దేవుడిని పడగొడదాము రండీ!

Posted: మార్చి 29, 2010 in అఙ్నానం, కధలు, వ్యంగ్యం
ట్యాగులు:,

దేవుడి కి చాలా కోపంగా వుంది,భూలోకంలో సాతాను ఉరఫ్ రాక్షస జాతి కి చెందిన ఆఖరి వాడు కొత్త పద్దతి లో తన మీద యుధ్ధం ప్రకటించాడు.ఇంతకు ముందులా డైరక్ట్‌గా మనుషులని ఇబ్బంది పాలు చేసి తను వారిని కాపాడబోతె తనతో తలపడకుండా వాళ్ళనే తన మీదకి ఉసిగొల్పడం మొదలు పెట్టాడు.ఒక తత్వవేత్తగా అవతారం ఎత్తి ప్రజలకి తన గురించి చెడు ప్రచారం చెయ్యసాగాడు.మనుషులకి భక్తి ప్రవుత్తులు తగ్గి తనని పూజించడం,మొక్కులు మొక్కడం అగ్ని గుండాలలో నడవడం, బలులు ఇవ్వడం వగైరా వగైరా మానేసే టట్టు చేసాడు.ఇంతకు ముందులా విధ్యార్దులు పరీక్షలకి ముందు తమని పాసు చెయ్యమని అడగడం లేదు.కష్టాలలో వున్నవాళ్ళు తమకు తామే వాటినుండి బయట పడడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప బేలగా తనకి మొర పెట్టుకోవడం లేదు.మనిషి తనకు తానే దేవుడిని అనుకుంటున్నాడు.ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన అది తన ప్రకృతి వ్యతిరేక పనుల వల్లే తప్ప దేముడి కోపం అనుకోవడం లేదు.దీనికి ఎల ప్రతిస్పందించాలా అని ఆలోచించిన దేముడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

ఒక భక్తి ప్రవుత్తులు గల మంచి మనిషిగా మారు రూపం దాల్చి ఆ తత్వవేత్త(సాతాను ఉరఫ్ ఆఖరి రాక్షసుడు) దగ్గరికి బయలు దేరాడు.దారిలో తనకి కనపడ్డ రోగులని,బాధితులని,నిర్భాగ్యులని భగవంతుని పేరు మీద ప్రార్దించి బాగు చేసాడు.తన అద్భుత కార్యాల తో తిరిగి ప్రజలని తన వైపు తిప్పుకోవడం మొదలు పెట్టాడు.తనకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళు తమ పాప ఫలితంగా ఖర్మననుసరించి కష్టాల పాలు అయితే జాలి తలిచి వారిని తిరిగి సన్మార్గం లో పెట్టి వారిని బాగు చెయ్యసాగాడు.ఇక ప్రజలు రెండు వర్గాలు గా విడిపోయి,దేముడి అద్భుతాలు చూసినవాళ్ళు దేముడి తరపున, సాతాను ప్రవచనాలు విని పాడు అయిపోయినవాళ్ళు దేముడికి వ్యతిరేకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోసాగారు.దేముడు తిరిగి మంచి ప్రాచుర్యం సంపాదించుకున్నాడు.అప్పటికే ఒక తత్వవేత్తగా పాపులర్ అయిపోయిన సాతాను,దేముడికి ముఖాముఖి చర్చ జరగాలని మేధావులు కోరుకోసాగారు.వారి కోరిక ఫలించి ఇద్దరు కలుసుకున్నారు.ఒకరిని ఒకరు ఓడించి తీరాలని కృత నిశ్చయం తో వున్నారు. చర్చ మొదలు అయ్యింది.
ఇంకా వుంది…….

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. sowmya అంటున్నారు:

  చర్చ కోసం ఎదురుచూస్తున్నాను

  • krishna అంటున్నారు:

   మీ స్పందన కి ధన్యవాదములు.మిమ్మల్ని ఎక్కువ కాలం ఎదురు చూడనివ్వను లెండి.ప్రతి రెండు రోజులకి తరువాయి భాగం పోస్ట్ చేస్తాను.(మరీ బిజీ అవ్వకపోతె!)

 2. durgeswara అంటున్నారు:

  mee blog templet color maarchamdi emi kanapadatam ledu

 3. శ్రీవాసుకి అంటున్నారు:

  కథ బాగానే వుంది. ఇంతకీ తీర్పు చెప్పేది మనమేనా.

 4. bondalapati అంటున్నారు:

  బాగుంది..ఇక నేను రాయనవసరం లేదు…మీ బ్లాగు ఫాలో అయిపోతాను.

 5. Malakpet Rowdy అంటున్నారు:

  Interesting. Waiting for the next part

 6. Jayavani అంటున్నారు:

  devunni nammi gaali ,o deepam pettakunda thama kastanni nammukuntunnaru konthamani vivekam vunnavallu. we should appreciate that. But I am eager to see how their meeting goes.

 7. e.bhaskaranaidu అంటున్నారు:

  to comment my computor doesnot know telugu. I tried somany ways as directed in the site. but not possible. eagerly waiting for further part.

 8. Jayavani అంటున్నారు:

  It would be great if you can publish other links like ‘lekhini’ in your website. That’s quite helpful for people like me. I have been struggling to figure out what tool to use to write the comments in telugu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s