తటస్థ వాదం-3

Posted: ఫిబ్రవరి 22, 2010 in రాజకీయం
ట్యాగులు:, ,

 తెలంగాణ-ఆంధ్ర (ఒక ప్రేమ కధ)

ఇది ఒక వింత ప్రేమ కధ
                        అనగనగా ఒక అమ్మాయి.పేరు తెలంగాణతిలోత్తమ. నిజాం ఆమె మేనమామ. బలవంతంగా తన కొడుకు కి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఇష్టం లేని పెళ్ళి. దానికి తోడు అనుమానాలు, అవమానాలు! బలవంతపు పెళ్ళి కి ప్రతిఫలం కొడుకు హైదర్.  మనవడిని చాలా ప్రేమ గానే చూసుకునేవాడు నిజాం.తెలంగాణతిలోత్తమ రక్త స్వేదాలు కూడా పిండి, మనవడి ముద్దు ముచ్చటలు తీర్చే వాడు.తన ప్రాణాలు తోడే సేటంతగా  మామ గారికి తన కొడుకు మీద అంత ప్రేమ అని ఆనందించాలో , లేక ఈ నరకం నుండీ బయట పడటానికి తన ప్రాణాలే తీసుకోవాలో తెలిసేది కాదు తెలంగాణతిలోత్తమ కి. ఎలా అయినా అక్కడ నుండి విముక్తి పొందాలని అనుకుంది.ఒక రోజు ఆమె బయటకి వచ్చేసింది.
                       ఆంధ్రా ఆనందం ఆ యువకుని పేరు. తమిళ తంబి కి సవతి తమ్ముడు. తనకి వ్యాపారం లో సరైన స్థానం ఇవ్వలేదు అని తమిళ తంబి తో తెగతెంపులు చేసుకుని బయటకి వచ్చేసాడు. ఒక కొత్త జీవితం మొదలు పెడదామని బయలుదేరిన అతడికి వూరి బయట శివాలయం ఎదురుగా తెలంగాణతిలోత్తమ కనిపించింది.ఒకరి కష్టాలకు ఒకరు ఓదార్పు చెప్పుకున్నారు. శివాలయం పూజారి వారిని భార్యాభర్తలగా పొరబడి దీవించాడు. ఆంధ్రాఆనందంకి  కూడా అప్పటి వరకు లేని ఆలోచన కలిగింది, తెలంగాణతిలోత్తమని పెళ్ళి చెసుకుందామని! కాని అప్పటికే నిజాం కొడుకు తో విఫలమైన వివాహం వలన తెలంగాణతిలోత్తమ వెనుకంజ వేసింది. ఒంటరిగా వుండటమే తనకి ఇష్టం అంది. కాకపోతే కొంతసేపు ఆలోచించి  కొన్ని షరతులు పెట్టింది. తన పుట్టినింటివారికి తోడ్పాటు అందులో ఒకటి. తన కొత్త వ్యాపారం లో  తన వారికి భాగస్వామ్యం, ఇంకా తన వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడడానికి ఏమైతే అవసరం అవుతాయో అవన్ని కలిపించమని అడిగింది.  ఆంధ్రాఆనందం ఒప్పుకున్నాడు ఆనందం గా?

                      కొత్త కాపురం కొన్నాళ్ళు వరకు బాగానే వుండేది. హైదర్ ని కూడా చాలా బాగా చూసుకునేవాడు. “హైటెక్” ఇంఫర్మేషన్ టెక్నాలజి చదివించాడు. అయితే పెళ్ళి కొత్తలో తెలంగాణతిలోత్తమ కి ఒకసారి ఆంధ్రాఆనందం మీద కోపం వచ్చింది. పుట్టినింటికి వెళ్ళిపోతాను అంది. కారణం: తన పుట్టినింటివారు ఇంకా వారి కాళ్ళ మీద నిలబడలేదు అని, అయినా ఆంధ్రాఆనందం తోడ్పాటు ఇవ్వడం ఆపేసాడు అని ఆమె ఆరోపణ. మరి ఆంధ్రాఆనందం చెప్పేదేమిటంటె ఇలాంటి తోడ్పాటు వారి క్షమతని తగ్గించివేస్తుంది, వారి బాగు కోసం, వారు సొంతంగా ఎదగాలని ఎవరి మీద ఆధారపడకూడదని తాను డబ్బు పంపడం మానేసాడు అని. కాని ఆమె మన్సులో ఒక అనుమానపు బీజం! నిజంగా తనని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడా? తన వాళ్ళ బాగు పట్టించుకునే వాడేనా? ఏమయితేనెమి? ఇద్దరు సద్దుమణిగి సంసారం సాగించారు. అయితే…….

