దీని తస్సా దియ్యా!!ఆర్టీసి వారి బస్సు!!!

Posted: మార్చి 27, 2010 in అనుభవాలు, పిచ్చాపాటి
ట్యాగులు:

గత వారం అర్జెంట్‌గా ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళవలిసి వచ్చింది.చాలా సంవత్సరాల తరువాత మన ఎర్ర బస్సు కూడా ఎక్కడం జరిగింది.అలా అనుకోకుండా ఒక సారి ఎర్ర బస్సు ఎక్కినప్పుడు జరిగినది అందరి తో పంచుకుందామనుకున్నాను. అయితే రవిచంద్ర గారి అంతర్వాహిణి లో కూడా ఇదే విషయం గురించి ఆయన చర్చించడంతో ఈ టపా అవసరం లేదు అనుకున్నా!కాని ఒక కామెంట్ గా నా ఆలోచనలు అన్ని చెప్పడం కూడా కుదరక మనసు మార్చుకున్నాను.వైజాగ్ లో నాన్‌స్టాపు బస్సు ఎక్కి శ్రీకాకుళం వెళ్ళవలిసిన పని పడింది.అప్పటికే కొంచెం లేట్ కూడా అయిపోయింది.రాత్రి 8 గంటలకి బయలు దేరాము.రెండు గంటల ప్రయాణం!లేట్ అయితే హోటల్లు కూడా కట్టేస్తారు అని నన్ను నేనే తిట్టుకోవలిసిన పరిస్థితి.బస్సు మంచి స్పీడు మీద వుండడంతో ఆలోచనలు కట్టి పెట్టి కునుకు మొదలెట్టా. హఠాత్తుగా ధడ్ ధుడ్ మంటు శబ్దాలు.కునుకు మత్తు కళ్ళగప్పి పోయింది.ఏమయ్యిందో కాసేపటి వరకు తెలియలేదు.ఆ కాసేపటి తరువాత కూడా తెలిసినది సగం సగం!మా బస్సు లారిని గుద్దిందో లేక లారి నే మా బస్సు ని గుద్దిందో గాని,ఒక చిన్న పాటి యాక్సిడెంట్ అయ్యింది.

మా బస్సు డ్రైవరు ఒక చిన్నపాటి చేజింగ్ చేసి ఆగకుండా వెళ్ళిపోయిన లారిని పట్టుకున్నాడు.పెద్దపాటి గొడవ వేసుకున్నాడు ఆ లారి డ్రైవరు తో!లారి డ్రైవరు మటుకు ఏమి పట్టించుకోకుండా డాబాకి వెళ్ళి భోజనం చెయ్యడం మెదలెట్టాడు.మధ్యలో పాసింజర్లంతా వెర్రి మోహాలు వేసుకుని చూస్తున్నాము మా పరిస్థితి ఏంటి అని?ముందు లారి డ్రైవరిని ఆడిపోసుకున్నాము మా వాడితో కైలిసి,తరువాత నెమ్మదిగా మా పరిస్థితి ఏంటని అడిగాము వాడిని.”డిపో కి ఫోను చెయ్యాలి,ఎవరైనా వచ్చి కంప్లయింటు రాసుకుని పోలిసు రిపోర్టు రాసుకున్నాకా బస్సు కదులుతుంది” అన్నాడు. సరెలెమ్మని అందరు ఫోన్లు తీసిచ్చారు,తొందరగా అక్కడ నుండీ బయట పడుదామని.ట్విస్టు ఏమిటంటే వాడికి డిపో ఫోను నంబరు తెలీదంటా!!కుడితిలో పడ్డ ఎలుక లా తయారయింది మా పరిస్థితి!ఎవడో శనిగొట్టుగాడు మా తో పాటు బస్సు ఎక్కడం వల్లే ఇలా అయిందని ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నాము.ఇలాగయిత ఎలాగా మాపరిస్థితి అని ఒక పెద్దాయన గొడవ వేసుకున్నాడు.”మీ పరిస్థితి కి ఏమయ్యిందండీ,నా తప్పు లేకపోయినా ఈ నష్టం అంతా నా జీతంలోనె కట్ చేసి కవరు చేస్తారు” అని ఏడుపు ముఖం పెట్టాడు మా డ్రైవరు!ఏదొ ప్రైవేటు సర్వీసు అయితే ఎలగో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమించమని అడిగెయ్యొచ్చు.ఆర్టీసు వారి కి అంత దయ ఎక్కడ?”అని అన్నాడు వాడు.ఇంతలో ఒక బస్సు అటు వైపు వస్తే దాని ఆపి మమ్మలని అందులో ఎక్కించాడు.అది కూడా డొక్కు పాసింజరు!69 రుపాయలు పెట్టి నాన్‌స్టాపు టికెట్ తీసుకుని,డొక్కు పాసింజరు లో వెళ్ళవలిసి వచ్చింది.అదే మేము పాసింజరు బస్సులో వుండి దానికి ఏదయినా రిపైరు వస్తే నాన్‌స్టాప్ బస్సు ఆపుతాడా?

అసలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సంస్థ లా పని చేస్తుందా మన ఆర్టిసీ?ఇది ప్రజల సౌలభ్యం కోసం నడుపుతున్నారా?లేక లాభ ఆపేక్ష కోసమా?ప్రజలనే కాదు,వారి సిబ్బంది కూడా ఈ డబ్బు పిశాచి లాంటి సంస్థ,దాని వెనక తోడ్పాటు అందివ్వని ప్రభుత్వం కి బలి అయ్యిపోతున్నారు.వైజాగు లో బస్సు చార్జీల కంటే ఆటో చార్జీలు చాలా తక్కువ!విధ్య,వైధ్యం మరియు రవాణా కనీస అవసరాలు కావా?ప్రభుత్వం నడిపే స్కూల్లు,ఆసుపత్రులు నష్టాల్లో వున్నాయని మూసేస్తారా?కనీసం సిబ్బంది కి కూడా జీతాలు సమకూర్చుకోలేవు కదా ఆ స్కూల్లు,ఆసుపత్రులు?అంతర్వాహిణి రవిచంద్ర గారు తమ కామెంట్ లో బిజీ వేళలో బస్సులు తక్కువని వాపోయారు.కరక్టే!కాని నేను అనేదేమంటే,రాష్ట్రం లో రోజుకి ఒక బస్సు అది కూడా ఒక్కసారే తిరిగే వూళ్ళెన్నో?మన దేశం లో అయితే అసలు బస్సు సర్వీసు లేని ప్రాంతాలు ఎన్నో కదా?అలాంటి చోట ఏ మెడికల్ ఎమర్జన్సి అయినా కేవలం రవాణా సదుపాయం లేక ఎన్ని ప్రాణాలు పోతాయో కదా?మన ప్రభుత్వాలకి ఏమి భాద్యత వుండదూ?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. రవి చంద్ర అంటున్నారు:

  అవునండీ అలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి. నా టపాలో నేను కొన్ని సమస్యలు ప్రస్తావిస్తే మీరు మరిన్ని సమస్యలు ప్రస్తావించారు. ఆర్టీసీని గట్టున పడెయ్యటానికి ఐఐయం వాళ్ళు ప్రయాణీకుల నుంచి డబ్బులు ఎలా గుంజాలో అనే ప్రణాళికలు వేశారే గానీ సేవను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి తద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించలేదని నా అభిప్రాయం.

  • krishna అంటున్నారు:

   మనం పన్నులు కడుతుంది ప్రభుత్వం మనకు మెరుగైన సేవ అందించాలనే కదండీ,ఆర్టీసి కూడా లాభాపేక్ష లేకుండా నాణ్యమయిన సేవలు అందివ్వాలని నా ఉద్దేశ్యం.అఫ్‌కోర్స్,రవాణా కంటే అవసరమయినా విద్య,వైద్యం లోనె నాణ్యతా లేదు.ఇక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో ఎక్కడ వుంటుందిలెండి?

 2. భారతీయుడు అంటున్నారు:

  Tax collected is insufficient to provide those services. Many evade tax and don’t pay at all. Too many reservations , free tickets to MLAs MPs their etc. and no provision to run professionally.
  Pvt. Companies have freedom to raise fare, RTC has no such freedom.

  • krishna అంటున్నారు:

   primary education, government hospitals are also managed by government as public welfare. but they neglect transportation as important as others too.so many kids from villages stop attending schools bcoz of lack of transpotation,or unaffordable pvt transportation.what the need of the district hospitals if people cant reach them from remote villages bcoz of it.raising fares shows business mind of govt.stop corruption,make uniform tax model,strict collection.but dont commercialize public welfare systems.

 3. శ్రీవాసుకి అంటున్నారు:

  ఆర్టీసి బస్సా..మజాకా. ఇలాంటి సిత్రాలు శానా ఉంటాయిలెండి. పెద్ద కథవుద్ది మరి.

 4. Jayavani అంటున్నారు:

  If we are able to spend all the collected tax for the welfare, then we would have had really good facilities here. I agree with you that this RTC is crushing the employees as well as the people. In order to get bonus for consuming less petrol, the drivers are speeding like anything. I had an experience where the bus was going in a narrow laned road and all the way thru I was holding my breath praying god to reach me home safely.
  Here I couldn’t do any thing in this regard except praying god like gaali lo deepam petti devudi meeda bharam veyadam type lo
  I reached safely so am I able to leave this comment 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s