తటస్థవాదం-2

Posted: ఫిబ్రవరి 15, 2010 in రాజకీయం
ట్యాగులు:, ,

  సమాజం లో ఒక వర్గం ఆకాంక్షలు అర్దం చెసుకునేటప్పుడు చారిత్రిక , సామాజిక మరియు ఆర్దిక ఆంశాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వారి భావేవాశాలుని కూడా అర్దం చెసుకోడానికి ప్రయత్నించాలి. తెలంగాణ వంటి సున్నిత అంశం లొ ప్రత్యేక వర్గానికి చెందిన సెంటిమెంట్స్ కి విలువ ఇవ్వాలి. కాబట్టి నిందారోపణలు ఆపి ఇరు వర్గాలు ఎదుటి వారి పట్ల గౌరవంతొ వారి మనోభావాలని తెలుసుకోవాలి.

 కొన్ని కొన్ని సార్లు మనం మన జీవితానికి సంబందించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివి పెట్టి ఆలోచించే కంటె మనస్సు పెట్టి ఆలొచిస్తాం. కాని అది మన జీవితం మన ఇష్టం. మరి ఒక సమాజానికి సంబందించిన నిర్ణయం అలా చెయ్యగలమా? కనీసం ఒక వర్గ వాదన వినేటప్పుడైనా వారి భావావేషాలు పరిగణన లొ కి తీసుకోవాలి.
         తెలంగాణ ప్రజలు చాలా సులభంగా భావోద్వేగాలు కి లొను అవుతారు. మంచి మనస్సున్న భోలా మనుషులు. చర్చల లో నెగ్గేటంత వాక్చాతుర్యం లేదు. కోస్తాంద్ర ప్రజలు వాక్చాతుర్యులు. లౌక్యం తెలిసిన వారు. అంత మాత్రాన్న ఒకరు కరెక్ట్ ఒకరు తప్పు అన్లేము.

      1959 జెంటెల్మెన్ అగ్రీమెంట్ అమలు లొ ప్రస్తుతం చర్చ కి దారి తీస్తున్న అంశాలు ప్రభుత్వ వుద్యోగాలలో ప్రత్యేక ప్రాతినిద్యం. అసలు ఒప్పందం లొ ఇది 5 సంవత్సరాలకే పరిమితం అయినా దాని పొడిగింపు కై 1969 లో వుద్యమం జరిగింది. కాని స్థానికులు అంటె ఎవరు? తెలంగాణ(ముఖ్యం గా హైదరాబాదు ) లొ ఏడు సంవత్సరాలగా వున్న ప్రతి ఒక్కరు, కోస్తా, సీమ , ఉత్తర భారతీయులు అందరు మరి స్థానికులు గానే పరిగణించ బడతారు. అలా కాకుండా అభ్యర్దుల పుట్టుక ప్రామాణికం అయితె పైన పేర్కొన్న వారి పిల్లలు అర్హత పొందుతారు. మరి అప్పుడు కూడా తెలంగాణ బిడ్డలకి ప్రాతినిద్యం దొరుకుతుందా? సరె ఇంకొన్ని తరాల వెనుకకు వెళదాము. అయితె ఎన్ని తరాల వెనుకకు? ప్రాంతీయ భేదభావాలు లేని కాలానికి ?కుళ్ళు రాజకీయాలు లేని కాలానికి?

   యాసని బట్టి ప్రాంతాన్ని పసిగడదామా? మరి కోస్తా వారి పిల్లలు కూడా అక్కడే పుట్టీ అక్కడి భాష నేర్చుకున్నారే? తెలంగాణ పిల్లలు బయట చదువుకుని అసలు భాష మర్చిపొయారే? టాలుస్టాయ్ ఒక కద  లో పిల్లల గొడవలో పెద్దలు జుట్లు పట్టుకొంటె , పిల్లలు ఏమి ఎరగనట్టు మళ్ళీ కలిసి మెలిసి ఆడుకుంటుంటారు. అలా వుందీ ఈ ప్రాతిపదిక కూడా. దీని వల్ల అసలు లబ్దిదారులు లాభపడతారా ?

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. Sankar అంటున్నారు:

  Any region can not be seperated just based on emotional & sentimental issues. There should be some sensible reasons. What if they repent their decission after 2years? It should be done on Scientific study of their claims/allegations.

 2. venkatarao అంటున్నారు:

  venkatakrishna super mama nuvvu chala great

 3. Nutakki raghavendra Rao అంటున్నారు:

  Venkata krishna gaaroo, in this subject so many inter connected things (facters), are there to discus in different angles.
  A sensitive issuie more than a sentiment…Nutakki

 4. రహంతుల్లా అంటున్నారు:

  రెండు రాష్ట్రాలు తప్పు కాదు
  * అసమానతలెలా వచ్చాయో చెబుతా
  * కమిటీకి నేనూ లేఖ రాస్తా
  * అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యం
  * మంత్రి బొత్స వ్యాఖ్యలు
  హైదరాబాద్‌, న్యూస్‌టుడే : తెలుగుమాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ”ఒకే రాష్ట్రం ఉండాలని అంటున్నారు… ఇలా ఉన్నా అదనంగా కలిగిన ప్రయోజనం ఏమిటి” అని ప్రశ్నించారు. ఇప్పుడు 33 మంది ఎంపీలు ఉన్నా, గతంలో తెదేపాకు 25 మంది ఎంపీలున్నప్పుడూ కేంద్రంలో ఒకే కేబినెట్‌ పదవి దక్కిందన్నారు. రెండు రాష్ట్రాలు ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి తెలుగువారి ప్రయోజనాలు కాపాడతారన్నారు. ప్రాతినిధ్యం పరంగా చూస్తే కేంద్రంలో గోవా సీఎంను మన సీఎంను ఒకేలా చూస్తున్నారని గుర్తించుకోవాలన్నారు.

  శ్రీకృష్ణ కమిటీకి తాను సొంతగా లేఖ రాయనున్నట్లు బొత్స తెలిపారు. ప్రాంతీయ అసమానతలు ఎందుకు తలెత్తాయనేది అందులో వివరిస్తాననిస్పష్టంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతానని అన్నారు. పెద్దమనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల కార్యక్రమం వంటివి పాలనాపరమైన వైఫల్యాలతో సక్రమంగా అమలు కాలేదన్నారు. రాష్ట్ర విభజన చేసే ముందు విద్య, పరిశ్రమలు, నీరు, మౌలిక సదుపాయాలు వంటి కీలకమైన వాటిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విభజన చేస్తే వీటి పర్యవేక్షణకు కమిటీ వేయాలన్నారు.

  హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టిన వారిలో 95శాతం మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారేనని తెలంగాణ వారు 5 శాతం మాత్రమే అని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన సామాన్యుడు హైదరాబాద్‌కు ఎందుకు రావాలని అనుకుంటారు?… రాజధాని ఎక్కడ? కలసి ఉండాలా? విడిపోవాలా? అనే ఆలోచనకన్నా తనకు ఉపాధి తిండి గురించి ఆలోచిస్తారని అన్నారు. విజయవాడ రాజధాని అయితే దాని చుట్టూ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖపట్నం రాజధాని కావాలని తాను అడగడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈనాడు 27.2.2010

  • pillakaaki అంటున్నారు:

   రెండు ఏమిటండి ఐదు రాష్ట్రాలున్నా తప్పు లెదు. కాని అది పూర్తిగా అభివృద్ది ప్రదానంగా వుండాలి తప్ప రాజకీయనాయకుల ఆకాంక్షలు తీర్చేటట్టు వుండనక్కరలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s