                         నడి వయసు కి వచ్చిన వారిద్దరి సంసారం లో చిచ్చు పెట్టేటందుకు వచ్చిన విలన్ మాయల ఫకీరు ముక్కు చంద్రం. తెలంగాణతిలోత్తమ కి మేనమామ తరపు బందువు. ఆమెకి కూడా ముక్కు చంద్రం అంటే ఏ రోజు మంచి అభిప్రాయం లేదు. వాడు పరమ స్వార్ధపరుడు అని ఆమె కి తెలుసు. ఆమె కి ఆంధ్రాఅనందం మీద లేనిపోని అనుమానాలు రేకెత్తించేవాడు. వారు విడిపోతె ఆమె పంచన చేరి ఆమె సంపద కొల్లగొడదామని వాడి ప్లాను. శేఖరం అనే పెద తాత వున్నంత కాలం మాయల ఫకీరు ముక్కు చంద్రం మంత్రాలు పారలేదు.కాని శేఖరం తాత మేడ మీద నుండి పడిపోయి చనిపొయాడు.

                             శేఖరం తాత చనిపొయాక ఆంధ్రాఆనందం ఇంట బయట పరిస్థితులు  చాలా మారిపోయాయి. కలత చెందిన అతడు కొంచెం ముభావం గా వుండేవాడు. ఇదే అదను గా ముక్కు చంద్రం కుట్ర పన్నాడు.తెలంగాణతిలోత్తమ మన్సు విరిచేసాడు. తెలంగాణతిలోత్తమ పిన్ని పిల్లల్ని సివిల్స్ చదివించినా, ఆంధ్రాఆనందం తరపు వాళ్ళకి చదివించిన ఇంజనీరింగ్ మాత్రమే గొప్పని వూదరగొట్టెవాడు ముక్కు చంద్రం. సంపాదించినదంతా వాళ్ళ చుట్టాలకే పెడుతున్నాడని  బాదపడెవాడు.మన జాతి ఏంటి ,కులం ఏంటి? వాళ్ళ జాతి కులం ఏంటి అని విభేదాలు కలిపించేవాడు. నీ నగలు నట్రా అంతా అమ్మి ఇంత వ్యాపారం పెంచగలిగాడని అబద్దాల తో చెవి తినేవాడు. 
                                    అవును నిజమే! వ్యవసాయానికి అనువు కాని చోట ఎవరు పొలం దున్నరుగద!తన వాళ్ళకి మట్టి పిసకడమె వచ్చు. అందుకె వాళ్ళకి పొలాలు, సాగు నీటి సాయం చేసాడు. లెక్కలు వచ్చు కనుక ఇంజినీరింగ్ చదివించాడు.అలాగే తెలంగాణతిలోత్తమ చుట్టాల పిల్లలికి సివిల్స్  కోచింగ్ ఇప్పించాడు.ఆంధ్రాఆనందం ఆమె తరపు వాళ్ళని తన వాళ్ళగా భావించి చేపల చెరువులు కట్టించి ఇచ్చాడు.   
  కాని మాయల ఫకీరు ముక్కు చంద్రం మంత్రాలు పని చెసాయి.తెలంగాణతిలోత్తమ కి ఇప్పుడు ఆంధ్రాఆనందం మీద నమ్మకం లెదు.విడిపోదాము అనుకుంటుంది. కొడుకుగా హైదర్ మీద పూర్తి హక్కు తనదే అంటుంది!వారి సంసారం లో చోటు చేసుకున్న అపోహలు దూరం చెయ్యగలరా ఎవరైనా? మీరేమైనా ఆమె కి సలహా ఇవ్వగలరా?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. bondalapati అంటున్నారు:

  చాలా బాగారాశారు “కత”
  పెళ్ళైన కొత్తలో ఆంధ్ర ఆనందం కి కూడా తిలోత్తమ మీద కోపం వచ్చింది.ఆమె ని పుట్టింటికి పంపించాడు. కానీ వాళ్ళ పెదనాన్న చనిపోవటం తో లోన్లీ గా ఫీలయ్యి మళ్ళీ తిలోత్తమని తెచ్చుకున్నాడు.

  • pillakaaki అంటున్నారు:

   తానే బయటకి పోతాను అన్నట్టు వున్నాడు కదా! అది కూడా తప్పే! పెళ్ళి కొత్తలో ఇలాంటి గొడవలు జరుగుతాయంటె అది సామాన్యమే! కాని ఈ నడి వయసు లో ఇన్నాళ్ళ సంసారం తరువాత ఇలాంటి గొడవ బాధాకరం!

 2. ghattamaneni అంటున్నారు:

  ఆంధ్రా ఆనందం కష్ట పడిందేంటో నాకైతే తెలియట్లేదు.. ఇళ్ళరికం వచ్చినోడు ఆనందం… తెలంగాణ సొమ్ముతోనే తన ఊరిని బాగు చేస్కున్నాడు… దొంగ వాడు… అలాంటి వాడి దగ్గర ఉండ లేక వచ్చెస్తోంది బయటికి…

  • pillakaaki అంటున్నారు:

   ఇక్కడ ఇల్లరికం అత్తరికం ఏమి లేదు! ఇద్దరు కలిసి వేరుగా కాపురం పెట్టారు. తిలోత్తమ వద్ద వున్నదానితో తాను బాగుపడ్డాడు, అలాగే తన కష్టం తో ఆమెని సుఖపెట్టాడు. చెప్పానుగా రంగారెడ్డి , మెదకయ్య , ఖమ్మ వాసులకు (పారిశ్రామిక) చేపల చెరువులు, తన వారికి (క్రిష్ణ గోదావరి బేసిన్ లో) పంటలకి సాయం చేసాడు. ఇప్పుడు కొడుకు ఎదిగి వచ్చినప్పుడు తనకి చేదోడు వాదోడు గా వుండవలిసిన సమయం లో , ముక్కు చంద్రం మాయ మాటలు విని తిలోత్తమ తన కొడుకు తో పాటు గా దూరం పొతుందట! కరెక్టేనా?

