అలాగే ఇతరులకి కూడా. ఆనాడు పనిని బట్టి వర్ణ విభజన చేశారు. చదువు చెప్పేవారిని (బ్రహ్మ జ్ఞానం గలవార్ని) బ్రాహ్మణులుగా, వ్యాపార లావాదేవీలు నిర్వహించేవార్ని వైశ్యులుగా, రాజ్య పాలన చేసేవార్ని క్షత్రియులుగా, వడ్రంగి, నేత, వ్యవసాయం ఇత్యాది వృత్తులు చేసేవార్ని శూద్రులుగా పని విభజన జరిగింది. ఇవేమి కులాల పేర్లు కావు. చేసే పనియొక్క పేరు మాత్రమే. అంటే ఒక ఆఫీసులో మేనేజర్, అకౌంటెంట్, అటెండర్ లాగ అన్నమాట. అందరు సమానమే. అంతేగాని నేటి కుల వ్యవస్థతో దీనిని పోల్చవద్దు. ఎవరికి ఏది ఇష్టమైతే దాంట్లో ఉండేవారు అలా ఉండేవారు ఆ వర్ణం పేరు మీదుగా పిలువబడేవారు. ప్రతీ వర్ణానికి కొన్ని నిర్ధిష్టమైన పద్ధతులు, విధానాలుండేవి. వాటి పరిధులకు లోబడి పనిచేసేవారు. అందరికి శాస్త్రంపట్ల అవగాహన ఉండేది. కాని ఇది నేటి కుల సమాజంగా ఎప్పుడు మారిందో నాకు తెలియదు. అలాగే వేద పరిజ్ఞానం ఎప్పుడు కొందరికి పరిమితమై మిగిలిన వారికి ఎప్పుడు దూరమయిందో తెలియదు. తక్షశిలలోని నలందా విశ్వవిద్యాలయంలో విదేశీయులకు కూడా ధర్మ శాస్త్రాది వేద పరిజ్ఞానములు నేర్పిన ఆనాటి సమాజం సొంతవారిని ఎందుకు దూరం చేసుకొంటుంది. ఇది ఆ తర్వాత కాలగతిలో కలిగిన మార్పు అయ్యిండొచ్చు. ఇప్పుడు మనం పాటించే మతంగాని, కట్టుబాట్లుగాని కాలప్రవాహంలో మార్పులకు గురవుతుంటాయి. మతాన్ని ఆచరించేవారిలో తెలివిమీరిన వ్యక్తుల పైత్య ప్రకోపం వల్ల మతం అభాసుకావచ్చేమోగాని మతంలో తప్పు లేదు. ఒకసారి సుజాత గారి కామెంట్ కూడా చూడండి. బాగా వ్రాసారు. మతం ఆధ్యాత్మికకు ఉపయోగపడే ఒక విధానం. అందులో దైవారాధన, ధర్మాచరణ సంబంధిత విషయాలుంటాయిగాని చెడు, తప్పు రెండు ఉండవు. ఎవరి మత మార్గంలో వారుంటే ఫర్వాలేదు. లేదంటే అక్కర్లేని విభేధాలు తప్పవు. హిందూ మతానికి ఇతరాల వలె ప్రవక్తలు లేరు. మఠాధిపతులున్నా వారేమి ప్రజల్ని అజమాయిషీ చేయరు. దీనిలో స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసేవారున్నారు. ఎవరికెలా ఇష్టమైతే అలా పూజించుకోవచ్చు. తపస్సు చేసుకోవచ్చు, ఇంట్లో పూజంచుకోవచ్చు, లేదా దీనజనులకు సహాయపడటం ద్వారా కూడా భగవంతుని సేవించుకోవచ్చు. ఎవరిష్టం వారిది. మీరన్న రామాయణ,భారతాలు వేదం మరియు ఉపనిషత్ లలో చెప్పబడిన మానవ ధర్మాలను ఆచరించిన వ్యక్తుల గురించి తెలియజేస్తాయి. వేదోపనిషత్ లు అర్థం కాని పామర జనానికి (ఈనాటి బ్రాహ్మణులైనా సరే) వీటిద్వారా కథల రూపంలో వారికి అర్థమయ్యేరీతిలో తెలియజేసారు. భగవద్గీత మానవ దైనందిన కర్తవ్యాన్ని తెలియజేసి కార్యోన్ముఖుడ్ని చేస్తుంది. వాటి నిజసారాన్ని తెలుసుకున్న రోజు, మతసారం అర్థం చేసుకున్న రోజు మతపరంగా మరే రకమైన దురుద్దేశ్యాలు ఎవరికీ ఉండవు అని నా భావన. వ్రాయాలంటే చాలా ఉంటూనే ఉంటాయి. ఇప్పటికింతే.

