ఈ సారీ రైలు ఆగలేదు!

Posted: ఫిబ్రవరి 26, 2010 in రాజకీయం, వ్యంగ్యం
ట్యాగులు:

 ఎందుకు ఆగుతుంది అండి? వచ్చే లాభాలు తగ్గిపొతాయని భయం కాబోలు మన రైలు మంత్రిణి గార్కి! కాని మన రాష్ట్ర ఎంపీలకి చాలా బాధ వేసింది అంట! ఏంటి నవ్వుతారు నిఝ్ఝం! ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన వాళ్ళకి రాస్తా రోకోలతొ గిట్టుబాటు అవ్వడం లేదు! స్టేషన్ కి వెళ్తే తెగ వెయిటింగ్ చెయ్యాలి మరి ట్రైన్ల కోసం!(మరి బోల్డన్ని ట్రైన్లు కదా!)అందుకే చానా బాధపడిపొయినారంట.కాని లాభాలు ముఖ్యం కద.అందుకని మమత గారు మన దక్షిణ మధ్య రైల్వే బాగు దృష్టిలో పెట్టుకుని ఇబ్బడి ముబ్బడిగా కొత్త ట్రైన్లు ఇవ్వకుండా ఆపారంట!
 సరే గాని లాభాలు ఎందుకో చెప్పలేదు కదా!ఇప్పుడు బెంగాలు,బీహారు లా బోల్డన్ని ట్రైన్లు వుంటె అందరికి ఇట్టే రిజర్వేషన్లు దొరికెస్తాయికదా! అప్పుడు టిటి లకి జేబు ఖర్చులు ఎక్కడినుండి వస్తాయండి? టిటిల లాభాలు పక్కన పెడితె మరి రైల్వే కి కూడా లాభాలు తగ్గిపోవు.అందరు టికెట్లు కొన్నారో లేదో చెక్ చెయ్యడానికి అప్పుడు ఎలాగు టిటిలు సరిపోరు కదా!(కొత్త వుద్యోగాలు తెగ ఎక్కువ కదా) మరి మాలాంటి వాళ్ళకి ఫైన్ ఎవరు వేస్తారు? ఇప్పుడు చెప్పండీ లాభమా మరి నష్టమా?(ఎవరికి అని అడగకండి)

ప్రకటనలు
వ్యాఖ్యలు
  1. baatasaari అంటున్నారు:

    బావున్నాయి మీ టపాలు

  2. saamaanyudu అంటున్నారు:

    మీ టపాలు ఆలోచనాత్మకంగా వున్నాయి. అక్షరాలు బోల్డ్ గా వుంటే చదవడానికి సౌకర్యంగా వుంటుంది. గమనించగలరు.

    రైల్వే మంత్రిత్వ శాఖను ప్రతి యేడాదీ రొటేషన్ పద్ధతిలో ఒక్కో రాష్ట్రానికి కేటాయించాలి. లేకపోతే యిలానే వుంటాయి మన బడ్జెట్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s