ఒక ఉధ్యమం,దాని వెనక క్రైము సస్పెన్స్ థ్రిల్లర్ కధ

Posted: మార్చి 2, 2010 in కధలు, రాజకీయం, వ్యంగ్యం
ట్యాగులు:, ,

ఇది “తెలుగోడు”- “ఒక ఉధ్యమం” వరుస టపాల  లోనిది కాదు.గమనించగలరు.

ఈ కధ లోని పాత్రలు వాటి పేర్లు పూర్తిగా కల్పితం!అవి మీకు ఎవరినన్నా ఉద్దేశించినట్టు అనిపిస్తే మీ తెలివి కి నా జోహార్లు!!

 అనగనగా ఒక వూరు. ఆ వూరిలో ఒక పేధ్ధ తోట. అది ఆ వూరి ప్రజల ఉమ్మడి ఆస్తి. అందరు కలిసి కష్టపడేవారు. ఎవరు ఎంత కష్టపడితే అంతకు తగ్గ ఫలం అన్న మాట! వూరి ప్రజలంతా కలిసి ఒకరిని తోటమాలిగా పెట్టుకునే వారు. దొంగతనం గా ఎవరు తోటని కొల్లగొట్టకుండా చూడడం వాడి పని.అయితే తోటమాలి పులిరాజా చేను మేసె కంచె వంశం కి చెందిన వాడు. వాడి కొడుకు జగ్గడు తండ్రి కి తగ్గ కొడుకు.తండ్రి స్నేహితుడు గాలి రెడ్డి తో కలిసి దొంగతనం గా తోట ని దోచుకునెవాడు. ముఖ్యంగా ఆ తోటలోని ఓబులా వృక్షం వీళ్ళ దొంగతనంకు ప్రధాన లక్ష్యం. వాళ్ళ ఆకృత్యాలునుండి వూరి వాళ్ళ కళ్ళగప్పె పని పులిరాజాది.మునుపటి మాలి గెడ్డం బాబు అరిచి గీపెట్టేవాడు పులిరాజా, వాడి కొడుకు దొంగలని! ఏమో తను దోచుకోవలిసింది వీళ్ళు దోచుకుంటున్నారనో లేక ఈ దొంగతనం బయటపెడితె పులిరాజా వుద్యోగం తనకు మళ్ళీ దొరుకుతుందనో??

గెడ్డం బాబు ఆరోపణలని పులిరాజా చిరునవ్వుతో కొట్టిపడెసేవాడు!అంతా  గెడ్డం బాబు కుళ్ళుమోత్తనమని, తొమ్మిదేళ్ళగా తోటమాలి గా వున్న తనివితీరక గ్రామ ప్రజలని తన పై అనవసరంగా అనుమానపడెటట్టు చెయ్యడమే వాడి పని అని, వాడు మాలిగా వున్న కాలం లో జరిగిన అవకతవకులు తాను బయట పెడతాను అని అనేవాడు. ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని కాలం గడుపుతుంటే ఇటువైపు జగ్గడు,గాలిరెడ్డి ఓబులావృక్షం ని నిలువనా దోచిపారేసేవాళ్లు! అయితే ఒక రోజు పాపమనే పాము కరిచి పులిరాజా మరణించాడు. కధ మలుపు తిరిగింది ఇక్కడే!!

