దేవుడిని పడగొడదాము రండీ!-2

Posted: ఏప్రిల్ 1, 2010 in అఙ్నానం, కధలు, వ్యంగ్యం
ట్యాగులు:,

బ్రహ్మాంఢ కోటి అఖిలాండ నాయకుడయిన ఆ జగజ్జేత్త-దేవదేవుడు  తత్వవేత్త రూపం లో వున్న సాతానుని ఎటువంటి చమత్కారములు,మహిమలు చెయ్యకుండా ఒక సాదారణ మానవుడిలా ఓడిద్దాము అనుకున్నాడు.తాను ఎవరో ఏమిటో బయటపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకున్నాడు.
“అయ్యా!మన సృష్టికి మూలమయిన ఆ దేముడిని,మన ఉనికి కారణం అయిన ఆ భగవంతుడిని నమ్మవద్దు అని మీరెందుకు మీ శిష్యులకి భోదిస్తున్నారు?”అని అడిగాడు.
దానికి “సృష్టికి మూలం,ఈ విశ్వం ఆరంభానికి కారణం ఏదొ వుంది అని నేను అంగీకరిస్తాను.దానిని మీరు దేవుడు అని పిలిస్తే నాకు అభ్యంతరం లేదు.ఆ దేముడికి మీ నిర్వచనం ఏమిటో నా నిర్వచనం ఏమిటో పక్కన పెడితే, నేడు ప్రపంచం లో దేవుడిని నమ్మేవాళ్ళు నాలుగు రకాలుగా విడిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటు,దాడులు ప్రతిదాడుల తో మారణ హోమం సృష్టించుకుంటున్నారు.అదే దేముడిని నమ్మని వారికి ఈ మతమనే బురద అంటదు.ఈ ద్వేషాగ్నికి దూరంగా ప్రశాంతం గా వున్నది నాస్తికులు మాత్రమే!అందుకే నేను అందరిని దేవుడిని నమ్మొద్దని చెప్పేది”అని అన్నాడు ఆ ఆఖరి రాక్షసుడు.

“వజ్ర వైఢూర్యాలను పంది ముందు పెడితే దానికి వాటి విలువ ఏమి తెలుస్తుంది?మతము లోని మంచిని వదిలి కొంతమంది మూర్ఖులు చేసే మూర్ఖపు పనులకి మీ వంటి జ్ఞానులు ఎందుకు విలువని ఇస్తున్నారు?ప్రతి మతము చెప్పేది,ఎదుటి వారిని ప్రేమించమని,శాంతిని పెంచమని.మతాలు వేరైనా దేముడు ఒక్కడే!దారులు వేరైనా గమ్యము ఒక్కటే!ఏ మతము సాటి వాడిని ద్వేషించమనదు.మారణహోమము సృష్టించమనదు.ఉత్కృష్టమయిన మానవ జన్మ పొందిన మనము భగవంతునికి కృతజ్ఞులయ్యి,ఎల్లప్పుడు ఆయనని ధ్యానిస్తు వుండాలి.”
“సరేనండీ!మీరు చెప్పినట్టే కొందరి మూర్ఖులు చేసే పనులని బట్టి మొత్తము మతాన్ని అంచనా వెయ్యకూడదని నేను కూడా ఒప్పుకుంటున్నాను.అన్నట్టు ఒక మూర్ఖుని సంగతి గుర్తుకి వచ్చింది.వాడి గురించి మీ అభిప్రాయము చెప్పాలి.”అన్నాడు సాతాను.
“అడగండి.”
“ఒకానొక కార్యాలయములో అతను అధికారి.తన వద్ద బాగా పని చేసి తనను ఏ మాత్రము పొగడని ఒక గుమస్తా,ఎప్పుడు తప్పులు తడకలు చేసినా అధికారిని పొగడ్తల తో ముంచెత్తే మరొక గుమస్తా వున్నారు.అతడు ఎప్పుడు పొగిడే గుమస్తాని జీతము పెంచి,పదోన్నతి ఇచ్చి మంచిగా పని చేసే గుమస్తాని పట్టించుకోడు.వాడి గురించి మీ అభిప్రాయము?”

“చాలా తప్పు.”అన్నాడు దేముడు.”పనికి ప్రతిఫలం గాని పొగడ్త కి కాకూడదు.”
“బాగా చెప్పారు.మరి ఏ పాపము చెయ్యని ఒక నాస్తికుడు కన్నా,భక్తి ప్రవుత్తులున్న ఒక ఆస్తికుడినే దేముడు ఎందుకు బాగుగ చూసుకుంటాడు?ఆ అధికారి కన్న ఈ దేముడు ఏ విధం గా గొప్పవాడు?”
చిరునవ్వు నవ్వాడు దేముడు.అది ఇబ్బందిగానో లేక ఇరుకున పడ్డాను అనో కాదు.మాములుగానే నవ్వాడు.ఎప్పటిలాగే మనోహరంగా నవ్వాడు.సమాధానం ఇవ్వడానికి తయారు అయ్యాడు.
ఇంకా వుంది………

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. శ్రీవాసుకి అంటున్నారు:

  దేముడు నవ్వుతున్నాడు మనోహరంగా సమాధానం ఇవ్వడానికంటూ ఆతృతను పెంచేస్తున్నారు.

 2. sowmya అంటున్నారు:

  మీరు దేముడి పక్షమో, సాతాను పక్షమో తెలుసుకోలేకపోతున్నాను.ఇప్పటివరకు కథ బాగానే నడుస్తోంది. ఇక ముందు ఏమిటి?

 3. bondalapati అంటున్నారు:

  కృష్ణ గారు,
  “దానిని మీరు దేవుడు అని పిలిస్తే నాకు అభ్యంతరం లేదు” అంటే సాతాను కూడా ఒక రకమైన ఆస్తికుడే నా?!! ఆస్తికుడు నాస్తికుడు ని ముందు డిఫైన్ చెయ్యండి.
  ఇలాంటి కథలని “అన్యార్ధ కథలు” అంటారు. ఒకప్పుడు కొడవటిగంటి కుటుంబ రావు” గారు ఇలాంటి కథలు చాలా రాసేవారు. మీకు కుదిరితే వాటిని చదవండి.మీకు ఇలాంటి కథలలో మంచి అభిరుచి ఉన్నట్లు ఉంది.

  • krishna అంటున్నారు:

   పాపులర్ అభిప్రాయం ప్రకారం,సాతాను దేముడినుండి ప్రజలని దూరం చేద్దామనుకుంటున్నాడు.కాబట్టి అతడు దేముడి వున్నట్టు అంగీకరించినా అతనికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడు.
   ఈ కధ లోని ప్రస్తుత సంభాషణలో ఒక తత్వవేత్తగా /నాస్తికునిగా వున్న సాతాను,సృష్టి కి మూలం ఇప్పుడు వున్న అర్దం లో దేముడు అని అనుకోవడం లేదు.అది బిగ్‌బ్యాంగ్ గాని మరొకటిగాని,అయినా దానికి ఒక పేరు పెట్టుకున్నప్పుడు,అది దేముడు అయినా తనకు అభ్యంతరం లేదు గాని కాకపోతే దాని రూప లక్షణాలు విషయం లో బహుశా తాను విబేదించవచ్చు అని చెప్పాడు.

 4. Malakpet Rowdy అంటున్నారు:

  Very Nioe!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s