పురుష వివక్ష!!!

Posted: మార్చి 10, 2010 in పిచ్చాపాటి, రాజకీయం, వ్యంగ్యం
ట్యాగులు:,

ఇంక మగ మహరాజులు కి దిక్కేమిటి?ఇప్పటికే జరగవలిసినది జరిగిపోయింది,జరగాల్సినదైనా జరగక మానితె మనకు మేలు!!!రాజ్యసభలో మహిళాబిల్లు పాసయ్యిపోయింది.పాపం మన యాదవ బంధువులు తమ వంతు కృషి చేసినా ఫలం దక్కలేదు!!!అయినా మగవాడికి మగవాడే శతృవు అని ఊరకనే అనలేదు.ఇంత మంది మగవాళ్ళు చట్టసభల్లో వుండగా కూడా ఈ అన్యాయం ని ఆపలేదు.హూ !!ఏమి చేస్తాము ?ఎప్పుడు కూడా ఆడవారిదే కదా ఆధిపత్యం!!సృష్టి మొదలు నుండి ఇదే పద్దతి!ఆదిశక్తి నుండె ఈ పురుష వివక్ష మొదలు అయ్యింది.అప్పుడు ఏదొ మన జగన్నాటక సూత్రధారి  అడ్డుచక్రం వేసాడు కాబట్టి సరిపోయింది.మరి ఇప్పుడు ఏమయ్యావయ్యా నువ్వు?ఏదో ఒకటి చెయ్యు మరి?

చిన్నప్పటి నుండీ చూస్తున్నాను ఈ ధొరణి!అక్క పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందన్నారు,మరి నేను పుట్టినప్పుడో? అక్క అల్లరి చేస్తె అందంగా వుందన్నారు,ముచ్చట పడిపోయారు!మరి నేను అల్లరి చేస్తె వీపు చీరేసారే?తప్పు చేసినా అక్క కి మంచి బుద్దులు చెప్పారు,మనకేమొ దవడ మీద ఒకటి ఇచ్చారు?స్కూలు కెల్లినా టీచర్లు,మాష్టార్లు అమ్మాయిలు తెలివైన వాళ్ళు ఒక్కసారి చెబితే చాలు అని, మమ్మల్ని మట్టిబుర్రలనే వాళ్ళు. హొము వర్క్ చెయ్యకపోతె మా వీపు చేరేసెవాళ్ళు,మరి అమ్మాయిలను?కొంచెం పెద్దయ్యాక చిరు తిళ్లు కొనుక్కోవడానికి కూడా మాకు మటుకు డబ్బులిచ్చేవాల్లు కాదు, చెడిపోతామని! అమ్మాయిలకి మటుకు పౌడర్లు,కాటుకలు ,జడ రిబ్బన్లు మన్ను మశానం ఇంకా మా పిండా కూడు ఒకటే తక్కువ!!కాసేపు క్రికెట్ ఆడుకుని లేటుగా ఇంటికి వస్తే బెత్తం పట్టుకుని తలుపు దగ్గరే మంగళ హారతులు!! అదే అమ్మాయిలకు ఎప్పుడైనా అల్లాంటి సత్కారాలు జరిగాయా?కొంచెం వయసు వచ్చి బయటకి వస్తే….. 

సిటి బస్సుల్లో వాళ్ళ సీట్లో ఎలాగు వాళ్ళే కుర్చుంటారు,మన సీట్లు ఆక్రమించెస్తారు!!పొరపాటున పక్క సీటు ఖాళి అయ్యినా కుర్చొనిస్తారా?ఆ చూపు తోనె చంపేస్తారు.ఖాళీ గా వుందని వాళ్ళ సీట్లో కుర్చున్నా బితుకు బితుకుమని భయపడుతు ఎప్పుడూ పిడుగులా వస్తారోనని కుర్చోవాలి.సరే,ఎందుకు వచ్చిన బాద రా అని కూలో నాలో చేసుకునొ, అయ్యనో,అమ్మనో కాళ్ళన పడో ఒక బైకు కొని రోడ్డన పడ్డా అక్కడా స్కూటిలు వేసుకుని తయారు!! పొరపాటున వాళ్ళు మనను గుద్దేసిన మనమే సారీలు చెప్పాలి,చెప్పక పోతె “చూసుకుని నడపడం రాదా అని” ఎదురు వాయింపుడు!మన గ్రహపాటు బాగుండక మనమే వారిని గుద్దేస్తె….ఇంకా చెప్పలా?జజ్జనకజనారె!!సీను చిరిగి చేట అంత అవుద్ది. చింపేదెవరయ్యా అంటె ….మన తోటి మగ బ్రెదర్సే!!ఊరకనే అన్నరా మగవాడికి మగవాడె శతృవని?