  మీ బ్లాగ్ ని మొట్టమొదటిసారి విరివిగా ఉపయోగించుకొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిన్న 150 కామెంట్లు పైన చూసాను. ఈరోజు లేవు. డెలీట్ చేసారా. మీ పోస్ట్ కి నా మొదటి కామెంట్లో సరదాగా బ్లాగ్ విప్లవం సృష్టిస్తారేమో అని వ్రాసా. అది నిజం చేసారు. మళ్ళీ త్వరలో కొత్త టపాతో వస్తారని ఆశిస్తూ..అభిమానంతో…శ్రీవాసుకి.

  • krishna అంటున్నారు:

   శ్రీ వాసుకి గారు,
   మీ జవాబుకి ధన్యవాదాలు.మతం నాకెప్పుడు ఒక ఆసక్తికరమైన విషయమే.ఈ రోజు నేను ఇలా కాకుండా ఇంకొలా వుంటే బహుశా బాగా ఉదృతమైన మతభావాలు వుండేవి అనుకుంటాను.నాకు ఏనాడు ఏ మతం గురించి కూడా సంతృప్తికరమైన జవాబు దొరకలేదు.దొరికి వుంటే ఇలా వుండేవాడిని కాను.నాకు మతం లో మంచి చూద్దామని చాలా ప్రయత్నం చేసాను.పెద్ద పెద్ద మతగురువులు (అన్ని మతాల వారు) కూడా నా ప్రశ్నలకి జవాబు ఇవ్వలేక పోయారు.మంచి మత జ్ఞానం వున్నవారు దొరకకపోవడం నా దురదృష్టం.నాకు ఆ సమాధానాలు దొరికి వుంటే,మతం మంచిని మాత్రమే పెంచుతుందని నాకు నమ్మకం కలిగి వుంటే నేను కూడ చాలా మంది కంటే ఎక్కువగా మతాన్ని సమర్ధించే వాడిని అనుకుంటా.ఇంకా ఆలోచిస్తే మంచి కంటే చెడు ఎక్కువ కనిపించింది.ఎప్పుడు జరిగిందో తెలియదు నేను నా మతానికి దూరమయిపోయాను.మంచిదే అనిపించింది.
   ఇక మీ జవాబులో నాకు అందని కొన్ని అంశాలు ఇవి:
   మతం కాలక్రమేణా మారింది,కాని చెడుగా.మరి దానిని అది కాపాడులేకపోవడం,మనిషి పైన,(అంటే మత ధర్మాలని పాటించే మనిషి పైన)దానికి నియంత్రణ లేక పోవడం దాని వైఫల్యం కాదా?వైఫల్యం అని ఒప్పుకుంటే అంత కంటే మంచి పధ్ధతికి మారడం తప్పా?మనం మంచి అనుకున్నది ఎదుటివారికి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో నేను కూడా చెప్పాలనుకోవడం నా హక్కు కాదా?
   ఇక వ్యాస మహర్షులు పుట్టుక తో ఒక వర్ణం కి చెందిన వారు అయితే ప్రయత్నం మీదట మరొలా మారి,వెద ఉపనిషత్తులు చదివే హక్కు పొందారు.అంటే వారికి జన్మతః ఆ హక్కు లేదన్న మాట.అంటే తారతమ్యాలు ఆ కలం నుండే వున్నాయి.వేరె వర్ణం వారు వేద ఉపనిషత్తులు చదవాలంటే వారు,ముని పత్నులో,తపస్సు చేసి మహర్షులో కావాలన్న మాట.మరి వాటిని చదివే హక్కు వున్న వర్ణం లో వున్న వారుపుట్టుకతోనె అంతటి గొప్పదనం పొంది వుంటారా?ఇంకా నాకు కూడా చాలా అడగాలని వుంది.చర్చిస్తుంటే మన వాదన బల పర్చడానికి ఇంకా ఆలోచిస్తాము.అందువలన మన ఆలోచన పరిధి పెరుగుతుంది.ఎదుటి వారి వలన మంచి విషయాలు తెలుస్తాయి.కాని కొంతమంది మతం లో చెడు దానిని ద్వేషించెటట్టు చేసింది అంటే నేనొ మత ద్వేషిని అంటారు.మతాన్ని ద్వేషించిన పరవాలేదు,కాని మనుషులుని ద్వేషించితే తప్పు అని నా అభిప్రాయం.మన లేక మీ సనాతన ధర్మం లో ఈ వర్ణ వివక్ష గురించి,పుట్టుక తో ఒక పని చేసెందులకు అర్హత ఇవ్వడం గురించి ఒక మలక్ పేట మూర్ఖుడితో నొ,గచ్చిబౌలి గూండా తోనె పనికి మాలిన చర్చ జరిగింది.ఇలా ప్రశ్నించిన నన్ను కుల గజ్జి వుందని విమర్శించితే చర్చ బాగా గాడి తప్పింది.అందుకే ఇక కామెంట్లను ఆపేసాను.ఆ అనవసర వాది కామెంట్లను కూడా,కొన్ని నావి కూడా తొలిగించాను.సున్నితంగా వుండడం అంటే ఆత్మాభిమానం లేక పోవడం కాదు కదా.మీ వంటి వారితో చర్చిస్తే కొంత మంచి విషయాలన్నా తెలుస్తాయి.అటువంటి వారితో చర్చ సమయం వృధా.