 3. Jayavani అంటున్నారు:

  This story is quite good and clear to a person like me who does not know much about the issues in AP. Its narrated in simple words to make everyone understand the problem.
  But if I understood it correctly, no one else should have any rights on her own son, Hyder. And if the question is about whether should they live together or get seperated, they themselves should take a decision. But who is representing her from her side, is it chandram, then if she trusts him, then it will be her own fault, if something goes wrong.
  But I would assume both of them are doing good individually, and if she thinks that he is exploiting her, then it’s better to get seperated. We should calculate whether it is worth living together or get seperated.
  By the way, is AndhraAanandam is really concerned about her wellbeing or worried that if she leaves him, he will loose all the benefits that he would get from her. We should really question his faithfulness here as well before coming to conclusions.

 4. శ్రీవాసుకి అంటున్నారు:

  కథ బాగుంది. కథ వ్రాసిన తీరు బాగుంది. చక్కగా అర్థమవుతోంది.

 5. Rajendra అంటున్నారు:

  The analogy is pretty good except that hyder cant be the son of thelangana thilothama and andhraanandham as hyder has born before andhraanandham came. So can’t say that both have equal rights on hyder

 6. Manas అంటున్నారు:

  Ayya Pilla Kaaki

  At last u agree one thing is that the region is exploited by mor than one like Indra (Centre by uniting) and allured by its natural beauty (resources) Andhra Anandam grabbed the hand of Tilothamma (As u know that they (Rambha/Menaka/Tilothhama) have to obey the orders of Indra to please somebody)

  The Andhra Anandam do not pay the respect to ‘Mangal Sutra’ n rituals (May be it is a fake one like 6 point formula etc).

  The marriage itself is a “Rakshasa Vivaham”. Not a Swayamvaram.

  Not only Andhra Aanandam as ‘Jayavani’ quoted but also the locale Chandram is in the same intentions. To hide his mistakes Andhra Aanandam pointing towards Chandram.

  “By the way, is AndhraAanandam is really concerned about her wellbeing or worried that if she leaves him, he will loose all the benefits that he would get from her. We should really question his faithfulness here as well before coming to conclusions.”

  Aandhra Aanadam is not trying to convincing the Tilothama that he is not a selfish but a faithful one, but making his relatives (forgetting about tilothama’s side) to come united and pressurize to keep his marriage intact.

  This is the main cause Tilothama losing her blind faith in Andhra Aanadam. She never lost before the faith for the tease calls from chinna/ chandram etc.

  • pillakaaki అంటున్నారు:

   what i strongly object is accepting politicians opinions as common public mandatte!! at the time of union i dont think there was this much hatred between tilottama and anandam. in deep (the people of both regions)both anandam and tilottama are connected strongly(not like tamila tambi- anandam or tilottama and nijam), whatever the differences they can be sortedout by dialogue and discussion. and coming to anandam’s reaction to tilottama’s decission i think he’s overeacted. may be because of shock he got from indra’s statement.

 7. Manas అంటున్నారు:

  Dear Pillakaaki

  Your statement “What i strongly object is accepting politicians opinions as common public mandatte!!”
  is a fact on both sides and it is the tragedy in democratic system of representatives.

  You glance at the previous election results and wonder how many of the great and greatest leaders got majority (i,e, more than 50%) votes to keep the constitutional spirit of democracy.

  Consider these:

  In last elections-

  A city has 4 lakh population
  Nearly 3 lakh voters on list
  30% i,e 90 thousand votes polled
  The winner got nearly 30000 votes and won by majority of 900 votes to his nearest contender.

  And we officially declares that he is the representative of 4 lakh people. Actually he got the consent of 7% population and 10% of voters. That means 90% people’s opinion is ignored

  That is our Democracy!
  And morale and spirit of elections are not on the basis of needs of citizens but influential factors like religion, creed, cast and sentiments prevail at that time.

  After assassination of Mrs Gandhi Congress swiped the polls on sympathy vote. Same should have been happen if polls were conducted after YSR death. It is irrespective that on what priorities one should think before vote.

  A minimum of 180 years of knowledge gap is there between Telengana and Seemaandhra regions. TG people not got the exposure to the modern tech and education from Britishers. That gap has been utilized (exploited other way) by some sectors of seemandhrans. As and when TG people getting knowledge on generation the questioning attitude is raising.

  Nobody on both sides are worrying about the common man or plight of Telugu. Every body has their vested interests.

  Manas

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s