గెడ్డం బాబు దొరికిందే అదను అని రెచ్చిపోయాడు. తండ్రి అండ లేని జగ్గడిని,గాలిరెడ్డి ని ఎలాగైనా దొంగలుగా నిరూపించాలని శపధం పూనాడు.అయితే జగ్గడు తండ్రి మరణం తరువాత మాలి పని తనకే దొరకడం ఖాయమనుకున్నాడు.అలా అయితే తన దొంగ పనులు నిరాకంటంగా కొనసాగించవచ్చని ఆశపడ్డాడు.ఈ లోపు గెడ్డం బాబు వుచ్చు బిగించసాగాడు.కాని కధలో మరో ట్విస్ట్!!
రోశం అంటె తెలియని మీసాలే లేని రొయ్య గారు ముదు ముసలి కాలంలో మాలి గా నియమించ బడ్డాడు.ఇది జగ్గడికి మింగుడు పడలేదు. ఇలా అయితే తను ఇంకా దొంగతనం కొనసాగించడం తరువాత ముందు చెరసాల పాలు కావడం తప్పదని తెలుసుకున్నాడు. డబ్బులు ఇచ్చ్చి జనాలని కొనుక్కుని వాళ్ళ చేత తనకి మాలి ఉధ్యోగం వచ్చెటట్టు పైరవి చేయించసాగాడు.కాని రొయ్య గారు మటుకు పోనిలెమ్మని వూర్కుంటారా?ఆయనకి వయసు మీద పడ్డ వచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టం లేదు.తన ప్రయత్నాలు ఆయనా చేసాడు. ఇరుకున పడ్డ జగ్గడు, గాలి రెడ్డి బ్రహ్మాస్త్రం వదిలారు.గ్రామ ప్రజల దృష్టి మరల్చడానికి తాగుబోతు ముక్కు చంద్రం కి డబ్బులు ఇచ్చి కొనేసారు.తన వర్గం వారిని రెచ్చగొట్టి దృష్టి మరల్చడానికి ప్రయత్నిచాడు. 
తాగుబోతు ముక్కు చంద్రం తన వర్గం వారికి వివక్ష జరుగుతుంది అని,మిగిలిన వారంతా తమ శ్రమ ఫలాన్ని దోచుకుంటున్నారని, అమాయకులని చేసి ఆడుకుంటున్నారని, తమ వర్గ సంప్రదాయ కట్టుబాటులే వేరని, కాబట్టి తోటని విడగొట్టి తమ వర్గం వారికి వేరేగా ఇచ్చెయాలని నిరాహార దీక్ష మొదలెట్టాడు.వాడి ఆరోపణల్లో నిజానిజాలు పక్కన పెడితే నిరాహార దీక్ష మటుకు చాలా గొప్పది.రొయ్య గారు అవసరమైన దానికంటె ఎక్కువ హడావుడి చేసి చేతులు కాల్చుకున్నాడు.రెండు రోజులు ఆగితే వాడు మటుకు వాడే లేచి కుర్చునేవాడు, దొంగతనంగా బిర్యాని పొట్లం తెప్పిచ్చుకుని దొరికిపోయాడు.అయితే అప్పటికే ఆ వర్గ ప్రజల మన్సుల్లో విషం నింపడం లో సఫలం అయ్యాడు ముక్కు చంద్రం! మిగిలిన వూరి ప్రజలని అనుమానం గా చూడసాగారు వారు. మానిన గాయాలని రెచ్చగొట్టాడు ముక్కు చంద్రం.వాడి మాయమాటల్లో పడిపొయిన వారిని చూసి జాలి పడాలో, అర్హత లేకపోయినా పేద్ద నాయకుడు అయ్యిపొయిన చంద్రం ని ఏడవాలో తెలియని పరిస్థితి!! ఎంకి పెళ్ళి సుబ్బి చావు కి వచ్చినట్టు జగ్గడి దొంగ బుద్ది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.దొంగలు దొరల్ల తిరుగుతుంటే జనాలు మటుకు అనవసరం గా వారి మాయలో పడి ప్రాణ త్యాగాలు, పగలు కక్షలు అంటు తమ జీవితాలు పాడుచేసుకుంటున్నారు!!

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. radhika అంటున్నారు:

  🙂 నా తెలివికి మీ జోహార్లు!!

 2. siri siri muvva అంటున్నారు:

  mee kalpitha(mee uddesam lo) katha bavundhi……

 3. చిలమకూరు విజయమోహన్ అంటున్నారు:

  బాగుంది.

 4. దారిన పొయ్యే దానయ్య అంటున్నారు:

  ఈ కథ కు ముందు ఇంకొక చిన్న పిట్టకథ ఉంది
  గడ్డం బాబు మాలి గా ఉన్న కాలంలో ఉన్న ఫలసాయం మొత్తం ఎవరికీ పంచకుండా ఒక్కడే దాచుకుని దానితో సింహపురం లో ఒక పూటకూళ్ళ ఇల్లు కట్టుకుని ఉన్నాడు. దాన్ని కాస్తా ఎవరులేని సమయంలో దారిదోపిడి దొంగలు దోచుకుని ఆక్రమించుకున్నారు. అప్పుడు గడ్డం బాబుకు ఏం చెయ్యలో పాలుపోక మళ్ళొకసారి తోటమాలిగా చేసి ఇంకాస్త వెనకేసుకుందాం అని ఆలోచించాడు. ఈ ఆలోచన పసిగట్టిన పులిరాజా గడ్డం బాబుని తోట దరిదాపులకు కూడ రానివ్వకుండా అడ్డుకున్నాడు. అందుకే గడ్డం బాబుకు పులిరాజన్నా జగ్గడన్నా అంతకోపం.