ఉద్యోగాలు వచ్చి ఆఫీసుల్లో జాయిన్ అయినా ఇక్కడ కూడా అదే పురుష వివక్ష!ఆఫీసుల్లో లేటు అవర్సు అన్ని మన ఖర్మే? బయట కి ఎండల్లో తిరిగి ,వానల్లో తడిసి బాధపడాల్సింది మనమే!వాళ్ళకి ఆఫీసు వర్కు లో సహాయం చెయ్యడానికి అందరు ఎగబడతారు,ఖాళీ సమయాల్లో సొల్లు కబుర్లు వాళ్ళకే చెబుతారు,ఇంకా ఇంక్రిమెంట్లు,ప్రమోషన్ల విషయానికి వస్తే,ఇద్దరు ఆడ మగ జూనియర్సు వుండి ఒక మగ సీనియరు వుంటే,చెప్పాల్సింది ఏమయినా వుందా?ఏమయినా కొద్దో గొప్పో మగ వాళ్ళకి ఫెయిర్ చాన్సు వున్నదెక్కడయ్య అంటె అది రాజకీయాలు!!అఫ్‌కోర్సు అక్కడా తెర వెనక తతంగం ఎవరిదో అందరికి తెలిసిందే!!ఇప్పుడు ఈ మాత్రం అవకాశాలు మిగలవు.ఆఖరికి మహిళా దినోత్సవం నాడు ఈ టపా వేద్దామన్నా ఎంత భయం వేసిందని?
(అంతా ఉత్తుత్తినే నవ్వుతాళ్ళకి!!హిహ్హిహిహ్హి!!!) 
((ఇలా అనక పోతే బతకనిస్తారా బ్రెదరూ??))

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. Sarath 'Kaalam' అంటున్నారు:

  మీరన్నది నిజమేనండీ. మగవాళ్లకు కూడా రిజర్వేషను కావాలి. అందులో మళ్ళీ ఉప రిజర్వేషన్లు వుండాలి. అందులో మాలాంటి వారికీ రిజర్వేషను కల్పించాలి.

 2. నాగప్రసాద్ అంటున్నారు:

  ఇక్కడ కామెంటు కూడా నేను భయపడుతూనే రాస్తున్నా 😉 ఆడలేడీసుతో పెట్టుకుంటే జరిగేదేంటో నాకు బాగా అనుభవమే. 😦 :(. ఈ పురుష వివక్షకు అడ్డుకట్ట పడేదెన్నెడో, ఏ మహానుభావురాలు వచ్చి మనల్ని రక్షిస్తుందో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా. 😉 😛 😛

 3. bondalapati అంటున్నారు:

  మీ అక్కకు ఆరు వేలు ర్యాంకు తో సీట్ వస్తే మీకు ఆరు వందల తో కూడా సీట్ రాని సందర్భం ఏదీ లేదా?
  BTW: మన మెటాఫిజికల్ డిస్కషన్ గురించి ఓ కామెంట్ రాశాను నా సైట్ లో చూడండి..

  • krishna అంటున్నారు:

   మా అక్కకే ఆరు వందల ర్యాంకు వచ్చింది,నాకు ఆరు వేలు:-)మా టీచర్లు కరెక్ట్ గానె అనేవాళ్ళు అమ్మయిలు కి ఒక్కసారి చెబితే చాలు అని(just kidding, we both were equally good at studies, so i never have that kind of grudge feeling)
   నేను ఈ మహిళా బిల్లు వ్యతిరేకం కాదులెండీ ఊరకనే సరదాగా నా గోడు వెళ్ళబోసుకున్నాను.

 4. శ్రీవాసుకి అంటున్నారు:

  ఏమి చేయగలం బ్రదర్ ఒకరికొకరం కన్నీళ్ళు తుడుచుకోవడం తప్ప. ఉన్న ఒక్క ఆశ మొన్నటితో పోయింది. అందుకే అందాము జై మహిళ అని, లేకపోతే ఇంటి దగ్గర సాపాటు ఉండదు.

 5. Jayavani అంటున్నారు:

  bavundi brotheruu nee badha ardhamayyindi 🙂
  jus kidding, this kind of variety is what we are looking for, from you.
  the previous posts were all quite monotonous, but this is one good, bit of a relief from the ugly politics.
  Keep up your good work

 6. Jayavani అంటున్నారు:

  Some typos corrected:

  bavundi brotheruu nee badha ardhamayyindi!!!
  jus kidding, this kind of variety is what we are looking for, from you.
  few of the previous posts were quite monotonous, but this one is good, bit of a relief from the ugly politics.
  Keep up your good work.

 7. jajimalli అంటున్నారు:

  పురుష వివక్షలు ఎంత సరదాగా రాయగలరో !!!
  మేమట్లా సరదాగా స్త్రీ వివక్షలు రాయలేం కదా
  మహిళా బిల్లు మీద మీ టోన్ అర్ధమైంది
  సరదా వ్యాఖ్యలు సెన్సిబుల్ గా ఉండటమంటే
  బహుశా ఈ పోస్ట్ లాగా వుంటాయి.అభినందనలు

 8. Nutakki raghavendra Rao అంటున్నారు:

  (అంతా ఉత్తుత్తినే నవ్వుతాళ్ళకి!!హిహ్హిహిహ్హి!!!)
  ((ఇలా అనక పోతే బతకనిస్తారా బ్రెదరూ??))……..

  .హహ్హహ్హా ! నాకేమి మిగిలిందని రాసేందుకు? అదుకే…

  జాజిమల్లి, శ్రీ వాసుకి గార్ల కామెంట్లతో ఏకీభవిస్తున్నా…గిజిగాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s