   • శ్రీవాసుకి అంటున్నారు:

    కృష్ణగారు

    మీ జవాబుకు ధన్యవాదాలు. మనమిద్దరం ఒక ఎడతెగని విషయం మీద చర్చ మొదలుపెట్టాము. కాని దీనికి అంతం ఉండదు. జవాబు అంతకన్నా ఉండదు. ఉండేదల్లా అభిప్రాయ భేదాలు మాత్రమే. కాదంటారా. ఎంతోమంది మత గురువులని అడిగానన్నారు. నిజమైన సద్గురువు దొరికే వరకు మీరు అన్వేషించగలిగితే అప్పుడు సరైన సమాధానం దొరుకుతుంది. గురువు లభించడం అంత సులువు కాదు. మతం నుంచి తప్పుకున్నానన్నారు ఏదో ఒక సమయంలో మనలో అంతర్గతంగా కలిగే భావన ఒక దానిమీద ఇష్టాన్ని లేదా అయిష్టాన్ని కలిగించవచ్చు. అది వ్యక్తిగతం. నాకు దైవం మీద ఇలాగే ఇంటర్ చదువుతున్న రోజులలో అత్యంత ఇష్టం కలిగింది. అప్పటి వరకు పెద్దల మాట వినడం, వారి కూడా గుడికి వెళ్ళడమేగాని నా అంతగా నాకు ఏ అభిప్రాయం లేదు. ఇకపోతే నిన్న మీకు చెప్పిన విషయాలు గతంలో పండితుల ద్వారా, పుస్తకాల ద్వారా విన్నది, చదివినది.
    >>వేద ఉపనిషత్తులు చదవాలంటే వారు,ముని పత్నులో,తపస్సు చేసి మహర్షులో కావాలన్న మాట. నేను ఇంకోటి కూడా వ్రాసాను మీరు చదవలేదనుకుంటా
    >>మాంసం అమ్ముకొనే ధర్మవ్యాధుడు కూడా ఒక మహర్షికి జ్ఞానబోధ చేసినవాడే అని.
    నా అవగాహన మేరకు తెలిసినది చెప్పాను. తెలియాల్సినది చాలానే ఉంది. నేను మీకులాగే సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నా.
    >>వ్యాస మహర్షులు పుట్టుక తో ఒక వర్ణం కి చెందిన వారు అయితే ప్రయత్నం మీదట మరొలా మారి,వెద ఉపనిషత్తులు చదివే హక్కు పొందారు.అంటే వారికి జన్మతః ఆ హక్కు లేదన్న మాట.అంటే తారతమ్యాలు ఆ కలం నుండే వున్నాయి.

    నేను మీకు ముందే చెప్పాను. ఆనాటి వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా అనుకోవద్దని. అది కేవలం ఆ వర్ణాన్ని తెలిపే పేరు మాత్రమే అని. దానికి ఉదాహరణ కూడా చెప్పాను. బ్రాహ్మణులు అంటే వేద విద్య పారాయణ చేసినవారని అర్థం. ఎవరైతే ఉపనయనాది సంస్కారాలు కావించి ఆశ్రమ నియమాలు పాటించి వేదాధ్యయనం చేసి బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు బ్రాహ్మణులు అని పిలువబడతారు (కులం కాదు సుమీ). ఆ రకమైన ఆచరణ చేసి బ్రహ్మ జ్ఞానం పొందితే మీరు, నేను కూడా బ్రాహ్మణులమే. క్షాత్ర ధర్మం, రాజనీతి, శౌర్యము తెలిస్తే క్షత్రియులమే. అలాగే మిగిలినవి కూడా. మీ ప్రొఫెషన్ ఏదైతే అది మీరు. నేననేది ఈ వర్ణ వ్యవస్థ కాలగతిలో మార్పులు చెంది శాఖోపశాఖలై కుల వ్యవస్థగా మారిపోయిండొచ్చు. దీనికోసం మరికొంత సమాచారం తెలుసుకోవాలి.
    >>మతాన్ని ద్వేషించిన పరవాలేదు,కాని మనుషులుని ద్వేషించితే తప్పు అని నా అభిప్రాయం.
    మతం చెప్పేది కూడా మనుషులని ప్రేమించమనే. ద్వేషించమని కాదు. కాని ఈ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించటలేదో నాకు అర్థం కావటలేదు.
    బ్లాగ్లో కామెంట్ పెట్టడానికి అవకాశమిచ్చాకా అన్ని రకాల వారు వస్తారు. మంచో, చెడో, తిట్టడమో, మెచ్చుకోవడమో చేస్తారు. పెద్దగా పట్టించుకోకండీ. సరేనండీ ఇక ఉంటాను. ఎంత వ్రాసిన ఇంకా ఎంతో ఉంటూనే ఉంటుంది మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s