 5. saamaanyudu అంటున్నారు:

  మీ వ్యంగ్యం బాగుంది. కానీ మొదటినుండి తెలంగాణా ఉద్యమం ప్రజలతోనే వుంది. అది ప్రతిసారీ పాలకవర్గాల చేతిలో మోసానికి గురౌతోంది. నాయకుల నిజస్వరూపం అర్థమయిననాడు విద్యార్థిలోకంలానే ప్రజలంతా ఉద్యమిస్తే వారి కల సాకారమవుతుంది.

 6. Jayavani అంటున్నారు:

  Polititians are supposed to be elected “by the people”, “from the people” and “for the people”. But in fact the money they spend in terms of alcohol or TVs or what ever in the elections campaigns to attract innocent people is the one that is actually electing them, not the actual people. So the first clause by the people is proven wrong, so they can’t obey to the third clause which is “for the people”. Because they have to get back what they had invested with as much profit as possible.
  Who doesn’t like money or power? Even the film actors change parties, forget friendship to get what they want.
  So it all comes to a point where it is the common man’s own mistake.
  Not many people want to utilize their valuable vote, some people sell it for cheap liquour, some are too confuzed to decide who has less probability to cheat them this term.
  How many educated and honest people we have into our indian politics. In some countries, if a minister has bought a drink or a lunch for himself using the ministirial credit card, he will be questioned. Imagine how strict the system would be to catch such a small(in term of the amount of money??) dis-honesty. And then the minister would resign from the ministry feeling ashamed, I wonder how sensitive those people would be compared our polititians who do threaten to resign saying that someone had used bad words with them while they would always speak such bad language in the parliament/assembly which is why it has become very popular programme in TV, even it is made available in internet.
  We should be really ashamed of our politics. In fact people living overseas can’t hide their face when someone shows them an article in their local news papers describing how many criminal offenses some of the Indian politians have.

  I am not saying it is the only country with corruption, while we have so many good things about our culture they why can’t we work on things like these?

 7. శ్రీవాసుకి అంటున్నారు:

  మళ్ళీ ఊరు వారంతా ఒక్కటిగా కలిసిమెలిసి ఆ తోటని వాళ్ళ సొంతం చేసుకుంటే బాగుండును.

  • krishna అంటున్నారు:

   మీ కోరిక బాగుంది. కాని నా కోరిక మటుకు కలిసున్నా విడిపోయినా ఈ కక్షలు కార్పణ్యాలు మరుగున పడి ఒకరిని ఒకరు అర్ధం చేసుకోగలిగితే చాలు!!!

 8. krishna అంటున్నారు:

  విజయ మోహన్ గారు, సిరిసిరిమువ్వ,రమాకాంత్ గారు మీకు నచ్చినందుకు కృతఙతలు!

 9. అబ్రకదబ్ర అంటున్నారు:

  🙂

  ఫాంట్ అలుక్కుపోయినట్లుంది. బోల్డ్ చేశారా? తీసేస్తే బాగుంటుందేమో.

 10. Manas అంటున్నారు:

  Pilla Kaaki…

  U r presenting the facts with satire. It is good. But u r using the satire to conceal the aspirations of “Thota”. The Thota wants to be Maali of her own land. Cause the other Maali’s like Puli Raja etc misusing the natural flowers of this thota. Thota or Tilothama whatever it may be it is yelling for freedom from discrimination.

  U stop looking at thota on the perspective of Mukku Chandram or others.

  • krishna అంటున్నారు:

   any piece of land with out people is like a body with out soul!!! whether it is thota ,desert or any thing. what u meant is people’s empowerment,isnt it?? i agree with you as all the “maalis” are (puliraaja,geddam baabu etc) are more selfish than anything.my point is to get all the people of this thota together free of bad blood and hatred even when they are seperated!! thats why im using satire to represent the truths. i have no vallue for mukku chandram’s perspective as his is very distructive to the people and he is misleading them!!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s